స్వస్థత పరిచర్య

138/173

37—విద్యలో అవాస్తవాలు, వాస్తవాలు

దేవుని మాటల్ని మరుగున ఉంచి మానవాభిప్రయాల్ని మనుషులు దృష్టికి తేవటానికి దుష్ట కూటమిలోని ప్రధాన పాత్రదారి నిత్య నిర్విరామంగా కృషి చేస్తున్నాడు. “ఇదే త్రోవ దీనిలో నడుపుడి” (యెషయా 30:21) అంటూ దేవుడు చెప్పే మాటల్ని మనం వినిపించుకోకూడదన్నది అతడి ఉద్దేశ్యం. వక్ర విద్యా ప్రక్రియల ద్వారా దేవుని వెలుగును అర్పివెయ్యటానికి అతడు శ్రాయశక్తులా కృషి చేస్తున్నాడు. దేవుణ్ణి గుర్తించని తత్వ సంబంధమైన ఊహకల్పన, MHTel 382.1

శాస్త్ర పరిశోధన వేలాది ప్రజల్ని నాస్తికుల్ని చేస్తున్నది. శాస్త్ర విజ్ఞానం సంపాదించిన వారు తమ పరిశోధనల ద్వారా తేల్చిన అభిప్రాయాలను ఈ దినాల్లోని పాఠశాలల్లో బోధించి విశదీకరించటం జరుగుతున్నది. MHTel 382.2

వీటి వల్ల ఏర్పడుతున్న అభిప్రాయం ఏమింటటే ... ఈ మేధావులు చెప్పేది నిజమైతే... బైబిలు అబద్దమని మానవుడి మనసుకు ఆకర్షణీయంగా ఉంటుంది. యువతకు దానిలో తమ ఆలోచనల్ని ఆకట్టుకునే స్వేచ్చ; కనిపిస్తుంది. మోసంలో పడతారు. సాతాను జయం సాధిస్తాడు., యువత మనసుల్లో నాటిన ప్రతీ సంశయ విత్తనాన్ని సాతాను పెంచి పోషిస్తాడు. దాని పెరగనిచ్చి ఫలాలు ఫలింపనిస్తాడు. కొద్ది కాలంలో అవిశ్వాసం విస్తారమైన దాని పంట పండుతుంది. MHTel 382.3

మానవ హృదయం చెడుకి ఎక్కువ మొగ్గు చూపుతుంది. గనుక యువత మనస్సుల్లో నాస్తిక విత్తనాలు విత్తటం మిక్కిలి ప్రమాదకరం. దేవునిలో విశ్వాసాన్ని ఏది బలహీనపర్చుతుందో అది శోధనను ప్రతిఘటించే శక్తిని లేకుండా చేసి ఆత్మను దోచుకుంటుంది. పాపానికి వ్యతిరేకంగా ఉ న్న ఒకే ఒక రక్షణను అది తొలగిస్తుంది. దినవారీ జీవితంలో అయిన ప్రవర్తనను కనపర్చటం ద్వారా దేవుని ఘనపర్చటమే గొప్పతనమని యువతకు బోధించే పాఠశాలలు మనకు అవసరం. ఆయన ఉద్దేశాల్ని నెరవేర్చేందుకు మనం ఆయన వాక్యం ద్వారాను ఆయన కార్యాల ద్వారాను దేవున్ని గూర్చి నేర్చుకోవలసిన అవసరం ఉంది. MHTel 382.4