స్వస్థత పరిచర్య
8—వైద్యుడు ఓ ఉపాధ్యాయుడు
నిజమైన వైద్యుడు విద్యనేర్పే ఓ ఉపాధ్యాయుడు తన ప్రత్యక్ష శ్రద్ధ క్రింద ఉన్న రోగుల పట్ల మాత్రమే గాక తాను నివసిస్తున్న సమాజం పట్ల కూడా తనకు బాధ్యత ఉన్నదని గుర్తిస్తాడు. శారీరక, నైతిక ఆరోగ్యం విషయంలో అతడు సంరక్షకుడుగా నిలుస్తాడు. రోగుల చికిత్సలో సరియైన పద్ధతులను నేర్పటానికే కాక సరియైన జీవన అభ్యాసాలు అలవాట్లను ప్రోత్సహించటానికి, సరియైన నియమాల జ్ఞానం వ్యాప్తి చెయ్యటానికి కూడా అతడి కృషి సాగాలి. MHTel 95.1