స్వస్థత పరిచర్య

153/173

నిత్య జీవంలో విద్య

ఇక్కడ మనం చేసే పని నిత్య జీవితానికి సిద్ధపాటు. ఇక్కడ ప్రారంభమైన విద్య ఈ జీవితంలో పూర్తి కాదు. అది నిత్య కాలమంతా కొనసాగుతూ ఉంటుంది. ఎన్నడూ పూర్తి కాకుండా నిత్యం కొనసాగుతుంది. రక్షణ ప్రణాళికలో దేవుని ప్రేమ వివేకం మరింత సంపూంగా వెల్లడవుతాయి. రక్షకుడు జీవ జలాల ఊట వద్దకు తన బిడ్డల్ని నడిపించేటప్పుడు జ్ఞాన నిధుల్ని అందిస్తాడు. రోజుకు రోజు దేవుని అద్భుత కార్యాలు విశ్వ సృష్టికి పోషణకు నిదర్శనలు కొత్త అందాలతో మనసు తెరుచుకుంటాయి. సింహాసనం నుంచి ప్రకాశించే వెలుగులో మర్మాలు మాయమౌతాయి. ముందెన్నడు అవగాహన కాని విషయాలు సామాన్య విషయాలుగా కనిపించటం చూడటం ఆత్మకు విస్మయం కలుగుతుంది. MHTel 410.3

ఇప్పుడు అద్దంలో చూస్తున్నట్లు మనం మసక మసకగా చూస్తున్నాం. కాని అప్పుడు ముఖాముఖి చూస్తాం. ఇప్పుడు మనము కొంత మాత్రమే ఎరుగుదుము. ఇప్పుడు స్పూర్తిగా ఎరుగుదుము. MHTel 411.1

*****