స్వస్థత పరిచర్య
క్రీస్తులో వెల్లడైన దేవుని వ్యక్తిత్వం
ఓ వ్యక్తిగత జీవిగా దేవుడు తనను తాను తన కుమారుడు క్రీస్తు ద్వారా ప్రత్యక్షపర్చుకున్నాడు. దేవుని మహిమ ప్రకాశం, “ఆయన తత్వము యొక్క మూర్తిమంతము” అయిన యేసు ఈలోకానికి రక్షకుడుగా వచ్చాడు. వ్యక్తిగత రక్షకుడుగా పరలోక న్యాయస్థానంలో మన MHTel 361.3
“మీ హృదయములను కలవరపడనియ్యుకుడి; దేవుని యందు విశ్వాసముంచుచున్నారు. నా యందును విశ్వాసముంచుడి, నీ తండ్రి యింట అనేక నివాసమలు కలవు. లేని యెడల మీదో చెప్పుదును;మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళవచ్చును. నేను వెళ్ళు మీకు స్థలము సిద్ధపరచిన యెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నా యొద్దనుండుటకు మిమ్మును తీసికొను పోవుదును “. యోహాను 14:1-3. MHTel 361.4
విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుని సింహాసనం ముందు “మనుష్య కుమారుని పోలిన ఒకడు ” అనగా క్రీస్తు పరిచర్య చేస్తున్నాడు. హెబ్రీ 1:3; ప్రకటన 1:13. MHTel 361.5
లోకానికి వెలుగైన క్రీస్తు మనుషులు దహించబడకుండా తమ సృష్టికర్తతో పరిచయం కలిగి ఉండేందుకు ప్రకాశమానమైన తన దేవత్వాన్ని మరుగుపర్చుకొని మనుషుల మధ్య మనిషిగా నివసించటానికి వచ్చాడు. పాపం మానవుడికి తన సృష్టికర్తకు మధ్య వేర్పాటు తెచ్చింది. గనుక క్రీస్తు ద్వారా ఆయన ప్రత్యక్షతను తప్ప ఏ మానవుడు దేవున్ని ప్రత్యక్షంగా చూడలేదు. MHTel 361.6
“నేనును తండ్రియును ఏకమైయున్నాము”. అన్నాడు క్రీస్తు. “తండ్రి గాక యెవడును కుమారుని యెరగడు. కుమారుడుగాకను, కుమారు డెవడనికి ఆయనను బయలుపర్చనుద్దేశించునో వాడు గాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు”. యోహాను 10:30; మత్తయి 11:27 MHTel 362.1
మనుషులు ఏమి తెలుసుకోవాలని దేవుడు కోరుతున్నాడో దానిని బోధించటానికి క్రీస్తు వచ్చాడు. పైన ఆకాశంలో భూమి పై మహాసముద్ర జలాల్లో దేవుని చేతి పనిని చూస్తాం. సృష్టించబడ్డవన్నీ దేవుని శక్తికి వివేకానికి ప్రేమకు సాక్ష్యాలు. అయినా దేవుని గురించి క్రీస్తులో వెల్లడైనంత నక్షత్రాల నుంచి గాని లేక మహాసముద్రాల నుంచి గాని లేక జలపాతాల నుంచి గాని నేర్చుకోలేం. MHTel 362.2
తన వ్యక్తిత్వాన్ని ప్రవర్తనను వర్ణించటానికి ప్రకృతి కన్నా విస్పష్టమైన వెల్లడి అవసరమని దేవుడు చూసాడు. మానవ దృష్టి తాళుకోగలిగినం మేరకు అదృశ్య దేవుని స్వభావం గుణలక్షణాల్ని ప్రదర్శించటానికి ఆయన తన కుమారుణ్ణి లోకంలోకి పంపాడు. . MHTel 362.3