స్వస్థత పరిచర్య
నాస్తిక గ్రంథకర్తలు
విద్యసంపాదించటానికి నాస్తిక గ్రంథకర్తల రచనల్లో అనేక అద్భుతమైన ఆలోచనలు ఉంటాయి. గనుక వాటిని చదవటం ప్రాముఖ్యమని అనేకమంది అభిప్రాయపడతారు. అయితే ఈ గొప్ప ఆలోచనలకు ఆసలు కర్త ఎవరు ? దేవుడే ఇంకెవ్వరు కాదు ఆయనే వెలుగుకు మూలం. సత్యమంతా మన అందుబాటులో ఉండగా కొన్ని సత్యాల కోసం నాస్తికుల తప్పుడు భావాల్లో నుంచి ఈడ్పుకాళ్ళతో ఎంతుకు బయటికి నడవాలి? MHTel 383.1
దేవుని ప్రభుత్వాన్ని వ్యతిరేకరించే మనుషులు కొన్నిసార్లు ప్రదర్శించే వివేకాన్ని కలిగి ఉండటం ఎలా సంభవిస్తుంది ? సాతాను తానే పరలోకంలో విద్యను అభ్యసించినవాడు. అతడికి మేలు గురించి కీడు గురించి జ్ఞానం ఉంది. అతడు విలువ గలదాన్ని తుచ్చమైన దానితో మిశ్రమం చేస్తాడు. మోసగించటానికి అతడికి శక్తినిచ్చేది ఇదే. కాగా సాతాను పరలోక ప్రకాశం గల వస్త్రాలు ధరించాడుగనుక అతణ్ణి వెలుగు దూతగా స్వీకరిద్దామా? అతడి పద్ధతుల ప్రకారం విద్యను పొంది అతడి స్వభావం వల్ల ప్రభావితులై అతడి సేవకు తమను తాము అంకితం చేసుకున్న ప్రతినిధులు శోధకుడికి ఉన్నారు. మనం వారితో సహకరిద్దామా? విద్య సంపాదనకు అతడి ప్రతినిధులు గ్రంధాల్ని అత్యవసరాలుగా స్వీకరిద్దామా? MHTel 383.2
నాస్తిక రచయితల తెలివి గల అభిప్రాయాల్ని అవగాహన విషయాల్ని అధ్యయనం చెయ్యటానికి వినియోగిస్తే ఇప్పుడు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చున్న వేల ప్రజలు జీవపు వెలుగు మహిమలో సంతోషిస్తారు. MHTel 383.3