స్వస్థత పరిచర్య

154/173

8. వ నివారి అసవరం

40—పనివారి అవసరం

దినదిన జీవనంలో సహాయం

ప్రశాంతమైన నిలకడగల, పవిత్రమైన, యధార్ధమైన క్రైస్తవ జీవితాన్ని మించిన శక్తిమంతమైన వాద్దాటి లేదు. మనిషి ఏమి చెబుతాడో అన్నదానికన్నా అతడు ఎలాంటివాడో అన్నదానికి ఎక్కువ ప్రభావం ఉంటుంది. క్రీస్తు వద్దకు పంపబడ్డ అధికారులు అయన మాట్లాడినట్లు ఏ మనుషుడు మాట్లాడలేదు అన్న నివేదికతో తిరగి వెళ్ళారు. దీనికి కారణం ఏమిటంటే ఏ మనుషుడూ ఆయనలా జీవించలేదు. ఆయన జీవితం అలాక్కాక వేరేగా ఉండి ఉంటే ఆయన తాను మాట్లాడిన రీతిగా మాట్లాడ గలిగి ఉండకపోవను. ఆయనమాట స్వచ్చమైన ప్రేమ, సానుభూతి, ఔదార్యం. సత్యంతో నిండిన పరిశద్దుమైన హృదయం నుంచి వచ్చినవి గనుక అవి వారిలో నమ్మకం పుట్టించే శక్తి అయ్యాయి. MHTel 412.1

మన ప్రవర్తన అనుభవం ఇతరుల పై మన ప్రభావాన్ని నిర్ధారిస్తాయి. క్రీస్తు కృపాశక్తిని గూర్చి ఇతరుల్ని నమ్మించటానికి మన సొంత హృదయాల్లోను జీవితాల్లోను దాని శక్తి మనం తెలుసుకోవాలి. ఆత్మల రక్షణ నిమిత్త మనం సమర్పించే సువార్త మన ఆత్మలు దేనివల్ల రక్షించబడ్డాయో ఆ సువార్త అయి ఉండాలి. వ్యక్తిగత రక్షకుడుగా క్రీస్తులో సజీవ విశ్వాసం ద్వారా మాత్రమే అవిశ్వాస ప్రపంచంలో మన ప్రభావాన్ని కనపర్చటం సాధ్యమౌతుంది. వడిగా ప్రశహిస్తున్న ప్రవాహం నుంచి పాపులను బయటికి లాగ గోరితే మన పాదాలు క్రీస్తు యేసు బండ మీద ధృఢంగా నిలవాలి. MHTel 412.2

క్రైస్తవం వెలుపల ధరించే బ్యాడ్జి గాని, సిలువ గుర్తు గాని లేక కిరీటం గాని కాదు. అది దేవునితో మానవుడి ఏకత్వాన్ని వెల్లడి చేసేది. దేవుడు తన కుమారుణ్ణి లోక విమోచకుడుగా పంపాడని ప్రవర్తనలో మార్పులో ప్రదర్శితమయ్యే దేవుని కృపా శక్తి ద్వారా లోకం విశ్వసించాలి. మానవాత్మను ఆవరించే ఏ ఇతర ప్రభావమూ స్వార్ధ రహిత జీవిత ప్రభావ మంత శక్తిమంతం కాదు. ప్రేమించే, ప్రేమించదగ్గ క్రైస్తవుడే సువార్త పక్షంగా బలమైన వాదన. MHTel 412.3