స్వస్థత పరిచర్య
సర్వేశ్వర (స్వాభావిక వస్తువు లన్నిటిలో దేవుడున్నాడన్న) వాదం
ఈనాడు ప్రతీ చోట విద్యా సంస్థల్లోకి సంఘాల్లోకి దేవునిలోను ఆయన వాక్యంలోను విశ్వాసాన్ని లోలోపల చెరచే ప్రేతాత్మ వాద బోధనలు వస్తున్నాయి. దేవుడు. ప్రకృతి అంతటా వ్యాపించి ఉండే ఓ ఆత్మ అన్న సిద్ధాంతాన్ని లేఖనాలను విశ్వసిస్తున్నట్లు చెప్పేవారు కూడా నమ్ముతున్నారు. కాగా ఈ సిద్ధాంతం ఎంత అందమైన దుస్తులు ధరించినా ఇది మిక్కిలి మోసకరమైన సిద్ధాంతం. అది దేవుని గురించి తప్పుడు అభిప్రాయం పుట్టించి ఆయన ప్రతిష్ట, గొప్పతనం ఘనతను అగౌరవపర్చుతుంది. అది మనుషుల్ని తప్పుదారి పట్టించుటమే కాదు దుర్నీతితో నింపుతుంది కూడా. దాని మూలం చీకటి, దాని కార్య రంగం ఇంద్రియ సుఖం. దాన్ని అంగీకరిస్తే దాని ఫలితం దేవుని నుంచి ఎడబాటు. పతనమైన మానవ స్వభావానికి దీని అర్థం నాశనం. MHTel 370.4
పాపం ద్వారా అస్వాభావిక పరిస్థితి ఏర్పడింది. మనల్ని పునరుద్ధరించటానికి మానవాతీత శక్తి అవసరం. లేకపోతే అది నిరర్ధకం. మానవ హృదయాలపై పాపానికున్న పట్టును విడిపించగల శక్తి ఒకటి మాత్రమే ఉంది. యేసు క్రీస్తు ద్వారా దేవుని శక్తి, సిలువ పొందిన ఆయన రక్తం ద్వారా మాత్రమే పాపానికి నిష్కృతి లభిస్తుంది. మన పతిత స్వభావాన్ని ప్రతిఘటించటానికి మనల్ని సమర్ధుళ్ళి చేసేది ఆయన కృపమాత్రమే. దేవుని గూర్చిన ప్రేతాత్మ వాద భోధనలు ఆయన కృపను నిరర్ధకం చేస్తాయి. దేవుడు ప్రకృతి అంతా వ్యాపించి ఉండే ఆత్మ అయితే ఆయన మనుషులందరిలో ఉంటాడన్నమాట. అప్పుడు పరిశుద్ధత సాధించటానికి మానవుడు తనలో ఉన్న శక్తిని వృద్ధిపర్చుకుంటే సరిపోతుంది. MHTel 371.1
ఈ సిద్ధాంతాలు చివరికి తేల్చి చెప్పే విషయానికొస్తే అవి క్రైస్తవ మత వ్యవస్థనే సొంతం తుడిచివేస్తాయి. అవి ప్రాయశ్చిత్తం అవసరాన్ని రద్దుచేసి మానవుణ్ణి తన సొంత రక్షకుణ్ణి చేస్తాయి. దేవుని గూర్చిన ఈ సిద్ధాంతాలు ఆయన వాక్యాన్ని నిష్పలం చేస్తాయి. వీటిని అంగీకిరంచేవారు చివరికి బైబిలుని ఓ కల్పిత కథగా పరిగణించే గొప్ప ప్రమాదంలో ఉంటారు. దుర్మార్గత కన్నా సద్గుణం మేలని వారు పరిగణించవచ్చు. కాని దేవునికి చెందిన సార్వభౌమత్వ స్థానాన్ని ఆయనకు ఇవ్వకుండా వారు మానవ శక్తి మీద ఆధారపడతారు. దేవుడు లేని మానవశక్తి విలువలేనిది. నిస్సహాయ మానవ మనశ్శక్తి పాపాన్ని ప్రతిఘటించి జయించలేదు. ఆత్మకున్న రక్షణలు ధ్వంసమయ్యాయి. పాపానికి వ్యతిరేకంగా మానవుణ్ణి అడ్డుకునేది ఏమిలేదు.దేవుని వాక్యం ఆయన ఆత్మ నియంత్రణనుఒకసారి ఓవ్యక్తి తోసి పుచ్చటం జరిగినప్పుడు అతడు ఎంత దుస్తితికి దిగజారిపోతాడో చెప్పలేం. “దేవుని మాటలన్నియు పుటము వేయబడినవే ఆయనను ఆశ్ర యించువారికి ఆయన కేడెము ఆయన మాటలతో ఏ మియు చేర్చకుము ఆయన నన్ను గద్దించునేమో ‘దుష్టుని దోషములు వానిని చిక్కులబెట్టును వాడు తన పాపపాశములవలన బంధింపబడును”.సామెతలు 30:5,6;5:22 MHTel 371.2