స్వస్థత పరిచర్య
ప్రకృతి చికిత్స పద్ధతులు
స్వచ్చమైన గాలి, సూర్యరశ్మి, మితాహార పానాలు, విశ్రాంతి వ్యాయమం, సరియైన ఆహారం. నీటి వినియోగం, దైవ శక్తిలో విశ్వాసం... ఇవి నిజమైన ఔషదాలు. ప్రకృతి చికిత్సా సాధనాలను, వాటిని ఉపయోగించే పద్దతులను గూర్చిన జ్ఞానం ప్రతీ వ్యక్తికి ఉండాలి. రోగులకు చికిత్స చేయటంలో పాటించాల్సిన నియమాల్ని గ్రహించడం, ఈ జ్ఞానాన్ని సరిగా ఉపయోగించటానికి సామర్ధ్యాన్నిచ్చే ఆచరణాత్మక శిక్షణ పొందటం రెండు అత్యవసరం. MHTel 97.2
ప్రకృతి చికిత్సా సాధనాలు వినియోగానికి ఎంతో శ్రద్ధ కృషి అవసరం. ఇందుకు అనేకులు వీటిని ఇష్టపడరు. ప్రకృతి స్వస్థత, నిర్మాణ ప్రక్రియ క్రమ క్రమంగా సాగుతుంది. ఓర్పు లేనివారికి అది నెమ్మదిలా కనిపిస్తుంది. హానికరమైన అలవాట్లు మానుకోవాలనుకునే వ్యక్తి త్యాగం చెయ్యాల్సి ఉంటుంది. కాని ఎదురులేని ప్రకృతి తన పనిని తెలివిగా, చక్కగా చేస్తుందని తుదకు తేలుతుంది. ప్రకృతి నియమాల్ని ఎవరు పట్టుదలతో ఆచరిస్తారో వారు శరీరారోగ్యాన్ని మానసికారోగ్యాన్ని ప్రతిఫలంగా పొందుతారు. MHTel 97.3
సర్వ సాధారాణంగా ఆరోగ్య సంరక్షణ పట్ల తక్కువ శ్రద్ధ చూపటం జరుగుతుంటుంది. వ్యాధి వచ్చినపుడు చికిత్స చేయ్యటం ఎలాగో నేర్చుకోవటం కన్నా వ్యాధి రాకుండా నివారించుకోవటం ఎంతో మేలు. ప్రతీ వ్యక్తి తన కోసం మానవ జాతి కోసం ఆరోగ్య సూత్రాల గురించి జ్ఞానం సంపాదించటం వాటికి విధేయంగా జీవించటం తన విధి. అన్ని నిర్మాణ క్రమాల్లో అత్యద్భుతకరమైన శరీర నిర్మాణ క్రమం గురించి అందరూ తెలుసుకోవటం అవసరం. వివిధ అవయవాల విధులను గురించి. అన్నీ ఆరోగ్యవంతంగాని పనిచెయ్యటానికి అవి ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉండటాన్ని గురించి వారు అవగాహన చేసుకోవాలి. శరీరం మనసు ఒకదానిపై ఒకటి చూపే ప్రభావం గురించి వాటిని నియంత్రించే నియమాల గురించి వారు అధ్యయనం చేయ్యాలి. MHTel 97.4