స్వస్థత పరిచర్య

23/173

ఆరోగ్య సూత్రాల జ్ఞానం అవసరం

ఆరోగ్య సూత్రాల జ్ఞానం ఇప్పుడు అవసరమైనతంగా మరెప్పడూ అవసరమై ఉండదు. జీవితంలో వసతులు సౌకర్యాలకు, పారిశుద్యానికి వ్యాధుల చికిత్సకు సంబందించి ఎంతో అభివృద్ధి జరిగినా శారీరక దారుడ్యం , సహనశక్తి విషయాల్లో క్షీణత ఆందోళనకరంగా ఉంది. సాటి మననుషుల క్షేమాభివృద్ది కోరే వారందరి గమనాన్ని ఇది ఆకర్షించి తీరాలి. MHTel 95.2

మన కృత్రిమ నాగరికత ఆరోగ్యదాయకమైన నియామాల్ని నాశనం చేసే దురభ్యాసాలు దురాచారాలను ప్రోత్సహిస్తుంది. ఆచారం, ఫ్యాషన్ ప్రకృతి పై దాడి చేస్తున్నాయి. అవి విధించే అభ్యాసాలు. అది పెంచి పోషించే “కోరింది అనుభవించే తత్వం” క్రమ క్రమంగా శారీరక, మానసిక శక్తిని తగ్గించి మానవ జాతిపై భరించలేని భారాన్ని మోపుతుంది. అమితానుభవం, నేరం, వ్యాధి దౌర్భగ్యం అన్ని చోట్లా దర్శనమిస్తాయి. MHTel 95.3

అనేకులు అజ్ఞానం వల్ల ఆరోగ్య చట్టాలను అతిక్రమిస్తున్నారు. వారికి ఉపదేశం అవసరం. కాని ఎక్కువ మంది తెలిసే తప్పు చేస్తున్నారు. తమ జ్ఞానాన్ని తమ జీవితానికి మార్గదర్శిని చేసుకోవటం ప్రాముఖ్యమని వారికి నొక్కి చెప్పటం అవసరం. ఆరోగ్య సూత్రాల జ్ఞానాన్ని అందించటానికి వాటిని ఆచరణలో పెట్టటం ప్రాముఖ్యమని చూపించటానికి ఈ రెండింటిని చెయ్య టానికి వైద్యుడికి చాలా అవకాశాలున్నాయి. ఎనలేని హాని చేస్తున్న దురభ్యాసాలను సరిద్దటంలో సరిఅయిన ఉపదేశం ఎంతో మేలు చేస్తుంది. MHTel 95.4

ఎంతో వ్యాధికి ఇంకా అనేక కీడులకు పునాది వేస్తున్న దురభ్యాసం హానికరమైన మందుల్ని స్వేచ్చగా వాడటం, వ్యాధి బారిన పడినప్పుడు అనేకుకలు తమ సమస్యకు కారణాన్ని వెదకటానికి ప్రయత్నించరు. బాధను అసౌకర్యాన్ని తొలగించటానికే తాపత్రయ పడుతుంటారు. కనుక వస్తుగుణాల్ని గురించి తమకు తెలియని పేటెంటు మందుల్ని వేసుకుంటారు లేదా తాము చేసిన పొరపాటును సరిదిద్దుకోవటానికి ఏదో విరుగుడు కోసం వైద్యుణ్ణి ఆశ్రయిస్తారు గాని తమ అనారోగ్యకరమైన అలవాట్లును మార్చుకోవాలని మాత్రం ఆలోచించరు. వెంటనే ఫలితం కనిపించకపోతే వారు మరో మందు, అదీ ఫలితాన్నివ్వకపోతే ఇంకో మందు వేసుకుం టారు. ఇలా ఆ కీడు కొనసాగుతూనే ఉంటుంది. MHTel 96.1

మందులు వ్యాధిని నయంచెయ్యలేవని ప్రజలకు నేర్పించటం అవసరం. కొన్నిసార్లు అవి తాత్కాలిక ఉపశమనం ఇస్తాయనటం వాటిని వాడటం వల్ల రోగి బాగుపడతాడనటం నిజమే. ఎందుకంటే విషాన్ని బయటకి నెట్టి వెయ్యటానికి వ్యాధిని కలిగించే పరిస్థితులను సవరించటానికి ప్రకృతికి చాలినంత జీవశక్తి ఉంది మందుల వల్ల కీడు జరిగినా ఆరోగ్యం సరి అవుతుంది. కాని అనేక సందర్భాల్లో మందు వ్యాధి రూపాన్ని, దాని స్థలాన్ని మాత్రమే మార్చుతుంది. తరుచు విషయ ఫలితం కొంతకాలం తుడుపు పడినట్లు కనిపించవచ్చు. కాని దాని ఫలితాలు దేహంలోనే మిగిలి ఉండి అనేక మరింత హాని కలిగిస్తాయి. MHTel 96.2

విషపూరితమైన మందుల వాడకం వల్ల అనేకులు జీవితమంతా కొనసాగే వ్యాధుల్ని కొని తెచ్చుకుంటారు. ప్రకృతి పద్ధతుల వినియోగం ద్వారా కాపాడుకోగల అనేక జీవితాలు అంతమొందుతాయి. స్వస్థతగా పిలిచే అనేక మందుల్లో ఉన్న విషాలు ఆత్మను శరీరాన్ని నాశనం చేసే అలవాట్లును వాంఛలను సృష్టిస్తాయి,. పేటెంటు మందులుగా పిలవబడే అనేక చిట్కాలు, వైద్యులు రాసి ఇచ్చే కొన్ని మందులు సయితం సమాజానికి భయంకర శాపమైన సారా అలవాట్లుకు, నల్లమందు, విభిన్న అలవాట్లుకు పునాదులు వెయ్యటంలో ఓ పాత్ర పోషిస్తాయి. MHTel 96.3

సరియైన నియమాల ఆచరణలో ప్రజలను చైతన్య పర్చటం ద్వారానే మెరుగైన పరిస్థితులకు ఎదురు చూడగలం పునరుద్ధరణ శక్తి మందుల్లో లేదు గాని ప్రకృతిలో ఉన్నదని వైద్యులు ప్రజలకు నేర్పించాలి. ఆరోగ్య సూత్రాల ఉల్లంఘన ఫలితంగా ఏర్పడే పరిస్థితుల నుంచి శరీర వ్యవస్థను విడిపించటానికి ప్రకృతి చేసే ప్రయత్నమే వ్యాధి. వ్యాధి వచ్చినప్పుడు దాని కారణాన్ని తెలుసుకోవాలి. అనారోగ్యకర పరిస్థితులను మార్చాలి. చెడు అలవాట్లును మానాలి. అప్పుడు మలినాలను బహిష్కరించి, దేహ వ్యవస్థలో సరియైన పరిస్థితులను తిరిగి స్థాపించే కృషిలో ప్రకృతికి సహాయమందించాలి. MHTel 97.1