స్వస్థత పరిచర్య

19/173

2. వైద్యుడి సేవ

7—వైద్యుడి సేవ

దేవుడు మానవడు కలసి పని చెయ్యటం

స్వస్థత పరిచర్యలో వైద్యుడు క్రీస్తుతో జతపనివాడు కావాలి, రక్షకుడు ఆత్మ శరీరం రెండింటి స్వస్థత కూర్చాడు. ఆయన బోధించిన సువార్త ఆధ్మాత్మిక జీవతాన్ని శారీరక పునరుద్దరణను గూర్చిన వర్తమానం. పాప విముక్తి వ్యాధి స్వస్థత పరస్పర సంబంధం కలవు. క్రైస్తవ వైద్యుడికి అదే పరిచర్య అప్పగించబడింది. అతడు సాటి మనుషుల శారీరక, ఆధ్మాత్మిక అవసరాల్ని తీర్చటంలో క్రీస్తుతో కలసి పనిచెయ్యలి. వ్యాధిగ్రస్తులకు అతడు కృపా దూత కావాలి. వ్యాధికి గురి అయిన వారి శరీరానికి, పాపం వల్ల వ్యాధిగ్రస్తమైన వారి ఆత్మకు స్వస్థత తేవాలి. MHTel 81.1

వైద్య వృత్తికీ క్రీస్తే నిజమైన అధిపతి. ప్రధాన వైద్యుడైన ఆయన మానవ బాధను నివారించటానికి కృషి చేసే, దైవభీతి గల, ప్రతి వైద్యుడి పక్క ఉంటాడు. వైద్యుడు ప్రకృతి నివారణ పద్దతులు ఉపయోగించే టప్పుడు శరీరాత్మలు రెండింటి వ్యాధులనూ స్వర్గపర్చగల దేవుని వైపుకు రోగుల గమనాన్ని తిప్పాలి. వైద్యులు ఏమి చేయ్యటంలో మాత్రమే సహాయం చెయ్యగలరో దాన్ని క్రీస్తు పూర్తి చేసాడు. ప్రకృతి నిర్వహించే స్వస్థత చర్యలో సహాయం చెయ్యటానికి వారు కృషి చేస్తారు. స్వస్థపర్చేవాడు క్రీస్తే, వైద్యుడు ప్రాణాన్ని కాపాడటానికి ప్రయత్నిస్తాడు. క్రీస్తు ప్రాణాన్ని అనుగ్రహిస్తాడు. MHTel 81.2