స్వస్థత పరిచర్య

18/173

ఉచితముగా పొదితిరి ఉచితముగా ఇయ్యుడి

సువార్త ఆహ్వానాన్ని సంక్షిప్తం చేసి ఎవరు స్వీకరిస్తే మనకు గౌరవం లభిస్తుందని భావిస్తామో వారికి మాత్రమే దాన్ని అందించకూడదు. అది అందరికి అందించాల్సిన వర్తమానం. దేవుడు తన బిడ్డల్ని ఆశీర్వదించేట ప్పుడు ఆ ఆశీర్వాదం కేవలం వారి కోసమే కాదు. లోకమంతటి కోసం. దేవుడు మనకు వరాలిచ్చేప్పుడు వాటిని ఇతరులకు ఇవ్వటం ద్వారా వృద్ది చెయ్యాలని మనకిస్తున్నాడు. MHTel 74.4

యాకోబు బావి వద్ద యేసుతో మాట్లాడిన సమరయ స్త్రీ రక్షకుణ్ణి కనుగొన్న వెంటనే ఇతరుల్ని ఆయన వద్దకు తీసుకువచ్చింది. ఆమె ఆయన శిష్యులకన్నా విజయవంతమైన మిషనెరీగా నిరూపించుకున్నది. సువార్త సేవ పరంగా సమరయలో మంచి సూచనలేవీ శిష్యులకు కనిపించలేదు. వారి ఆలోచనలు భవిష్యత్తులో జరగాల్సిన గొప్ప సేవ మీదే నిలిచియు న్నాయి. తమ పరిసరాల్లో పోగు చెయ్యాల్సిన పంట ఉన్నట్లు వారు గుర్తిం చలేదు. కాని వారు ద్వేషించిన ఆ స్త్రీ ఆ పట్టణంలోని ప్రజలందరిని యేసు బోధ వినటానికి తీసుకువచ్చింది. ఆమె తన పట్టణ ప్రజలకు వెంటనే వెలుగును అందించింది. MHTel 74.5

క్రీస్తులో ప్రయోగాత్మక విశ్వాసం ఎలా పనిచేస్తుందో ఈ స్త్రీ సూచిస్తుంది. నిజమైన ప్రతీ శిష్యుడు మిషనెరీగా దేవుని రాజ్యంలోకి జన్మిస్తాడు. రక్షకుణ్ణి తెలుసుకోవడం జరిగిన వెంటనే ఇతరుల్ని ఆయనకు పరిచయం చెయ్యటానికి ప్రయత్నిస్తాడు. రక్షణకు పరిశుద్ధతకు సంబంధించిన సత్యాన్ని హృదయంలోనే బంధించి ఉంచలేం. జీవజలాన్ని అస్వాధించేవాడు జీవపు ఊటగా మారతాడు. అందుకొనే వాడు అందించేవాడౌతాడు. ఆత్మలోని దేవుని కృప అందరినీ సేద తీర్చటానికి వెలసి ఎడారిలో మరణించటానికి సిద్ధంగా ఉన్నవారిని తాగటానికి ఆతురపరచే జీవజలపు ఊటలా ఉంటుంది. కేవలం మన ప్రయోజనానికే పనిచెయ్యటం కన్నా ఈ పని చెయ్యటంలో ఇంకా ఎక్కువ దీవెన కలుగుతుంది. రక్షణ శుభవార్తను ప్రచురించటంలో మనం రక్షకునికి చేరువవుతాం. కృపను పొందిన వారి గురించి ప్రభువిలా అంటున్నాడు. MHTel 75.1

“వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలమును దీవెనకరముగా చేయుదును. రుతువుల ప్రకారము వర్షము కురిపించెదను. దీవెనకరమగు వర్షము కురియును.” యెహజ్కేలు 34:26 MHTel 75.2

“ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమును యేసు నిలిచి యెవడైనను దప్పిగొనిన యెడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజలములు పారునని బిగ్గరగా చెప్పెను.” యెహాను 7:37,38 MHTel 75.3

పొందేవారు ఇతరులకు ఇవ్వాలి. సహాయం కోసం అన్ని దిక్కుల నుండి విజ్ఞప్తులు వస్తున్నాయి. మనుషులు సాటి మనుషులకు సంతోషంగా సేవ చెయ్యాలని దేవుడు పిలుపునిస్తున్నాడు. వారు నిత్యజీవ కిరీటాలను MHTel 75.4

పరలోక రాజ్యాన్ని సంపాదించాలి. ఆజ్ఞానంలో నాశనమౌతున్న లోకాన్ని వెలుగుతో నింపాలి. MHTel 76.1

“ఇంక నాలుగు నెలలైన తరువాత కొంతకాలము వచ్చునని మీరు చెప్పుదురుగదా. ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి. అవి ఇప్పుడు తెల్లబారి కోతకు వచ్చియున్నవని మీతో చెప్పుచున్నాను. విత్తువాడును కోయువాడును కూడా సంతోషించునట్లు కోయువాడు జీతము పుచ్చుకొని నిత్యజీవార్ధమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు” యెహాను 4:35,36. MHTel 76.2

సీయోను, సువార్త ప్రకటించుచున్నదానా, ఉన్నత పర్వము ఎక్కుము, యెరూషలేమా, సువార్త ప్రకటించుచున్నదానా బలముగా ప్రకటించుము భయపడక ప్రకటింపుమి- ఇదిగో మీ దేవుడని యూదా పట్టణములకు ప్రకటించుము”. యెషయా 40:9 MHTel 76.3

మూడు సంవత్సరాల పాటు శిష్యుల మందు యేసు అద్భుత ఆదర్శం ఉంది. ప్రయాసపడి భారాలు మోస్తున్న వారితో ఆయన చెబుతున్న మాటలు వింటూ, వ్యాదలుతో బాధపడుతున్న వారిని స్వస్థపర్చటం విషయంలో ఆయన శక్తి ప్రదర్శనను చూస్తు ఆయనతో మాట్లాడుతూ నడిచారు. వారిని విడిచి పెట్టటానికి సమయం వచ్చినపుడు తన సేవను తన పేరిట ముందుకు నడపటానికి వారికి తన కృపను అనుగ్రహించాడు. తన ప్రేమా సువార్తను గూర్చిన వెలుగును వారు ప్రకాశింపచేయాల్సి ఉన్నారు. తన సముఖం ఎల్లపూడు తమతో ఉంటుందని రక్షకుడు వాగ్దానం చేసాడు. శారీరకంగా వారి మధ్య నడిచినప్పటికన్నా పరిశుద్దాత్మ ద్వారా వారికి మరింత దగ్గరగా ఉంటాడు. MHTel 76.4

శిష్యులు చేసిన సేవను మనం కూడా చెయ్యాల్సి ఉన్నాం. క్రైస్తవుడైన ప్రతీ వ్యక్తి ఓ మిషనెరీ, మనుషుల బాధలను తక్కువ చేయటానికి నిస్వార్ధమైన పట్టదలతో ప్రయత్నిస్తూ లేమిలో ఉన్నవారికి సేవ చెయ్యాలి. MHTel 76.5

చెయ్యటానికి అందరికి ఏదో పని ఉంటుంది. క్రీస్తు కోసం తాము చెయ్యగలిగిన పని ఏదీ లేదని ఎవరు భావించకూడదు. ప్రతి మానవ పుత్రుడిలోను తనను చూడవచ్చునని రక్షకుడు అంటున్నాడు. మనం పరలోక కుటుంబలో సభ్యుల మయ్యేందుకు ఆయన మానవ కుటుంబంలో ఓ సభ్యుడయ్యాడు. ఆయన మనుష్యకుమారుడు. ఆ రకంగా ఆదాము ప్రతీ కుమారుడికీ ప్రతీ కుమార్తెకు ఓ సోదరుడయ్యాడు. ఆయన అనుచరులు తమ చుట్టు నశించిపోత్ను లోకంతో తమకు సంబంధము లేనట్లు భావించకూడదు. వారు విశాల మానవ కుటుంబములో ఓ భాగం. దేవుడు వారిని పాపులకు పరిశుద్ధులకు సహోదరులుగా పరిగణిస్తాడు. MHTel 76.6

వ్యాధి, అజ్ఞానం, పాపంలో ఉన్న కోట్లాది మానవులు తమ పట్ల యేసు ప్రేమను గూర్చి ఎన్నడూ వినలేదు. మన పరిస్థితిలో వారు వారి పరిస్థితిలో మనం ఉండి ఉంటే వారు మనకు ఏమి చేయ్యాలని మనం కోరతాం;? మన శక్తి మేరకు ఇదంతా మనం వారికి చెయ్యాలి. “మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి” అని క్రీస్తు నిర్దేశించిన జీవిత నిబంధన ప్రకాంర ఆ మహా తీర్పులో మనం నిలవటమో పడిపోవటమో జరగుతుంది (మత్తయి 7:12) MHTel 77.1

విద్య సంస్కారం, ఉదాత్త ప్రవర్తన, క్రైస్తవ శిక్షణ మతానుభవం వీటి వలన మనకు ఇతరుల కన్నా ఆధిక్యం లభించినా తక్కువ అవకాశాలు గల వారి విషంలో మనం రుణస్తులం,. మనం మన శక్తి మేరకు వారికి సేవ చెయ్యాలి. మనం బలం గలవారిమైతే బలహీనులను అదుకోవాలి. MHTel 77.2

పరలోకంలో నిత్యం తండ్రి ముఖం వీక్షించే దేవదూతలు ఆయన బిడ్డలకు సేవ చెయ్యటంలో అనందం పొందుతారు. స్వార్ధంతో కఠినమైన పోరాటాలు చేసే వారితో, నిరాశ పుట్టించే పరసరాల్లో ఉన్నవారితో తాము ఎక్కడ అవసరమో అక్కడ దేవదూతలు ఉంటారు. అనేక అభ్యంతరకర మైన గుణలక్షణాలున్న బలహీన ఆత్మల విషయంలో వారు ప్రత్కేక శ్రద్ధ తీసుకుంటారు. స్వార్ధపరులు ఏ సేవను నీచమైన సేవగా పరిగణిస్తారో అభాగ్యులు. ప్రవర్తనలో అన్ని విధాల తక్కువగా ఉన్న వారి సేవే పాపరహితులు పరిశుద్దులు అయిన పరలోక నివాసుల కర్తవ్యం. MHTel 77.3

మనం నశించపోతుండగా పరలోకాన్ని తాను విడిచి పెట్టుకో కూడనంత ప్రియమైన స్థలంగా యేసు భావించలేదు పరలోక రాజభోగాలు వదులుకొని నిందలు, అవమానం, సిగ్గుకరమైన మరణాన్ని అనుభవిం చాల్సిన జీవితాన్ని ఎంపిక చేసుకున్నాడు చెప్ప శక్యము కాని పరలోక నిధులు గల ఆయన తన పేదరికం వల్ల మనం భాగ్యవంతులమయ్యేం దుకు పేదవాడయ్యాడు. ఆయన నడిచిన మార్గంలో మనం ఆయన్ని వెంబడించాలి.భూమి పై క్రీస్తు నివసించిన స్థలాలను సందర్శించటం ఆయన నడిచిన స్థలాల్లో నడవటం, ఏ సరస్సు పక్క బోధించటానికి ఆయన మచ్చటపడేవాడో దాన్ని చూడటం, ఆయన దృష్టి ఏ కొండల పైన లోయల పైన తరచుగా నిలిచేదో వాటిని వీక్షించటం అనేకులు గొప్ప భాగ్యంగా ఎంచుకుంటారు. అయితే క్రీస్తు అడుగు జాడల్లో నడవటానికి MHTel 78.1

మనం నజరేతుకి, కప్నెహూముకి, లేక బేతనియుకు వెళ్ళనక్కర లేదు. వ్యాధిగ్రస్తులు పడకల పక్క, పేదలు మురికి వాడల్లో గొప్ప గొప్ప నగరాల్లోని సందుల్లో ఓదార్పు అవసరమైన మానవ హృదయాలున్న ప్రతీ చోట ఆయన అడుగుల జాడలు కనిపిస్తాయి. MHTel 78.2

మనం ఆకలిగా ఉన్నవారికి భోజంనం పెట్టాలి. బట్టలు లేనివారికి బట్టలివ్వాలి. వ్యాధులు, దు:ఖిస్తున్నవారిని ఓదార్చాలి. నిరాశ నిస్పృహలకు గురి అయిన వారికి పరిచర్య చేయ్యాలి. నిరీక్షణ కోల్పోయిన వారిలో నిరీక్షణ నింపాలి. MHTel 78.3

దుష్టులను సంస్కరించటంలో కత్తికన్నా న్యాయస్థానం కన్నా శక్తిమంతమైనది స్వార్ధ రహిత పరిచర్య ద్వారా క్రీస్తు ప్రదర్శించిన ప్రేమ. చట్టం అతిక్రమించే వారిలో భయం పుట్టించటానికి ఇవి అవసరమే. పేమ గల మిషనెరీ ఇంతకు మించిన పని చెయ్యగలడు. మందలింపుల వల్ల కఠినమైన హృదయం తరుచు క్రీస్తు ప్రేమ వల్ల కరుగుతుంది. MHTel 78.4

మిషనెరీ శారీరక వ్యాధుల్ని నివారించుటమే గాక, ఆత్మకు ఉన్న పాపమునే కుష్టువ్యాధిని శుద్ది చేయ్యగల మహావైద్యుని వద్దకు కూడా పాపిని నడిపించగలడు. వ్యాధిగ్రస్తులు, దిక్కులేని వారు , దురాత్మల పీడితులు తన స్వరాన్ని తన సేవకుల ద్వారా వినాలని దేవుడు సంకల్పిం చాడు. తన మానవ ప్రతినిధుల ద్వారా అలాటి వారికి లోకం ఎరుగని రీతిలో తాను ఆదరణకర్తలుగా ఉండాలని దేవుడు ఆకాంక్షిస్తున్నాడు. MHTel 78.5

బాధలలో ఉన్నవారికి దు:ఖపడుతున్నవారికి, శోధనలతో పెనుగులాడుతున్న వారికి పరిచర్య చెయ్యటానికి గాను, ఓ సంఘాన్ని స్థాపించటానికి రక్షకుడు తన విలువైన ప్రాణాన్ని త్యాగం చేసాడు. ఓ విశ్వాసుల సమూహం పేదలు, విద్యలేనివారు. ఎన్నిక లేనివారు కావచ్చు అయినా వారు గృహంలో, సమాజంలో, “దూర ప్రాంతాల్లో” సయితం క్రీస్తులో నిత్య కాలమంత దీర్ఘకాలిక ఫలితాలిచ్చే పరిచర్య చెయ్యవచ్చు. MHTel 79.1

క్రీస్తు తన మొదటి శిష్యులకు చెప్పిన ఈ మాటలు నేడు ఆయన అనుచరులకు కూడా వర్తిస్తాయి. MHTel 79.2

“పరలోకమందును భూలోకమందును నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి”. “మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి”. మత్తయి 28:18, 19 మార్కు 16:15. MHTel 79.3

తన సముఖాన్ని మనకు కూడా ఆయన వాగ్దానం చేస్తున్నాడు. “ఇదిగో నేను యుగపమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నాను”. మత్తయి 28:20 MHTel 79.4

ఆ క్రీస్తు మాటలు వినటానికి నేడు జనసమూహాలు ఆరణ్య ప్రదేశాల్లో గుమిగూడటం లేదు. జనులతో కిటకిటలాడే వీధుల్లో ఆయన స్వరం వినబడటం లేదు. “నజరేయుడైన యేసు ఈ మార్గమును వెళ్ళుచున్నాడు”. అని మార్గం పక్కనుండి కేకలు వినబడటంలేదు. లూకా 18:37 అయినా నేడు ఈ మాట నిజం. కనపడకుండా క్రీస్తు మన వీధుల్లో నడుస్తున్నాడు. కృపా వర్తమానాలతో ఆయన మన గృహాలకు వస్తున్నాడు. తన పేరిట సేవ చేసేవారందరితో సహకరించటానికి ఆయన వేచి ఉన్నాడు. మనం ఆయనను అంగీకకరిస్తే స్వస్థపర్చటానికి ఆశీర్వదించటానికి ఆయన మన మధ్యనే ఉన్నాడు. MHTel 79.5

“యెహోవా ఈలాగు సెతవిచ్చుచున్నాడు. అనుకూల సమయ మందు నేను నీ మొర నాలకించి నీకు ఉత్తరమిచ్చితిని, రక్షణ దినమందు నిన్ను అదుకొంటిని. బయలు వెళ్ళుడి అని బంధింపబడిన వారితోను..... బయటికి రండి అని చీకటిలో నున్న వారితోను చెప్పుచు దేశమును చక్కబరచి పాడైన స్వాస్థములను పంచి పెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని”. MHTel 80.1

“సువార్త ప్రకటించుచు సమాధానమును చాటించుచు సువార్త మానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సీయోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములైయున్నవి”. యెషయా 52:7 MHTel 80.2

“ఉత్సహించి యేకముగా సంగీత గానము చేయుడి.... యెహోవా తన జనులను ఆదరించెను.. యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరిచియున్నాడు. భూదిగంత నివాసులందరు మన దేవుని రక్షణ చూచెదరు”. 9,10 వచనాలు MHTel 80.3

*****