స్వస్థత పరిచర్య
శ్రమ ద్వారా క్రమశిక్షణ
అటువంటి జీవితం జీవించటానికి, అటువంటి ప్రభావం చూపించటానికి అడుగడుగున కృషి, ఆత్మ త్యాగం, క్రమ శిక్షణ అవసరం., అనేకులు దీన్ని గ్రహించరు గనుక వారు క్రైస్తవ జీవితంలో సులువుగా నిరుత్సాహానికి గురి అవుతుంటారు. దేవుని సేవకు తమను తాము చిత్తశు ద్దితో సమర్పించుకున్న అనేకులు మును పెన్నటికన్నా ఎక్కువగా ఆటంకాలు, కష్టాలు, అందోళనలు ఎదురైనప్పుడు విస్మయం చెందుతారు. ఆధైర్యపడతారు. ప్రభువు సేవ చెయ్యటానికి యోగ్యత కోసం ప్రార్ధన చేస్తారు. అయితే వారు తమ స్వభావంలోని దుర్మార్గత అంతటిని ఉ పయో గించాలనిపించే పరిస్థితుల్లో ఉన్నారు. తమలో ఉన్నాయని తాము ఊహించన దోషాలు కనిపిస్తాయి. పూర్వం ఇశ్రాయేలీయుల్లా “మనల్ని దేవుడు నడిపిస్తుంటే ఈ కష్టాలన్నీ మనకు ఎందుకు వస్తాయి”; అని ప్రశ్నిస్తారు. MHTel 413.1
“ప్రియులారా, మిమ్మును శోధించటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో యొక వింత సంభవించినట్లు ఆశ్యర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపర్చబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పోలినవారునైయున్నతంగా సంతోషించుడి”. 1 పేతురు 4:12,13 MHTel 413.2
దేవుడు వారిని నడిపిస్తున్నాడు. గనుక ఇవి వారికి సంభవిస్తున్నాయి. కష్టాలు అంటాకలు ప్రభువు ఏర్పర్చుకున్న క్రమశిక్షణ పద్దతులు. అవి విజయానికి ఆయన నియిమంచిన షరతులు. మనుషుల హృదాయలను చదవగల ఆయన వారి ప్రవర్తనలను వారికంటే బాగా ఎరుగును. వారికి కొన్ని సామర్థ్యాలు అవకాశాలు ఉన్నట్లు చూసి వాటిని సరియైన దిశలో నడిపిస్తే అవి తన సేవాభివృద్ధికి ఉపయోగపడవచ్చునని ఆలోచిస్తాడు. ఈ వ్యక్తులు తమకు తెలియకుండా ఉన్న తమ లోటుపాట్లును తెలుసుకునేందుకు తన కృపా సంకల్పం చొప్పున వారిని వివిధ స్థానాలు పరిస్థితుల్లోకి తెస్తాడు. ఈ లోపాల్ని సవరించుకొని తన సేవకు తమను తాము యోగ్యుల్ని చేసుకొనేందుకు వారికి అవకాశం ఇస్తాడు. వారిని శుద్ది చేసే ప్రక్రియలో శ్రమల నిప్పులగుండం తొక్కనిస్తాడు. MHTel 413.3
మనం కష్టాలు భరించవలసి వచ్చిందంటే ప్రభువైన యేసు మనలో ఏదో విలువైన దాన్ని చూసి అది వృద్ధి పొందాలని కోరుతున్నట్లు సూచిస్తుంది. తన నామాన్ని మహిమపర్చుకవోటానికి మనలో విలువైనది ఏమి చూడకపోతే మనల్ని శుద్ధి చెయ్యటానికి ఆయన సమయం వ్యయం చెయ్యడు. తన కొలిమిలో పనికిరాని రాళ్ళను వెయ్యడు.విలువైన రాళ్ళనే ఆయన శుద్ధి చేస్తాడు. అవి ఎలాంటి లోహమో తెలుసుకోవటానికి కమ్మరి ఇనుమును ఉక్కును కొలిమి మంటల్లో శోధిస్తాడు. వారి స్వభావం ఏమిటో,తన సేవకు వారిని మలచగలనో లేనో తెలుసుకోవటానికి ఎన్నుకోబడ్డ ప్రజలు శ్రమలు కష్టాల కొలిమిలో శ్రమలనుభవించటానికి ప్రభువు అనుమతిస్తాడు. MHTel 414.1
కుమ్మరి జిగటమన్నును తీసుకొని తన కిష్టమైన విధముగా మూస పోస్తాడు. మన్ను పిసికి దానితో తన పాత్ర చేస్తాడు. దాన్ని తీసి నొక్కులు నొక్కుతాడు. దాన్ని తడిపి తరువాత ఎండబెడతాడు. దాన్ని ముట్టుకోకుండా కొంత సేపు అలా ఉంచుతాడు. అది పూర్తిగా మెత్తగా ఉన్నప్పుడు దానితో పాత్ర చెయ్యటం కొనసాగిస్తాడు. దానికి ఓ రూపం తెస్తాడు. MHTel 414.2
జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము.నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. సామెతలు 4:7 MHTel 414.3
ఇచ్చి దాన్ని సారె మీద పెట్టి కత్తిరించి నునుపు చేస్తాడు. దాన్ని ఎండలోను కుమ్మరి కొలిమిలోను ఎండబెడతాడు. ఇలా అది వినియోగించ తగిన పాత్ర అవుతుంది. అలాగే పరలోక కుమ్మరి మనల్ని మూసపోసి రూపుదిద్దాలని అభిలషిస్తున్నాడు. జింకమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లే మనం ఆయన చేతుల్లో ఉండాలి. కాని మనం కుమ్మరి పని చెయ్యటానికి ప్రయత్నించకూడదు. మన పాత్ర ఏమిటంటే మనల్ని తీర్చిదిద్దటానికి పరలోక కుమ్మరి చేతికి మనల్ని మనం అప్పగించుకోవటం. MHTel 414.4
“ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహా శ్రమల గూర్చి మీకేదో యొక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి, యేసు మహిమ బయలుపర్చబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివ్వ యున్నంతగా సంతోషించుడి”. 1 పేతురు 4:12,13. MHTel 415.1
పగటి వెలుగులో, ఇతర స్వరాల సంగీతం వినిపిస్తుండగా, పంజ రంలోని పిట్ట తన శిక్షకుడు నేర్పించిన పాటను పాడదు. ఇక్కడొ కళ అక్కడో శ్రుతి నేర్చుకొని పాడుతుంది గాని ఎప్పుడు పూర్తిగా రాగమంతా పాడదు. కాని శిక్షకుడు పంజరాన్ని కప్పి వేసి అది పాడాల్సిన పాటను మాత్రమే అది వినే స్థలములో దాన్ని ఉంచుతాడు. చీకటిలో అది మళ్లీ మళ్లీ ప్రయత్నించి అది పాడవలసిన పాటను చక్కగా పాడేవరుకు నేర్చుకొని పాటను శ్రావ్యంగా పాడుతుంది. అప్పుడు ఆ పిట్టలను బయటికి తీసుకు వస్తారు. అప్పటి నుండి ఆ పిట్ట ఆ పాటను వెలుగులో పాడగలుగుతుంది. తన బిడ్డలతో దేవుడు ఇలాగే వ్యవహరిస్తాడు. మనకు నేర్పటానికి ఆయనకు ఓ పాట ఉంది. దాన్ని మనం శ్రమల చీకటిలో నేర్చుకున్నప్పుడు ఆ తరువాత ఇక ఎప్పుడు ఆ పాట పాడగలుగుతాం. MHTel 415.2
అనేకులకు తాము చేస్తున్న పని తృప్తి నివ్వటంలేదు. తమ పరిసరాలు అనుకూలంగా లేకపోవచ్చు. తాము ఉన్నత బాధ్యలకు సమర్ధులమని భావిస్తుండగా వారి సమయం సాదాసీదా పని చెయ్యటంతో గడిచిపోతుండ వచ్చు. తరుచు వారి ప్రయత్నాలు ఎవరూ అభినిందించట లేదని లేక నిష్పలమౌతున్నాయని వారి భావన కావచ్చు. వారి భవిష్యత్తు అనిశ్చతంగా ఉన్నట్లు కనిపించవచ్చు. MHTel 415.3
మనం చెయ్యాల్సిన పని విషయంలో మనకు ఎంపిక లేకపోగా అది మన నిమిత్తం దేవుని ఎంపికగా అంగీకరించాలని జ్ఞాపకముంచు కుందాం. హితంగా ఉన్నా లేకపోపోయినా మనం నిర్వహిం చాల్సిన విధిని నిర్వహిం చాలి.“చేయుటకు నీ చేతికి వచ్చిన యేవ నినైనను నీ శక్తి లోపము లేకుండా చేయుము ; నీవు పోవు పాతాళమునందు పనియైనను ఉపాయ మైనను తెలివియైనను జ్ఞానమైనను లేదు”. ప్రసంగి 9:10 MHTel 415.4
నీనెవేకు ఓ వర్తమానాన్ని తీసుకువెళ్లాల్సిందిగా ప్రభువు మనల్ని కోరితే, మనం యెప్పేకు లేక కపెర్నోహెూమకు వెళ్లటం ఆయన్ని సంతోష పెట్టదు. మన పాదాలను తాను నడిపించే స్థలానికి మనల్ని పంపంటలో దేవునికి కారణాలున్నాయి. ఆ స్థలంలో మనం చెయ్యగల సహాయం అవసరమైన వ్యక్తి ఉండవచ్చు. ఐతియోపియో అధికారి వద్దకు ఫిలిప్పను రోమా శతాధిపతి వద్దకు పేతురును, ఆ ఇశ్రాయేలీయ బాలికను సిరియా సేనాధిపతి నయమానకు సహాయం చెయ్యటానికి పంపిన ఆయనే నేడు పురుషులను, స్త్రీలను యువతను దేవుని సహయం నడుపుదల అవసరమైన వారి వద్దకు తన ప్రతినిధులుగా పంపుతున్నాడు. MHTel 416.1