స్వస్థత పరిచర్య

140/173

చారిత్రిక, వేదాంత జ్ఞానం

క్రైస్తవ సేవ సిద్ధబాటుకు విస్తృతమైన చారిత్రక, వేదాంత రచనల జ్ఞానం అగత్యమని అనేకులు బావిస్తారు. సువార్త భోధించటంలో ఈ జ్ఞానం తమకు సహాయపడుతుందని వారి ఆలోచన. కాని మనుషుల అభిప్రాయాల్ని అధ్యయనం చెయ్యటంలో వారి తీవ్ర శ్రమ వారి సేవకు బలాన్ని చేకూర్చే బదులు బలహీనపర్చుతుంది. చారిత్రక, వేదాంత జ్ఞానంతో నిండిన బరువైన పుస్తకాలతో నిండిన లైబ్రరీలను చూస్తుండేటప్పుడు ఆహారం కాని దానిని ఎందుకు ఇంత ఖర్చు పెట్టటం? అని తలస్తుంటాను. ఆ పుస్తకాల్లోని విషయం కన్నా యోహాను ఆరో అధ్యాయం మనకు ఎక్కువ చెబుతున్నది. క్రీస్తంటున్నాడు: “జీవాహారము నేనే. నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రము ఆకలిగొనడు; నాయందు విశ్వాసముంచువాడు ఎప్పుడును దప్పిగొనడు”. “పరలోకమునుండి దిగి వచ్చిన జీవాహారము నేనే ఎవడైనను ఈ ఆహారము భుజించితే నాడెల్లప్పుడును జీవించును.” “విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు”. “నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునైయున్నవి”. యోహాను 6:35, 51, 47, 63. MHTel 383.4

ఖండించకూడని చరిత్ర ఆధ్యనం ఒకటి ఉంది. ప్రవక్తల పాఠశాలల్లోని అధ్యయనాల్లో పవిత్ర చరిత్ర ఒకటి. లోకంలోని జాతులతో దేవుని వ్యవహరణ దాఖలాల్లో యోసేపు ఆడుగు జాడలు కనిపించాయి. అలాగే నేడు ప్రపంచ జాతులతో దేవుడు వ్యవహరించటాన్ని మనం పరిగణించాల్సి ఉంది. గొప్ప సంస్కరణోధ్యమాల్లో దేవుని చిత్తం పని చెయ్యటాన్ని అధ్యయ్యనానికి మహా సంఘర్షణ చివరి పోరాటానికి రాజ్యాలను సమీకరించటంలో పురోగతిని అవగాహన చేసుకోవాటానికి చరిత్రలో మనం ప్రపంచం నెరవేర్పును చూడాలి. MHTel 384.1

“కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగియుండుడి. వీరు విధేయులగు పిల్లల్లో మీ పూర్వపు ఆజ్ఞానములో మీకుండిన ఆశననుసరించి ప్రవర్తింప (కుడి)”1 పేతురు 1:13-15. MHTel 384.2

అటువంటి అధ్యయనం ఈ జీవితాన్ని గురించి విశాలమైన విస్తృతమైన భావాల్ని ఇస్తుంది. దాని సంబంధాలు దాని పై అనుకొని ఉండే విషయాలు. సమాజం, జాతి సహోదరత్వంలో మనమందరం ఎలా ఏకమయ్యా మో, ఒక సభ్యుడికి కలిగే హింస లేక దుస్తితి ఎంత మేరకు అందరికి బాధ కలిగే విషయమౌతుందో గ్రహింటానికి అది మనకు సహాయపడుతుంది. MHTel 384.3

సామాన్యంగా అధ్యయనం చేసే విధానాన్ని పరిగణనలోనికి తీసుకుంటే చరిత్ర మానవుడి సాధనాల, యుద్ధాల్లో అతడి విజయాలు, అధికారాన్ని చేజిక్కించుకోవటంలోను పేరు ప్రతిష్టలు సంపాదించుటంలోను అతడి విజయాన్ని గురించి ఉంటుంది. మానవుడి విషయాలలో దేవుని సంబంధాన్ని విస్మరించటం జరుగుతుంది. రాజ్యాల ఉత్థాన పతనాల్లో ఆయన ఉద్దేశాన్ని గురించి బహు కొద్దిమందే అధ్యయనం చేస్తారు. MHTel 385.1

ప్రస్తుతం అధ్యయనం చేసి బోధిస్తున్నట్లు వేదాంతం చాలా మేరకు మానవ ఊహ దాఖలాగా మారి “జానం లేని మాటలో చీకటి ఆలోచనగా” తయారవుతున్నది. ఈ పుస్తకాలన్నిటిని సంపాదించటంలో ఉద్దేశం తరుచు మనసుకు ఆత్మకు ఆహారాన్నివ్వాలన్న కోరికతో కాదు కాని సంస్కారం విద్యా గంధంతో కూడిన ప్రతిపాదనలతో క్రైస్తవాన్ని సమర్పించటానికి తత్తవేవత్తలు వేదాంతులతో పరిచయం పెట్టుకోవాలన్న ఆకాంక్షతో. MHTel 385.2

రచించపడ్డ పుస్తకాలన్ని పరిశుద్ధ జీవితానికి దోహదపడవు. ఆ మాహా బోధకుడన్నాడు: “మీ మీద నాకాడినెత్తికొనుడి” “నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను” “నా యొద్ద నేర్చుకొనుడి. ” జీవాహారం లేక నశిస్తున్న ఆత్మలతో మాట్లాడటానికి మీ మానసిక అహంభావం మీకు సహాయం చెయ్యదు. మీరు క్రీస్తు వద్ద నేర్చుకోవలసిన ప్రయోగాత్మక పాఠాల స్థానాన్ని ఈ పుస్తకాల అధ్యయనం తీసుకోవటానికి మీరు అనుమతిస్తున్నారు. ఈ అధ్యయనం ఫలితం ద్వారా ప్రజలు వాక్యాహారాన్ని పొందరు. ఎంతో మానసిక శ్రమ కలిగించే పరిశోధనలో అతి స్వల్పం క్రీస్తుకు జయప్రదమైన సేవకుడవ్వటానికి తోడ్పడుతుంది. MHTel 385.3

“బీదలకు సువార్త ప్రకటించుటకై” రక్షకుడు వచ్చాడు. తన బోధనలో ఆయన సామాన్య పదజాలాన్ని అతి స్పష్టమైన చిహ్నాల్ని వినుచుండిరి”. ఈ కాలంలో ఆయన సేవ చేస్తున్నవారికి ఆయన బోధించినర పాఠాల అంతస్సూచనలు అవసరం. MHTel 385.4

జీవం గల దేవుని మాటలు విద్య అంతటిలోను అత్యున్నత విద్య. ప్రజలకు వాక్య పజరిచర్య చేసేవారు. జీవాహారాన్ని భుజిచంటం అవసరం. ఇది వారికి ఆధ్యాత్మిక శక్తిని ఇస్తుంది. అప్పుడు వారు అన్ని తరగుతుల ప్రజలకు పరిచర్య చెయ్యటానికి సుశిక్షితులవుతారు. MHTel 385.5