స్వస్థత పరిచర్య
భూమి సృష్టి
సృష్టి కార్యాన్ని విజ్ఞాన శాస్త్రం వివరించలేదు. జీవిత మర్మాన్ని ఏ విజ్ఞాన శాస్త్రం విశదం చెయ్యగలదు? MHTel 356.3
“ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది. కనపడు పదార్ధములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము”. హెబ్రీ 11:3 MHTel 356.4
“నేను వెలుగును సృజించినవాడను అంధకారమును కలుగజేసిన వాడను.... యెహోవా అను నేనే వీటన్నిటిని కలుజేయువాడను.... భూమిని కలుజేసినవాడను నేనే దాని మీదనున్న నరులను నేనే సృజింతిని నా చేతులు ఆకాశములను విశాలపరచను వాటి సర్వసమూహమునకు నేను ఆజ్ఞ ఇచ్చితిని”. “నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండ అన్నినయు నిలుచును”. యెషయా 45:7-12, 48:13 MHTel 356.5
భూమిని సృజించుటలో దేవుడు ముందే ఉనికిలో ఉన్న పదార్ధాన్ని ఉపయోగించుకోలేదు. “ఆయన మాట సెలవియ్యగా దాని ప్రకార మాయెను. ఆయన ఆజ్ఞపింపగానే కార్యము స్థిరపర్చబడెను”.కీర్తనలు 33:9 ఐహికమైన లేక ఆధ్యాత్మికమైన విషయాలన్నీ దేవుడైన యెహోవా గళం పల కగా ఆయన ముందు లేని ఆయన సంకల్పం మేరకు సృష్టి అయ్యాయి. ఆకాశ విశాలం దానిలోని సమస్తం భూమి దానిలోని సర్వం అయిన నోటి మాట ద్వారా ఉనికిలోకి వచ్చాయి. MHTel 356.6
మానవుడి సృష్టిలో వ్యక్తిగతమైన దైవ సాధనం ప్రదర్శితమయ్యింది. దేవుడు తన స్వరూపంలో మానవుణ్ణి సృజించనప్పుడు అన్ని విషయాల్లోను మానవ రూపం సంపూఢంగా ఉన్నది కాని అది జీవం లేని రూపం. అప్పుడు ఓ వ్యక్తిగతమైన, స్వయంభూవు అయిన దేవుడు ఆ రూపంలోకి జీవ వాయువును ఊదాడు. మానవుడు సజీవడైన జ్ఞానంగల వ్యక్తి అయ్యాడు. మానవ యంత్రాంగలో అన్ని అవయవాలు పనిచెయ్యటం మొదలు పెట్టాయి. గుండె, ధమనులు, రక్తనాళాలు, నాలుక, చేతులు, కాళ్ళు ఇంద్రియాలు , మానసిక శక్తులు అన్నీ పనిచెయ్యటం మొదలు పెట్టాయి. అన్నీ చట్టబద్దం చెయ్యబడ్డాయి. మానవుడు జీవాత్మ అయ్యాడు, వాక్యం అయిన క్రీస్తు ద్వారా ఓ వ్యక్తిగత దేవుడు మానవుణ్ణి సృజించి అతడికి తెలివిని, శక్తిని ఇచ్చాడు. MHTel 357.1
మనం రహస్యంగా జన్మించినప్పుడు మనకు కలిగిన ఎముకలు ఆయనకు మరుగుపడలేదు. ఆయన కళ్ళు మన శరీర పదార్థాన్ని చూసాయి. అయినా అపరిపూర్ణులుగా, మన అవయవాలు ఏర్పడకముందే అవి ఆయన గ్రంథములో రాయబడి ఉన్నాయి. క్షుద్ర జీవులకు పైగా, తన సృష్టికి మకుటంగా, దేవుడు తన ఆలోచనను తన మహిమను వెల్లడి చెయ్యటానికి మానవుణ్ణి నిర్మించాడు. కాని మానవుడు తనను తాను దేవునిగా హెచ్చించుకొని ఘనపర్చుకోకూడదు. MHTel 357.2
“సమస్త దేశములారా, యెహోవా కు ఉత్సాహ ధ్వని చేయుడి సంతో షముతో యెహోవా సేవించుడి ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి యెహోవాయే దేవుడని తెలిసికొనుడి ఆయనే మన లను పుట్టించెను మనము ఆయన వారము మనము MHTel 357.3
ఆయన ప్రజలము ఆయన మే పెడి గొట్టెలము కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి ఆయను స్తుతించుడి ఆయన నామమును ఘనపరచుడి మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు మన దేవుడైన యెహోవాను ఘనపర్చుడి ఆయన పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిలపడి” కీర్తనలు 100:1-4, 99:9 MHTel 358.1
తాను చేసిన వాటిని తన సాధనాలుగా ఉపయోగించుటంలో దేవుడు నిత్యం పనిచేస్తాడు. ఆయన ప్రకృతి చట్టాలను తన సాధనాలుగా ఉపయో గించుకుంటూ పనిచేస్తాడు. అవి స్వతత్రంగా పనిచెయ్యలేవు. వివేకవంతుడు క్రీయాశీలి అయిన ఓ వ్యక్తి అన్ని విషయాల్లోను తన చిత్త ప్రకారం చలిస్తున్నట్లు ప్రకృతి తన పని ద్వారా సాక్ష్యం ఇస్తున్నది. MHTel 358.2
యెహోవా, నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగానున్నది నీ విశ్వాస్యత తరతరములుండును నీవు భూమిని స్థాపించితివి అది స్థిరముగానున్నది సమస్తము నీకు సేవ చేయుచున్నవి”. MHTel 358.3
“ఆకాశమందును భూమియందును సముద్రములయందును మహాసముద్రములన్నిటియందును ఆయన తన కిష్టమైనదంతయు జరిగించువాడు”. MHTel 358.4
” యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను అవి యో హెూవా నామ మును స్తుతించునుగాక ఆయన వాటిని నిత్య స్థాయువులుగా స్థిరపర్చియున్నాడు ఆయన వాటికి కట్టడ నియమించెను ఏదియు దాని నతిక్రమింపదు”. కీర్తనలు 119:89-91; 13:6; 148:5,6. MHTel 358.5
భూమి ఏటేటా తన ఫలాలను సమృద్ధిగా ఇస్తూ సూర్యుని చుట్టు తన ప్రస్థానాన్ని సాగించటం తన స్వశక్తి వలన చెయ్యటం లేదు. నిత్యుడైన దేవుని హస్తం ఎడతెగకుండా ఈ గ్రహాన్ని నడిపిస్తూ పనిచేస్తుంది. నిత్యం వినియుక్తమౌతున్న దేవుని శక్తే భూమిని తన భ్రమణంలో దాని స్థానంలో ఉంచుతుంది. ఆకాశాల్లో సూర్యుణ్ణి ఉదయింపజేవాడు దేవుడే. ఆయన పరలోక ద్వారాలు తెరచి మనకు వర్షాన్నిస్తాడు. MHTel 358.6
” గొట్టెబొచ్చువంటి మహిమను కురిపించువాడు ఆయనే బూడిద వంటి మంచు కణములు చల్లువాడు ఆయనే”. ” MHTel 359.1
ఆయన ఆజ్ఞనియ్యగా జలరాసులు ఆకాశమండలములో పుట్టును భూమ్యంతర భాగములో నుండి ఆయన ఆవిరి ఎక్కజేయును వర్షము కలుగునట్లు ఆయన మెరుపులు పుట్టించును తన ధనాగారములో నుండి గాలిని రావించును||.కీర్తలు 147:16; యిర్మీయా 10:13. MHTel 359.2
ఆయన శక్తి వలననే మొక్కలు పెరుగుతున్నాయి. ఆకులు పూత వచ్చి పండ్లు పండ్లనిస్తున్నాయి. మానవ శరీర యంత్రాంగాన్ని పూర్తిగా అవగాహన చేసుకోలేం. దాని మర్మాలు గొప్ప ప్రతిభగలవారిని సయితం గందరగోళ పెడతాయి. ఒకసారి మొదలు పెట్టేటట్లు ఏర్పాటు చేస్తే దాని పనిని అది కొనసాగించే యంత్రాంగం వల్ల కాదు. నాడి కొట్టుకోవటం శ్వాస క్రియ సవ్యంగా సాగటం మనం దేవునిలో జీవిస్తాం. చలిస్తాం ఉ నికిని సాగిస్తాం. జీవిస్తున్న ప్రతీ జీవిలో కొట్టుకునే గుండె, స్పందించే ప్రతీ నరం కండరం దేవుని నిత్య సముఖం శక్తి వలననే క్రమంగాను క్రియాశీలంగాను కొనసాగుతాయి. MHTel 359.3
దేవుడు తన ఉన్నతమైన పరిశుద్ధ స్థలంలో ఉన్నట్లు బైబిలు చూపిస్తుంది. నిష్క్రియగా, మౌనంగా ఒంటిరిగా కాక ఆయన చిత్తాన్ని నెరవేర్చటానికి వేచి ఉన్న వేవేల, కోట్లాది దూతలచే పరివేక్షిస్తునట్లు చూపిస్తుంది. ఈ దూత గణాల ద్వారా ఆయన తన రాజ్యం ప్రతీ భాగంతోను సంప్రదింపులు జరుపుతాడు. తన ఆత్మ ద్వారా ఆయన అన్ని చోట్ల ఉంటాడు. తన ఆత్మ ద్వారాను తన దేవ దూతల ద్వారాను ఆయన మానవులకు పరిచర్య చేస్తాడు. - MHTel 359.4
ఈ లోకంలోని గందరగోళం ధ్యాన భంగానికి పైగా ఆయన సింహానాసీనుడై ఉన్నాడు. ఆయన దివ్య పరిశోధనకు సమస్తం తెరవబడే ఉంటుంది. ప్రశాంతమైన తన నిత్యత్వం నుంచి ఏది అవసరమన తన కృపలో భావిస్తాడో దాన్ని ఆయన ఆదేశిస్తాడు. MHTel 359.5
” యెహోవా , తమ మార్గము నేర్పరచుకొనుట నరుల వశములో లేదనియు, మనుష్యులు తమ ప్రవర్తన యందు సన్మార్గమును ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేనెరుగుదును”. . MHTel 360.1
“నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము, నీ ప్రవర్తన అంతటియందును ఆయన అధికారమును ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రవోలను సరాళము చేయును”. MHTel 360.2
“వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయనయందు భయభక్తులు గలవారి మీదను ఆయన కృప కొరకు కని పెట్టువారి మీదను నిలుచుచున్నది”. MHTel 360.3
“దేవా, నీ కృప ఎంతో అమ్యూలమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు”. MHTel 360.4
“ఎవనికి యాకోబు దేవుడు సహయుడగునో ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుటకొనునో వాడు ధన్యుడు”. MHTel 360.5
“యెహోవా, భూమి నీ కృపతో నిండియున్నది, నీ కట్టడలను నాకు బోధింపుము”. MHTel 360.6
“మాకు రక్షణ కర్తవైన దేవా, భూదిగంతములు నివాసులందరికిని దూర సముద్రము మీదనున్న వారికిని ఆశ్రయమైనవాడా, నీవు నీతినిబట్టి భీరక్రియల చేత మాకు ఉత్తరమిచ్చుచున్నావు. బలమునే నడికట్టుగా కట్టుకొనినవాడై తన శక్తి చేత పర్వములను స్థిరపర్చువాడు ఆయనే. ఆయనే సముద్రముల ఘోషను వాటి తరంగములఘోషను అణచువాడు. జనముల అల్లరిని చల్లార్చువాడు” MHTel 360.7
“ఉదయ సాయంత్రములు ఉత్పత్తులను నీవు సంతోషభరిత ములుగా చేయుచున్నావు”. “సంవత్సరమును నీ దయాకిరీటము ధరింపజేసియున్నావు. నీ జాడలుసారము వెదజల్లుచున్నవి” MHTel 360.8
” యెహోవా పడిపోవువారందరిని ఉద్దరించువాడు. క్రుంగిపోయిన వారందరిని లేవనెత్తువాడు. సర్వ జీవుల కన్నులు నీవైపు చూచుచున్నవి. తగిన కాలమందు నీవు వారికి ఆహారమిచ్చుదువు., నీవు నీ గుప్పిలి విప్పి ప్రతీ జీవి కోరికను తృప్తిపర్చుచున్నావు”. MHTel 361.1
యిర్మీయా 10:23; సామెతలు 3:5,6 కీర్తనలు 33:18,19; 36:7; 146:5; 119:64; 33:5;65:5-7; 65:8,11 145:14-16 MHTel 361.2