స్వస్థత పరిచర్య

137/173

దివ్య మర్మాల్లోకి అన్వేషణ

“రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటి ననుసరించి నడుచుకొనునట్లు బయలుపర్చబడినవి యెల్లప్పుడు మనవియు మన సంతతివారి వియునగునని చెప్పుదురు”. ద్వితియోపదేశకాండము 29:29 దేవుడు తన వాక్యంలో తనను గురించి ఇచ్చిన ప్రత్యక్షత మన అధ్యయనం కోసం ఉద్దేశించింది. దీన్ని అవగాహన చేసుకోవటానికి మనం కృషి చెయ్యవచ్చు. కాని దీనికి మించి మనం లోతులకు చొచ్చుకుపోకూడదు. దేవుని స్వభావం గురించి అలసిపోయేవరకు అత్యున్నత మేధ శ్రమపడవచ్చు కాని ఆ ప్రయత్నం నిష్పలమౌతుంది. ఇది మనం పరిష్కరించాల్సిన సమస్య కాదు. ఏ మానవ మనస్సూ దేవున్ని అవగాహన చేసుకోలేదు. ఆయన స్వభావం గురించి ఎవరూ ఊహాగానాలకు పాల్పడకూడదు. ఆయన స్వభావం గురించి ఎవరూ ఊహగానాలకు పాల్పడకూడదు. ఇక్కడ మౌనమే ప్రధానం. సర్వజ్ఞుడైన ఆయన చర్చనీయాంశం కాదు. MHTel 372.1

రక్షణ ప్రణాళిక రూపకల్పన సమయంలో తండ్రి కుమారుల మధ్య సంప్రదింపుల్లో పాలు పంచుకోవటానికి దేవదూతలకు సయితం అనుమతి లేదు. సర్వోన్నతుని రహస్యాల్లోకి మానవ మాత్రులు చొరబడకూడదు. దేవుని విషయంలో మనం చిన్న పిల్లలంత అజ్ఞానులం. కాని చిన్న పిల్లల్లా మనం అయనను ప్రేమించి ఆయనకు విధేయలం కావచ్చు. ఆయన స్వభావం గురించి లేక ఆయన విశేషాధికారాల గురించి ఊహల్లో మునిగి తేలటం కన్నా ఆయన చెప్పిన మాటలను వినుకుందాం. MHTel 372.2

“దేవుని గూఢాంశములను నీవు తెలిసికొనగలవా? సర్వశక్తుడగు దేవుని గూర్చి నీకు పూర్ణజ్ఞానము కలుగునా ? అది ఆకాశ వీధి అంత ఉ న్నతమైనది నేవేమి యెరుగుదువు? దాని పరిమాణము భూమి కంటే అధికమైనది. దాని వెడల్పు సముద్రము కంటే అధికమైనది. “జ్ఞానము ఎక్కడ దొరుకును; వివేచన దొరకు స్థలము ఎక్కడ నున్నది; నరులు దాని విలువను ఎరుగరు ప్రాణులున్నదేశములో అది దొరకలేదు. అగాధము.. అది నాలో లేదనను, సముద్రము... నా యొద్ద లేదనను సువర్ణము దానికి సాటియైనది కాదు. దాని విలువ గల గోమేధికమునకైనను నీలమునకైనను కొనబడునది కాదు. సువర్ణమైనను స్పటికమైనను దానితో సాటికావు. ప్రశస్తమైన బంగారు నగలకు ప్రతిగా అది ఇయ్యబడదు. పగడముల పేరు ముత్యముల పేరు దాని యెదుట ఎత్తనే కూడదు. జ్ఞానసంపాద్యము కెంపులకన్నా కోరతగినది. కూషు దేశపు పుష్యరాగము దానితో సాటి కాదు. శుద్ద సువర్ణమునకు కొనబడునది కాదు అట్టయిన జ్ఞానము ఎక్కడ నుండి వచ్చును? వివేచన దొరుకు స్థలమెక్కడనున్నది; అది సజీవులందరి కన్నులకు మరుగైయున్నది. ఆకాశ పక్షులకు మరుగుచేయబడియున్నదని మేము చెవులారా దాని గూర్చిన వార్త వింటిమని నాశనమును మరణమును అనును. దేవుడే దాని మార్గమును గ్రహించును,దాని స్థలము ఆయనకే తెలియును. ఆయన భూమ్యంతముల వరకు చూచుచున్నాడు. ఆకాశము క్రింద దానినంతటిని తెలిసికొను చున్నాడు. గాలికి ఇంత బరువు ఉండవలెనని ఆయన నియమించినప్పుడు ప్రమాణమును బట్టి జలములకు ఇంత కొలతయని ఆయన వాటిని కొలిచి చూచినప్పుడు, వర్షమును కట్టడ నియమించి నపుడు ఉరుముతో కూడిన మెరుపునకు మార్గము ఏర్పరిచినపుడు ఆయన దాని చూచి బయలు పంచను. దానిని స్థాపన చేసి దాని పరిశోధించెను మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడుచటయే వివేకమనియు ఆయన మనకు సెలవిచ్చెను”, యోబు 11:7-9, 28:12-28 MHTel 373.1

భూగర్భ గనుల్లో వెదకటం ద్వారా గాని దేవుని గూర్చిన మార్మాలలోకి చొరబడటానికి వ్యర్ధంగా ప్రయత్నించటం ద్వారా గాని వివేకాన్ని కనుగొనలేం. ఆయన మనకిచ్చిన ప్రత్యక్షతను విధేయంగా స్వీకరించి, ఆయన చిత్తానికి అనుగుణంగా జీవించటంద్రారా దాన్ని కనుగొంటాం. MHTel 373.2

ప్రకృతిలో ప్రకటితమైన యెహోవా మర్మాల్ని అపూర్వ ప్రతిభ గల మనుషులు అవగాహన చేసుకోలేరు. గొప్ప విద్యావంతులు సమాధానం చెప్పలేని అనేక ప్రశ్నలను దైవావేశం సంధిస్తున్నది. ఈ ప్రశ్నలు మనం సమాధానం చెప్పటానికి వేసినవి కావు కాని దేవుని మర్మాలను మన గమనాన్ని తిప్పటానికి మన వివేకం పరమితమైనదని మన దినవారీ జీవితంలో మన చుట్టుపరిమిత జ్ఞానం గల మానవుల అవగాహనకు మించిన విషయాలు ఎన్నో ఉన్నాయని మనకు చెప్పటానికి ఉద్దేశించినవి. MHTel 374.1

నాస్తికులు దేవుడున్నాడని నమ్మరు. ఆయన తనను తాను అపరిమిత శక్తితో వెల్లడి చేసుకుంటాడు గనుక వారు ఆయన్ని అవగాహన చేసుకోలేరు. పరిమితమైన మన అవగాహనకు తెరవబడ్డదాని నుంచి దేవున్ని ఎంత గుర్తించాల్సి ఉన్నామో ఆయన తనను గురించి తాను ప్రత్యక్ష పర్చుకోనిదాని నుంచి కూడా ఆయన్ని అంతే గుర్తించాల్సి ఉన్నాం. దివ్య ప్రత్యక్షత, ప్రకృతి రెండింటిలోను మన విశ్వాసాన్ని ఆజ్ఞాపించటానికి దేవుడు మర్మాల్ని ఉంచాడు. ఇది అలాగే ఉండాలి. మనం ఎప్పుడు వెదకాలి. ఎప్పుడు ప్రశ్నిస్తూ ఉండాలి. ఎప్పుడు నేర్చుకుంటూ ఉండాలి. అయినా నేర్చుకోవలసింది అనంతం. MHTel 374.2

” యెహోవా ఆత్మకు నేర్పినవాడెవడు? ఆయనకు మంత్రియై ఆయనకు బోధపరచినవాడెవడు? ఎవని యెద్ద ఆయన ఆలోచన అడిగెను? ఆయనకు వివేకము కలుగజేసినవాడెవడు ? న్యాయ మార్గ మును గూర్చి ఆయనకు నేర్పినవాడెవడు ? ఆయనకు జ్ఞానమును అభ్యసింపజేసినవాడెవడు?ఆయనకు బుద్ధి మార్గమును బోధించి వాడెవడు? MHTel 374.3

జనములు చేద నుండి జారుబిందువుల వంటివి జనులు త్రాసు మీది ధూళి వంటి వారు ద్వీపములు గాలికి ఎగరు సూక్ష్మరేణు వలవలె నున్నవి సమిధలకు లెబానోను చాలకపోవును దహన బలికి దాని పశు వుల చాలావు ఆయన దృష్టికి సమస్త జనములు లేనట్టుగనే యుందురు ఆయన దృష్టికి అవి అభావము గాను శూన్యముగాను ఎంచబడును కావున మీరు ఎవనితో దేవుని పోల్చుదురు? ఏ రూపమును ఆయనకు సాటిచేయగలరు? MHTel 374.4

మీకు తెలియునా? మీరు వినలేదా? మొదటి నుండి ఎవరును మీతో చెప్పలేదా? భూమి స్థాపించుటనుబట్టి మీరు దాని గ్రహింప లేదా? ఆయన భూమండలము మీద ఆసీనుడైయున్నాడు దాని నివాసులు మిడతలవలె కనబడుచున్నారు ఒకడు తెరను విప్పి నట్లు ఆయన ఆకాశవైశాల్యమును వ్యాపింపజేసెను ఒకడు గూడారము వేసినట్లు ఆయన దానినివాస స్థలముగా ఏర్పరచెను..... MHTel 375.1

నీవు ఇతనితో సమానుడవని మీరు నన్నెవనికి సాటి చేయుదురు? అని పరిశుద్దుడు అడుగుచున్నాడు మీ కన్నులు పైకెత్తి చూడుడి వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్క చొప్పున వీటి సమూహము లను బయలు దేరజేసి వీటన్నిటికి పేరులు పెట్టి పిలుచువాడే గదా? తన అధికశక్తి చేతను తనకు కలిగియున్న బలాతిశయము చేతను ఆయన యొక్కటియైనను విడిచి పెట్టడు యాకోబూ,నామార్గము యెహోవాకు మరుగైయున్నది. నా న్యాయము నా దేవుని దృష్టికి కనపడలేదు అని నీవెల అనుకొనుచున్నావు? ఇశ్రాయేలూర నీవెల ఈలాగు చెప్పుచున్నావు? నీకు తెలియలేదా? వు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యు డగు దేవుడు ఆయన సొమ్మసిల్లడు ఆలయుడు ఆయన జ్ఞాన మును శోధించుట అసాధ్యము”. యెషయా 40:12-28 MHTel 375.2

పరిశుద్దాత్మ ప్రవక్తలను ఆవేశపర్చి దైవ ప్రజలకు ఇచ్చిన ఉపదేశం నుంచి మన దేవుని గొప్పతనాన్ని నేర్చుకుందాం. యెషయా ప్రవక్త ఇలా రాస్తున్నాడు: MHTel 375.3

“రాజైన ఉజ్జియా మృతినొందిన సంవత్సరమున అత్యున్నతమైన సమింబసముందు భ్రువు ఆసీనుడైయుండగా నేను చూచితిని; ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిం పె(డుకొనె)ను. ఆయనకు పైగా సెరాపులు నిలిచియుండిరి. ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలుండెను. ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును రెంటితో తన కళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు - సైన్యములకధిపతియగు యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్దుడు, పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గానపత్రి గానమలు చేయుచుండిరి. వారి కంఠ స్వరము వలన గడపకమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా MHTel 375.4

“నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలలవాడను; అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను. నేను నశించితిని. రాజును సైన్యములకధిపతియగు యెహోవాను నేను కన్నులారా చూచితిననుకొంటిని. MHTel 376.1

“అప్పుడు ఆ సెరాపులలో నొకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేతపట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాని తగిలించి . ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను నీ దోషము తొలగిపోయెను అనెను. యెషయా 6:1-7. MHTel 376.2

” యెహోవా నిన్ను పోలినవాడెవడును లేడు. నీవు మహాత్మ్యము గలవాడవు. నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైనదాయెను. జనములకు రాజా, నీకు భయపడనివాడెవడు? జనము జ్ఞానులందరిలోను వారి రాజ్యములన్నిటిలోను నీ వంటివాడెవడును లేడు గనుక నరులు నీకు భయపడుట అనుగుణ్యము”. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలిసకొనియున్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టకమును పే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసియున్నావు. నా చర్యలన్నటిని నీవు బాగుగా తెలిసికొనియున్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసియున్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించియున్నావు. నీ చేయి నా మీద ఉంచియున్నావు. ఇట్టి తెలివి నాకు మించినది. MHTel 376.3

“మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక శక్తి గలవాడు. ఆయన జ్ఞానమునకు మితిలేదు”. కీర్తనలు 147:5 MHTel 377.1

“నరుని మార్గములను యెహోవా ఎరుగును. వాని నడతలన్నిటిని ఆయన గుర్తించును”. సామెతలు 5:21 MHTel 377.2

“ఆయన మరుగు మాటలను మర్మములను బయలు పర్చును. అంధకారములోని సంగతులు ఆయనకు తెలియును. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్దనున్నది”. దానియేలు 2:22 MHTel 377.3

“ఆనాది కాలము నుండి ఈ సంగతులను తెలియపరచిన ప్రభువు సెలవిచ్చుచున్నాడు”. “ప్రభువు మనస్సును ఎరిగినవాడెవడు ? ఆయనకు ఆలోచన చెప్పినవాడెవడు? ఆయన మూలమునకు ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగియున్నది. యుగయుగములకు ఆయనకు మహిమ కలుగును గాక”. అ.515:18. రోమా 11:34-36 MHTel 377.4

“సకల యుగములలో రాజైయుండి, అక్షయుడును అధృశ్యుడునైన అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగునుగాక”. సమీపంరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడైయున్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు. ఎవడును చూడనేరడు. ఆయన ఘనతయ శాశ్వతమైన ప్రభావము కలిగియుండును గాక”. 1 తిమోతి 1:17, 6:16. MHTel 377.5

“ఆయన ప్రభావము మిమ్మును భయ పెట్టదా? ఆయన భయము మీ మీదికి రాదా? “దేవుడు ఆకాశమంత మహోన్నతుడు కాడా? నక్షత్రముల ఔన్నత్యము చూడుము అవి ఎంత పైగానున్నవి”? “ఆయన సేనలను లెక్కింప శక్యమా ఆయన వెలుగు ఎవరి మీదనైనను ఉదయింపకుండునా MHTel 377.6

“మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును నీవు భూమి మీద పడుమని హిమముతోను వర్షముతోను మహా వర్షము తోను ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు మనుష్యులందరు ఆయన సృష్టి కార్యమును తెలిసికొనునుట్లు ప్రతి మనుష్యుని చేతిని బిగించి ఆయన ముద్ర వేసియున్నాడు... మెరుపును మేఘములును సంచారము చేయును ఆయన వాటిని ఆజ్ఞాపించినది యావత్తును అవి నెరవేర్చును శిక్ష కొరకేగాని తన భూలోకము కొరకే గాని కృప చేయుటకే గాని ఆయన ఆజ్ఞపించినదానిని అవి నెరవేర్చును... MHTel 377.7

ఈమాట ఆలకింపుము ఊరకుండి దేవుని అద్భుత క్రియలను ఆలోచింపుము దేవుడు తమన మేఘపు మెరుపు ప్రకాశింపవలెనని యెట్లు తీర్మానించెనో నీకు తెలియునా మేఘములను తేలజేయు టయు పరిపూర్ణ జ్ఞానము గలవాని మహాకార్యములను నీకు తెలియునా?....పోతపోసిన అద్దమంతా దట్టమైనదగు ఆకాశమును ఆయన వ్యాపింపజేసినట్టు నీవు వ్యాపిపంజేయగలవా? మేము ఆయనతో ఏమి పలుకవలెనో అది మాకు తెలుపుము చీకటి కలిగింనందున మాకేమి తోచకయున్నది.... MHTel 378.1

ఉన్నత మేఘమలలో ప్రకాశించు ఎండ ఇప్పుడు కనబడకయున్నది గాలిమేఘములను పొగొట్టి దాని తేడా కనపరచును ఉత్తరదిక్కున సువర్ణ ప్రకాశము పుట్టును దేవుడు భీకరమైన మహిమను ధరించకొనియున్నాడు సర్వశక్తుడగు దేవుగు మహాత్మ్యము గల వాడు ఆయన మనకు ఆగోచరడు న్యాయమును నీతిని ఆయన ఏ మాత్రము చెరపడుఅందువలన నరులు ఆయనయందు భయ భక్తులు కలిగియందురు “ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలియున్నవాడెవడు? ఆయన భూమ్యా కాశములను వంగిచూడ ననుగ్రహించుచున్నాడు” ” యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలుడు గలవాడు ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు యెహోవా తుపానులోను సుడిగాలిలోను వచ్చువాడు”. MHTel 378.2

” యెహోవా మహాత్మ్యము గలవాడు ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు ఆయన మహాత్మ్యము గ్రహింపశక్యము కానిది ఒక తరము వారు మరియొక తరమువారి యెదుట నీ క్రియలను కొనియాడుదురు నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు మూన్నత మైన నీ ప్రభావ మహిమను నీ ఆశ్చర్యకార్యములను నేను ధ్యానించెదను నీ భీకర కార్యముల విక్రమము మను ష్యులు వివరించెదరు నేను నీ మహాత్మ్యమును వర్ణించెదను నీ మహా దయాళుత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదురు నీ నీతిని గూర్చి వారు గానము చేసెదరు.... MHTel 378.3

యెహోవా నీ పనుల్నియు నీకు కృతజ్ఞతా స్తుతులుచెల్లించుచున్నవి నీ భక్తులు నిన్ను సన్నుతించుదురు ఆయన రాజ్య మహెూన్నత ప్రభావమును ఆయన బలమునునరులకు తెలియజేయుటకై నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకొందురు నీ శౌర్యమును గూర్చి పలుకుదురు నీ రాజ్యము శాశ్వత రాజ్యము నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును.... నా నోరు యెహోవాను సోత్రము చేయును శరీరులందరు ఆయన పరిశద్దు నామమును నిత్యము సన్ను తించుదురు గాక”. యోబు 13:11; 22:13; 37:5-24; కీర్త 113:5,6 నహూము 1:3 కీర్త 145:3-21 MHTel 379.1

దేవుడు ఎలాంటివాడో ఆయన దృష్టిలో మనం ఎవరిమో అన్న విషయాలను గురించి ఎక్కువ నేర్చుకునే కొద్ది మనం ఆయన ముందు భయంతో వణుకుతాం. దేవుడు పవిత్రంగా పరిగణించినదాన్ని సామాన్య విషయంగా పరిగణించిన పూర్వపు ప్రజల దుర్గతినుంచి వచ్చే హెచ్చరికను మనుషులు నేడు తీవ్రంగా పరిగణించుదురు గాక. పరిశుద్దు మందసం ఫిలిప్తీయుల దేశం నుంచి తిరిగి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు దాన్ని తెరవటానికి భక్తిహీనమైన సాహసం ప్రదిర్శించినప్పుడు దేవుడు వారిని కఠినంగా శిక్షించాడు. MHTel 379.2

ఇంకా, ఉజ్జా మీదికి వచ్చిన తీర్పును పరిగణించండి. దావీదు రాజ్యపరిపాలనలో మందసాన్ని యెరూషలముకు తీసుకువెళుతున్నప్పుడు మందసాన్ని నిలకడగా ఉంచటానికి ఉజ్జా చెయ్యి చాపి దాన్ని పట్టుకున్నాడు. దేవుని సముఖానికి చిహ్నమైన మందసాన్ని ముట్టుకోవటానికి సహసించి నందుకు దేవుడు అతణ్ణి తక్షణం మరణంతో మొత్తాడు. MHTel 379.3

మండుతున్న పొద దగ్గర అందులో దేవుడున్నాడన్న స్పృహ లేక ఆ చోద్యం చూడటానికి మోషే దాన్ని సమీపించినప్పుడు ఈ ఆజ్ఞ ఇవ్వబడింది. MHTel 380.1

“దగ్గరకు రావద్దు. నీ పాదముల నుండి నీ చెప్పులు విడుపుము; నీవు నిలిచియున్న స్థలము పరిశుద్దు ప్రదేశము... మోషే తన ముఖమును కప్పుకొని దేవునివైపు చూడవెరచెను.” నిర్గమకాండము 3:5,6. MHTel 380.2

“యాకోబు బెయేర్షబా నుండి బయలుదేరి హారమువైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగ్రుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి, ఆ చోటి రాళ్ళలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసికొని అక్కడ పండుకొనెను. MHTel 380.3

“అప్పుడతడు ఒక కల కనెనె., అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలువబడియుండెను. దాని కొన అకాశమునంటెను; దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచు నుండిరి, మరియు యెహోవాదానికి పైగా నిలిచి నేను “నీ తండ్రియైన అబ్రాహము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను; నీవు పండుకొనియున్న యీ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చెదను... ఇదిగో నేను నీకు తోడైయుండి నీవు వెళు , ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించెదనని చెప్పగా,. MHTel 380.4

“యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు న్నాడు. అని నాకు తెలియకపోయెననుకొని భయపడి... ఈ స్థలము ఎంతో భయంకరము ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు. పరలోకపు గనిన ఇదే అనుకొనెను”. అదికాండము 28:10:17 MHTel 380.5

దేవుని నివాస స్థలానికి సంకేతాలైన అరణ్య గుడారంలోను భూలోక దేవాలయంలోను ఒక స్థలం దేవుని సముఖానికి కేటాయించబడ్డ పవిత్ర స్థలం. దాని ప్రవేశం వద్ద కెరూబుల బొమ్మలతో నేసిన తెరను ఒక్కరు తప్ప ఇంకెవ్వరు ఎత్తకూడదు. కోరబడకుండా ఆ తెర ఎత్తి అతి పరిశుద్ధ స్థల పరిశద్దు రహస్యంలోకి ప్రవేవించటం మరణాన్ని తెచ్చుకోటమే. ఎందుకంటే కరుణాపీఠం మీది కృపాసనం పైన అది పరిశుద్దమైన మహిమ నివసించింది. ఆ మహిమను ఏ మానవుడు చూసి బతకడు. సంవత్సరంలో అతి పరిశద్ధ స్థలంలో పరిచర్యకు నియమితమైన ఆ ఒక్క రోజున ఆ మహిమను ధూపం మేఘంలా కప్పుతుండగా, ప్రధాన యాజకుడు దేవుని సముఖంలోకి వణుకుతూ ప్రవేశించాడు. ఆలయ ఆవరణమంతా నిశ్శబ్దంగా ఉండేది. బలిపీఠం వద్ద యాజకులెవవ్వరూ పరిచర్యచేయువారు కాదు. ఆరాధక సమూహాలు నిశ్శబ్దంగా కృపకై తమ విన్నపాలను దేవునికి సమర్పించుకునేవారు. MHTel 380.6

“ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి,యుగాంత మందున్న మనకుబుద్ధి కలుగుటకై వ్రాయబడెను”.1 కొరింథీ 10:11. “యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు ఆయన సన్నిధిని లోకమంతుయు మౌనముగా ఉండును గాక”. ” యెహోవా రాజ్యము చేయనున్నాడు జనములు వణుకును ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు. భూమి వణకును సీయోనులో యెహోవా మహెన్నతుడు జనములన్నిటి పైన ఆయన హెచ్చి యున్నాడు భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు యెహోవా పరిశుద్ధుడు” MHTel 381.1

“యెహోవా పరిశుద్ధాలయములో ఉన్నాడు యెహోవా సింహాస నము ఆకాశముందున్నది ఆయన నరులను కన్నులారాచూచు చున్నాడు” “తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసుం లదరివైపు ఆయనచూచుచున్నాడు”. ఆయన వారందరి హృదయ మును ఏకరీతిగా నిర్మించిన వాడు వారి క్రియలన్నియు విచారించు వాడు వారిని దర్శించు వాడు “లోకులందరు యెహోవా యందు భయ భక్తులు నిలుప వలెను.భూలోక నివాసులందరు ఆయనకు వెరవవలెను”.హబక్కూకు 2:20; కీర్త 99:1-3 11:4; 102:19; 33:14, 15,8 MHTel 381.2

*****