స్వస్థత పరిచర్య

20/173

స్వస్థతకు మూలం

తన అద్భుత కార్యాల్లో రక్షకుడు మానవుణ్ణి సంరక్షించటానికి స్వస్థ పర్చటానికి అతడి పక్షంగా నిత్యం పనిచేసే ఓ శక్తిని బయలుపర్చాడు. ప్రకృతి సాధనాల ద్వారా మనల్ని సజీవులుగా ఉంచటానికి మనల్ని నిర్మించటానికి, పునరుద్దరించానికి దేవుడు దిన దినం, గడయ గడియ క్షణం, క్షణం పనిచేస్తున్నాడు. శరీరంలో ఏ భాగానికైన గాయమైతే వెంటనే స్వస్ధత ప్రక్రియ ప్రారంభమౌతుంది. ఆరోగ్యాన్ని పునరుద్ధరించటానికి ప్రకృతి సాధనాలు పనిచేస్తాయి. కాని ఈ సాధనాల ద్వారా పనిచేసే శక్తి దేవుని శక్తి. ప్రాణమిచ్చే శక్తి ఆయనకే ఉంది. ఒకరు వ్యాధి నుండి కోలుకున్నప్పుడు అతణ్ణి పునరద్దురించింది దేవుడే. వ్యాధి బాధ, మరణం ప్రత్యర్ధి శక్తి పని. సాతాను నాశనం చేసేవాడు. దేవుడు పునరుద్ధరించేవాడు. MHTel 81.3

“నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే’ (నిర్గమ 15:26) అని ఇశ్రాయేలుతో అన్న మాటలు నేడు శరీరారోగ్యం ఆత్మ సంబంధమైన ఆరోగ్యం పొందినవారి విషయంలో వాస్తవం. MHTel 82.1

ప్రతీ మానవుడి విషయంలో దేవుని కోరిక ఏమిటో ఈ మాటలు వ్యక్తం చేస్తున్నాయి. “ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయయములలోను వర్దిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్ధించుచున్నాము”. 3 యోహాను 2. MHTel 82.2

అయనే “నీ దోషములన్నింటిని క్షమించువాడు. నీ సంకటములన్ని టిని, కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచు న్నాడు”. కీర్తనలు 103:3,4 MHTel 82.3

వ్యాధిని స్వస్థపర్చినప్పుడు క్రీస్తు అనేక మంది బాధితులను ఇలా హెచ్చరించాడు”. మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకుము”. యెహాను 5:14 దేవుని నిబంధనలను అతిక్రమించటం ద్వారా తాము వ్యాధిని తమ మీదికి తెచ్చుకున్నారని విధేయత ద్వారా మాత్రమే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చునని ఇలా ఆయన బోధించాడు. MHTel 82.4

పునరుద్ధరణ పనిలో తాము దేవునితో సహకరించాలని. రోగులకు వైద్యులు భోదించాలి. వ్యాధి పాప ఫలితమన్న వాస్తవాన్ని వైద్యుడు నిత్యం గుర్తిస్తాడు. పది ఆజ్ఞల సూత్రాల వలె ప్రకృతి చట్టాలు దైవికమైనవిని వాటికి విధేయంగా నివసించటం ద్వారా మాత్రమే ఆరోగ్యాన్ని తిరిగి పొందటం లేక కాపాడుకోటం సాధ్యపడుతుందని అతడికి తెలుసు. తమ పునరుద్ధరణకు తాము చెయ్యవలసినదిగా చేస్తే తిరిగి ఆరోగ్యం పొందగల అనేకమంది హానికరమైన అలవాట్ల వల్ల వ్యాధి బాధలకు గురి కావటం అతడు చూస్తాడు. శారీరక, మానసిక ఆధ్యాత్మిక శక్తుల్ని నాశనం చేసే ప్రతీ అలవాటు పాపమని, మానవాళి మేలు కోసం దేవుడు స్థాపించిన చట్టాలకు విధేయంగా జీవించటం ద్వారా మాత్రమే ఆరోగ్యం సంపాదించ వచ్చన వారికి బోధించటం అవసరం. MHTel 82.5

అనుచిత ఆహారా పానాలు, లేక ఇతర దురభ్యసాల వల్ల వచ్చిన వాధ్యులతో బాధపడుతున్న రోగిని ఓ వైద్యుడు చూసినా దాన్ని గురించి అతడికి చెప్పటం నిర్లక్ష్యం చేస్తే, ఆ వైద్యుడు తన తోటి మానవుడికి హాని చేసినవాడౌతాడు. తాగుబోతులు, పిచ్చివాళ్ళు విచ్చలవిడి వర్తనకు అలవాటు పడ్డవారు. వ్యాధి బాధలు పాపం ఫలితంగా వస్తాయని ప్రకటించాలని వైద్యుడికి విజ్ఞప్తి చేస్తున్నారు. జీవన, సూత్రాల గురించి అతడికి చెప్పకపోతే ఆ వైద్యుడు సాటి మనిషికి హాని చేస్తున్నవాడవుతాడు. బాధ పాప పర్యవసానమని విచ్చలవిడగా ప్రరవర్తించే తాగుబోతులకు, ఉన్మాదులకు వైద్యులు స్పష్టంగా చెప్పాలి. జీవన నియమాల్ని అవగాహన చేసుకున్నవారు వ్యాధి కారణాలను నిర్విర్యం చేయటానికి యదార్ధంగా ప్రయత్నించాలి. నిత్యం బాధతో జరిగే సంఘర్షణను చూస్తూ బాధను తగ్గించటానికి నిత్యం పాటుపడుతూ ఉండే వైద్యుడు మాట్లాడకుండా ఎలా ఉండగలడు? వ్యాధికి చికిత్సగా మితానుభవాన్ని నేర్పించని వైద్యుడు ఉదారత దయ గలవాడేనా? MHTel 83.1

దేవుని ఆజ్ఞల మార్గమే జీవన మార్గమని స్పష్టం చెయ్యాలి. దేవుడు ప్రకృతి చట్టాల్ని స్థాపించాడు. కాని ఆయన చట్టాలు నిరంకుశ ఆజ్ఞలు కావు. భౌతిక చట్టంలోనే గాని నైతిక చట్టంలోనే గాని ప్రతీ.... కూడదు” అన్న ఆంక్ష ఓ వాగ్దానాన్ని సూచిస్తుంది. దానికి మనం విధేయులమైతే మన మార్గాల్లో దీవెనలు పొందుతాం. న్యాయం చెయ్యటానికి దేవుడు మనల్ని ఎన్నడూ ఒత్తిడి చెయ్యడు. కాని మనల్ని దుష్టుని నుండి తప్పించి మేలైనదానికి నడిపిస్తాడు. MHTel 83.2

ఇశ్రాయేలుకు దేవుడు బోధించిన ధర్మ విధుల పైకి గమనాన్ని తిప్పటం అవసరం. తమ అలవాట్లు విషయంలో దేవుడు వారికి ఖఛ్చితమైన ఉపదేశమిచ్చాడు. శారీరక ఆధ్యాత్మిక క్షేమానికి సంబందించిన నిబంధన లను వారికి తెలియపర్చాడు. విధేయత షరతు పై “యెహోవా నీ యెద్దనుండి సర్వ రోగములను తొలగించును” అన్న హామీని ఇచ్చాడు (ద్వితీ 7:15) MHTel 83.3

“నేడు నేను పలికిన మాటలన్నిటిని మీ మనస్సులలో పెట్టుకొనుడి.” ” నీ హృదయమందు వాటిని భద్రము చేసికొనుము. దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చను.”ద్వితీ 32:46, సామె 4:22 MHTel 84.1

క్రీస్తు వరం వలన బహిరంగం చెయ్యబడ్డ పరిపూర్ణతా ప్రమాణాన్ని మనం చేరాలని దేవుడు ఆకాంక్షిస్తున్నాడు. పరలోక సాధనాలతో అనుసంధాన పడటానికి, మనలో దేవుని స్వరూపాన్ని పునరుద్ధరించే నియమాల్ని అనుసరించటానికి మనం సరియైన పక్క ఎంపిక చేసుకోవాలని దేవుడు కోరుతున్నాడు. తన లిఖిత వాక్యంలోను మహత్తర ప్రకృతి పుస్తకం లోను జీవన సూత్రాలను ఆయన వెల్లడి చేసాడు. ఈ సూత్రాలను గూర్చిన జ్ఞానాన్ని సంపాదించడం శరీరానికి ఆత్మకు ఆరోగ్యాన్ని పునరుద్దరించటంలో విధేయత ద్వారా మనం ఆయనతో సహకరించాలి. MHTel 84.2

క్రీస్తు కృపను పొందేకొద్ది తాము విధేయతా ఫలాన్ని సంపూర్ణంగా పొందుతారని జనులు తెలుసుకోవాలి. దేవుని చట్టాలను ఆచరించటానికి మనిషికి శక్తినిచ్చేది ఆయన కృపే. చెడ్డ అలవాట్లు చెర నుండి విడిపించ టానికి అతడికి ఇదే శక్తినిస్తుంది. అతణ్ణి సన్మార్గంలో స్థిరుణ్ణి చెయ్యగల ధృడంగా ఉంచగల శక్తి ఇది మాత్రమే. MHTel 84.3

సువార్తకున్న పవిత్రతోను శక్తితోను దాన్ని స్వీకరించినపుడు పాపంతో ప్రారంభమయ్యే రుగ్మతలకు అది పరమౌషధమౌతుంది. నీతి సూర్యుడు ఉదయిస్తాడు.“అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును”మలాకి4; 2 ఈలోకం ఇవ్వగలిగింది ఏదైతే ఉందో అదంతా పగిలిన హృదయాన్ని బాగు చెయ్యలేదు. లేక మనశ్శాంతి నివ్వలేదు. లేక చింతను తీసివేయలేదు. లేక వ్యాదిని బహిష్కరించలేదు. కీర్తి, ప్రతిభ గొప్ప వరాలు ఇవన్నీ దు:ఖంతో నిండిన హృదయానికి ఆనందాన్నివ్వలేవు. లేక దురభ్యాసాల వల్ల నాశనమైన జీవితాన్ని పునరుద్దరించలేవు. ఆత్మలో దేవుని జీవితం ఒక్కటే మానవుడి ఆశాకిరణం. MHTel 84.4

శరీరమంతా క్రీస్తు విస్తరింపజేసే ప్రేమ ప్రాణాధారమైన శక్తి మెదడు, గుండె, నరాల వంటి ముఖ్య భాగాలకు అది స్వస్థత అందిస్తుంది. అది శరీరం ఉన్నత శక్తుల్ని జాగృతపర్చి క్రియాత్మకం చేస్తుంది. అది ఆత్మనుండి అపరాధం, దు:ఖం, అందోళన, చింతలను తీసివేస్తుంది. దానితో ప్రశాంతత, స్థయిర్యం నెలకొంటాయి. ఐహికమైనదేదీ నాశయం చెయ్యలేని ఆనందాన్ని .... పరిశుద్దాత్మలో ఆనందాన్ని ఆరోగ్యాన్ని జీవాన్ని ఇచ్చే ఆనందాన్ని - అది నెలకొల్పుతుంది. MHTel 85.1

“నా యెద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేసెదను” (మత్తయి 11:28) అన్న మన రక్షకుడన్న మాటలు శారీరక, మానసిక ఆధ్యాత్మిక వ్యాధుల స్వస్థతకు మందు మనుషులు తమ చెడు పనుల వలన తమ మీదికి వ్యాధులు తెచ్చుకున్నా ఆయన వారిని దయతో పరిగణిస్తాడు. వారికి ఆయనలో సహాయం లభించగలదు. తనను నమ్మిన వారికోసం ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. MHTel 85.2

యుగాల కొద్ది పాపం మానవ జాతి పై తన పట్టు బిగిస్తూ ఉన్నప్పటికి, అబద్దాలు పన్నాగాల గారడీ ద్వారా సాతాను దేవుని వాక్యం పై తన వక్రభాష్యాన్ని రుద్ది మనుషులు ఆయన మంచితనాన్ని సందేహించేటట్లు చేసినప్పటికి ఇంకా తండ్రి కృప, ప్రేమ ఉరకలు వేస్తూ పరవళ్లు తొక్కుతూ భూమండలం దిశగా ప్రవహించడం ఆగలేదు. మానవులు దేవుని వారలకు కృతజ్ఞతలు వ్యక్తం చేస్తూ తమ ఆత్మకు తలుపులను పరలోకం వైపుకు తెరిస్తే స్వస్థత ప్రభావ వెల్లువను ఆయన కుమ్మరిస్తాడు. MHTel 85.3

అంగీకృతమైన క్రీస్తు తోటి పనివాడు కావాలని కోరుకునే వైద్యుడు. తన సేవకు సంబంధించిన ప్రతీ విషయంలో సమర్దువ్వటానికి పాటుపడ తాడు. తన వృత్తి బాధ్యతల నిర్వహణకు సామర్ధ్యం సంపాదించేందకు శ్రద్ధగా అధ్యయనం చేసి, మరింత జ్ఞానాన్ని మరింత నైపుణ్యాన్ని. మరింత లోతైన అవగాహనను అన్వేషిస్తూ ఉన్నత ప్రమాణాన్ని చేరటానిక నిత్యం శ్రమిస్తాడు. నాసిరకమైన సమర్ధత లేని పని చేసే వైద్యుడు రోగులకు హాని చేయ్యటం మాత్రమే గాక, తన తోటి వైద్యులకు అన్యాయం చేస్తాడని ప్రతీ వైద్యుడు గుర్తించాలి. తక్కువ నిపుణతా ప్రమాణంతో, జ్ఞానంతో వ్యాధముగా పొం అభ్యంతరమే మరిచర్యకు ఆయన “తోడి దానికి పూర్తిగా MHTel 85.4

తృప్తి చెందే వైద్యుడు వైద్య వృత్తిని కించపర్చటమే కాదు. ప్రధాన వైద్యుడైన క్రీస్తుకు కూడా అగౌరవం తెస్తున్నాడు. తాము వైద్య పరిచర్యకు పనికిరామని గ్రహించేవారు వేరే ఉపాధిని ఎంపిక చేసుకోవాలి. రోగుల్ని శ్రద్ధాశక్తులతో చూసే తత్వం గల వారు కాని విద్య విషయంలోను వైద్య అర్హతల విషయంలోను పరిమితమైనవారు వైద్య సేవలో తక్కువ స్థాయిని పని చేపట్టి నమ్మకంగా నర్సులుగా సేవ చేయవచ్చు. నిపుణులైన వైద్యుల కింద ఓర్పుతో పనిచేస్తూ నిత్యం నేర్చుకుంటూ జ్ఞానాన్ని సంపాదించటానికి ప్రతీ తరుణాన్ని సద్వినియోగ పర్చుకుంటూ కాలక్రమంలో వైద్యులుగా సేవ చెయ్యటానికి పూర్తిగా అర్హులు కావచ్చు (ప్రధాన వైద్యుడైన) ఆయన “తోడి పనివారుగా” యువ వైద్యులు, రోగుల పరిచర్యకు అపోహలు రాకుండా, ఏ విషయంలోను “అభ్యంతరమేమియు కలుగజేయక” “దేవుని కృపను వ్యర్ధ”ముగా పొందక, అన్ని విషయములలో దేవుని సేవకులుగా మెప్పు పొందురుగాక. 2 కొరి 6:1-4 MHTel 86.1

మనం నిత్యం పైకి కదలాలని దేవుని సంకల్పం వైద్య మిషనెరీ వైద్యుడు నిత్యం పెరుగుతున్న నిపుణత గల వైద్యుడు. ప్రతిభ గల వృత్తిపరంగా సమాజ సామార్ధ్యం గల క్రైస్తవ వైద్యులను వెదకి, దేవుని సేవలో వైద్య మిషనెరీలుగా ఇతరుల్ని తర్బీతు చెయ్యటానికి వారిని ఆయాస్థలాల్లో ఉపయోగించాలి. MHTel 86.2

వైద్యుడు దైవ వాక్యం వెలుగుతో తన ఆత్మను నింపుకోవాలి. అతడు నిత్యం కృపలో పెరగాలి. అతడి విషయంలో మతం ఇతర ప్రభావాల్లో ఒకటి కాకూడదు. అది అన్ని ప్రభావాల్ని అధిగమించే ప్రభావం కావాలి., అతడు ఉన్నత పరిశుద్ధ ఆశయాలతో పనిచెయ్యాలి. అన్ని శక్తిమంతమైన ఆశయాలు ఎందుకంటే దుష్టతను దుర్మార్గతను జయించేందుకు మనకు శక్తినివ్వటానికి ఎవరు తన ప్రాణాన్నిచ్చారో ఆయననుంచి అవి వస్తున్నాయి. MHTel 86.3

వైద్యుడు తన వృత్తిలో సమర్ధంగా పనిచెయ్యటానికి నమ్మకంగా పట్టుదలతో కృషి చేస్తే తనను తాను క్రీసు సేవకు అంకితం చేసుకొని తన హృదయాన్ని పరిశోధించుకుంటే తన పవిత్ర వృత్తి మర్మాలను ఎలా అవగాహన చేసుకోవాలో అతడు తెలుసుకోగలుగుతాడు. తన ప్రభావ పరిధిలోని వారందరూ వివేకం, శక్తి గల దేవునితో అనుసంధానమైన ఓ వ్యక్తి సంపాదించిన ఉత్తమ విద్యను వివేకాన్ని చూడగలిగేటట్లు స్వయం శిక్షణతో అతడు జ్ఞానాన్ని సంపాదిస్తాడు. MHTel 86.4

క్రీస్తుతో సన్నిహిత సహవాసం వైద్యుడి పనిలో అవసరమైనతంగా మరే పనిలోను అవసరం కాదు. వైద్యుడి విధులను సరిగా నిర్వర్తించాలని కోరుకునే వైద్యుడు ప్రతి దినం గడియ క్రైస్తవ జీవితం జీవించాలి. రోగి ప్రాణం వైద్యుడి చేతుల్లో ఉంటుంది. ప్రమాద స్థితిలో ఉన్న ఓ రోగి విషయంలో, ఆజాగ్రత్తతో చేసిన ఒక రోగ నిర్ధారణ, ఒక తప్పుడు మందు రాయటం లేక ఓ శస్త్ర చికిత్సలో నిపుణత లోపించిన చేతి కదలిక- ఓ తల వెంట్రుక వాసితో సయితం - ఓ ప్రాణం బలికావచ్చు ఓ ఆత్మ నిత్యత్వంలో కలసిపోవచ్చు. ఆ తలంపు ఎంత గంభీరమైనది! వైద్యుడు నిత్యం ఆ పరమ వైద్యుని అదుపులో ఉండటం ఎంతో ప్రాముఖ్యం. MHTel 87.1

జ్ఞానం కోసం సదాలోచన కోసం తనను ఆశ్రయించే వారికి సహాయం చెయ్యటానికి రక్షకుడు సంసిద్ధంగా ఉన్నాడు. ఎవరి తీర్మానాల పై ఎంతో ఆధారపడి ఉంటుందో ఆ వైద్యుడికన్నా ఎవరికి వివేకం సదాలోచన ఎక్వువ అవసరమౌతాయి? జీవితాన్ని పొడిగించటానికి ప్రయత్నించే వ్యక్తి తన ప్రతీ కదలికను నడిపించటానికి యేసు వంక విశ్వాసంతో చూడాలి. కఠినమైన కేసుల్ని పరిష్కరించటంలో రక్షకుడు అతడికి నేర్పు, నైపుణ్యం ఇస్తాడు. MHTel 87.2

వ్యాధిగ్రస్తుల సంరక్షకులకున్న అవకాశాలు ఆమోఘమైనవి. వ్యాధిగ్రస్తుల పునరద్దరణకు తీసుకొనే చర్య అంతటితో వ్యాధిని నిరోధించ టంలో తాము దేవునితో సహకరించటానికి వైద్యుడు తమకు సహాయం చెయ్యటానికి ప్రయత్నిస్తున్నాడన్న అవగాహన వారికి కలిగించాలి. దేవుని చట్టాలకు అనుగునంగా తీసుకున్న ప్రతీ చర్యకు దేవుని శక్తి తోడ్పడుతుందని గ్రహించటానికి వారిని నడిపించండి,. MHTel 87.3

దేవుని ప్రేమించి ఆయనకు భయపడే వైద్యుడిలా వ్యాధిగ్రస్తులకు ఎక్కువ నమ్మకం ఉంటుంది. అతడి మాటల పై నమ్మక ముంచుతారు. ఆ వైద్యుడి సన్నిధి వల్ల, ఎవని వల్ల తాము క్షేమంగా ఉండగలమన్న నమ్మకం వారికి కలుగుతుంది. MHTel 88.1

వైద్యుడు యేసు ప్రభువును ఎరుగును. కాబట్టి రోగుల గదికి ఆయనను ప్రార్ధన ద్వారా ఆహ్వానించడం అతడి ఆధిక్యత. ఓ ప్రమాద కరమైన శస్త్ర క్రియ చేపట్టకముందు వైద్యుడు ఆ మహావైద్యుని సహాయం కోరాలి. ఆ శస్త్ర క్రియ నుంచి దేవుడు తనను సురక్షితంగా బయటికి తీసుకువస్తాడని ఆయన యందు విశ్వాముంచిన వారికి దు:ఖ సమయాలన్నిటిలోను ఆయన నిశ్చితమైన ఆశ్రయమని వైద్యుడు రోగికి భరోసా ఇవ్వాలి. ఈ పని చెయ్యలేని వైద్యుడు అలా చేసి ఉంటే కాపడగలిగి ఉండే కేసులను ఒకదాని తరువాత ఒకటి పొగొట్టుకుంటాడు. MHTel 88.2

ప్రతీ వారి బాధకు తల్లడిల్లే, సానుభూతి చూపే రక్షకునిలో నమ్మకం పుట్టించే మాటలు చెప్పి, ఆత్మ అవసరాల్ని ప్రార్ధన ద్వారా అతడు ఆయనకు సమర్పించగలిగితే, ఆ గడ్డు పరిస్థితి క్షేమంగా దాటిపోతుంది. MHTel 88.3

శస్త్ర వైద్యుడి చేతిలో శస్త్రక్రియకు ఎంత భయంతోను వణుకుతోను అనేకమంది రోగులు అంగీకరిస్తారో హృదయాలు చదవగల ఆ ప్రభువుకే తెలుసు. తమ ప్రమదాన్ని వారు గుర్తిస్తారు. వైద్యుడి నిపుణత పై నమ్మకమున్నా తప్పు జరగటానికి అవకాశం లేకపోలేదని వారికి తెలుసు. కాని వైద్యుడు ప్రార్ధనలో వంగి దేవుని సహాన్ని ఆర్ధించటం చూసినప్పుడు వారికి నమ్మకం కలుగుతుంది. కృతజ్ఞత, విశ్వాసం దేవుని స్వస్థత శక్తికి హృదయాన్ని తెరుస్తుంది. శారీరక శక్తులన్నీ శక్తితో నిండుతాయి.జీవ శక్తులు జయం సాధిస్తాయి. MHTel 88.4

వైద్యుడికి కూడా రక్షకుని సముఖం బలాన్నిస్తుంది. తరుచు తన పని బాధ్యతలు అతడికి భయం పుట్టిస్తాయి. అనిశ్చితి భయాందోళనలు చేతి నిపుణతను దెబ్బ తియ్యవచ్చు. కాని అతణ్ణి నడిపించటానికి బలపర్చటానికి, ప్రశాంతతను ధైర్యాన్ని అతడిలో నింపటానికి ఆ దివ్య సలహాదారుని హామీ అతడి సరసనే ఉంటుంది. శస్త్ర వైద్యుడి చేతికి క్రీస్తు స్పర్శ జీవాన్ని విశ్రాంతిని ధైర్యాన్ని శక్తిని తెస్తుంది. MHTel 88.5

ఆ క్లిష్ట పరిస్థితి క్షేమంగా దాటిపోయి జయం కనిపిస్తున్నప్పుడు రోగితో కొన్ని గడియలు ప్రార్ధనలో గడపటం మంచిది ప్రాణాన్ని కాపాడినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలపండి. వైద్యుడిని ఉద్దేశించి రోగి కృతజ్ఞతలు తెలుపుతున్నప్పుడు, ఆ స్తుతి వందనాలు దేవునికి చెల్లింతుము గాక, తాను పరమ వైద్యుడు యేసు సంరక్షణ కింద ఉన్నాడు. గనుక తన ప్రాణం కాపాడబడిందని రోగికి తెలిపాలి. MHTel 89.1

ఈవిధానాన్ని అనుసరించే వైద్యుడు. ఎవరు తన వద్దకు వచ్చే వారిని సంపూర్తిగా రక్షించగలరో తాను తన జీవితం కోసం ఎవరి మీద ఆధార పడతాడో ఆ ప్రభువు వద్దకు ఆ వైద్యుడు తన రోగిని నడిపిస్తాడు. MHTel 89.2

వైద్య మిషనెరీ సేవలోకి ఆత్మల రక్షణ విషయంలో తీవ్ర వాంఛను తీసుకురావాలి. మానవుడికి దేవుని వద్ద నుంచి వస్తున్న అత్యున్నతమైన ధర్మనిధి సువార్త పరిచాకుడితో సమానంగా వైద్యుడికి కూడా వస్తుంది. తాను గుర్తిస్తున్నాడో లేదో గాని, ప్రతీ వైద్యుడికి ఆత్మల స్వస్థత బాధ్యత అప్పగించబడినది. MHTel 89.3

వ్యాధి మరణంతో సంబంధించిన తమ పనిలో తరుచుగా వైద్యులు భవిష్యత్తు జీవితాన్ని గురించిన గంభీర వాస్తవాలను విస్మరిస్తుంటారు. శారీరక ప్రమాదాన్ని తప్పించే కృషిలో వారు ఆత్మకు పొంచి ఉన్న ప్రమాదాన్ని మర్చిపోతారు. వారు వైద్య పరిచర్య చేస్తున్న వ్యక్తి వడివడిగా మరణాన్ని సమీపిస్తుండవచ్చు. చివరి తరుణాల స్పృహ చెరిగిపోతుండవచ్చు. ఈ ఆత్మను ఆ వైద్యుడు మళ్ళీ క్రీస్తు తీర్పు దినాన కలుసుకోవాలి. MHTel 89.4

సమయానుసారమైన మాట పలకకపోవటం వల్ల తరుచు మనం ప్రశస్తమైన దీవెనలను పొగొట్టుకుంటున్నాం. ఆ బంగారు అవకాశం కోసం వేచి ఉండకపోతే అది దాటిపోతుంది. రోగి పడక పక్క మత విశ్వాసాన్ని గుర్తించి గాని, వివాదాన్ని గురించి గాని ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. విశ్వాసం ద్వారా తన వద్దకు వచ్చే వారందరిని రక్షించటానికి సిద్ధంగా ఉన్న ప్రభువు పైకి రోగి గమనాన్ని తిప్పండి. జీవం మరణం మధ్య కొట్టుమిట్టాడుతున్న ఆ ఆత్మకు సహాయం చెయ్యటానికి చిత్తశుద్ధితో దయతో కృషి చేయండి. MHTel 89.5

అదే ఆశ్రయ దుర్గానికి తాను నడపబడ్డ వాడే కాబట్టి క్రీస్తు తన వ్యక్తిగత రోకుడని ఎరిగిన వైద్యుడు. సహాయం కోసం తన మీద ఆధారపడే భయపడుతున్న అపరాధులు, పాప రోగంతో బాధపడే ఆత్మలతో ఎలా వ్యవహరించాలో ఎరుగును. “రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను?” అని ప్రశ్నించే వారికి అతడు రక్షకుని ప్రేమను గుర్చి చెప్పవచ్చు. వ్యక్తి గత అనుభవం నుంచి మాట్లాడుతు అతడు మారు మనస్సు విశ్వాసం శక్తిని గురించి మాట్లాడవచ్చు. సామాన్యమైన మనఃపూర్వకమైన మాటల్లో ఆత్మ అవసరాన్ని దేవునికి ప్రార్ధనలో. MHTel 90.1

“అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగు నట్లు శిష్యునికి తగని నోరు యెహోవానాకు దయచేసి యున్నాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ది పుట్టించుచున్నాడు. యెషయా 50:4”సరిగా ప్రత్యుత్తరమిచ్చినవానికి దాని వలన సంతోషము పుట్టును. సమయోచిత మైన మాట యెంత మనో హరము! సామె15:23 “సమయోచితముగా పలుకబడిన మాట చితమైన వెండి పళ్ళెములలో నుంచబడిన బంగారు పండ్ల వంటిది.” సామె 25:11 “సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువార్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించువాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములైనవి”. యెషయా 52:7 MHTel 90.2

సమర్పించి దయ గల రక్షకుని కృపను కోరి దాన్ని అంగీకరించటానికి రోగిని ప్రోత్సహించవచ్చు. రోగుల పడకల పక్క వైద్యుడు ఇలా సహాయం ఆదరణ తెచ్చే మాటలు మాట్లాడుతూ పరిచర్య చేసేటప్పుడు ప్రభువు అతడితోను అతడి ద్వారాను పనిచేస్తాడు. వ్యాధి బాధితుడి మనసు రక్షకుని పైవు తిరిగినప్పుడు క్రీస్తు సమాధానం హృదయాన్ని నింపుతుంది. అతడికి వచ్చే ఆధ్యాత్మిక ఆరోగ్యం శరీరారోగ్యాన్ని పునరుద్ధరించే దేవుని హస్తంగా ఉపయోగించబడుతుంది. MHTel 90.3

రోగికి చికిత్స చేసేటప్పుడు రోగి మిత్రులకు పరిచర్య చేయ్యటానికి వైద్యుడికి అవకాశం లభిస్తుంది. చిన్న నొప్పిని కూడా తగ్గించటానికి శక్తి లేకుండా బాధపడుతున్న రోగి పక్క ఉండి, చూస్తున్నప్పుడు వారి హృదయాలు మెత్తబడతాయి. తరుచు ఇతరులకు కనిపించకుండా దాచిన దు:ఖాన్ని వైద్యుడికి చెప్పుకోవడం జరుగుతు ఉంటుంది. దు:ఖిస్తున్న వీరిని ప్రయాస పడి భారం మోసేవారిని తన వద్దకు రమ్మని ఆహ్వానిస్తున్న ఆయన వద్దకు నడిపించటానికి అప్పుడు అవకాశం కలుగుతుంది. తరుచు వారి అవసరాలను ఆయన ముందు పెడుతూ వారితో కలసి వారి కోసం ప్రార్ధించవచ్చు. MHTel 91.1