స్వస్థత పరిచర్య
ప్రకృతి దేవుడు కాదు
ప్రకృతిలోని దేవుని చేతిపని ప్రకృతిలో దేవుడు తానే ఉన్నట్లు కాదు. ప్రకృతిలోని విషయాలు దేవుని ప్రవర్తన, శక్తి వ్యక్తీరణలు, కాని ప్రకృతిని దేవుడుగా భావించరాదు.మానవుల కళా నైపుణ్యం మనోహరమైన పనితనాన్ని కంటికి ఇంపైన విషయాలను కనపర్చుతుంది. ఈ విషయాలు వాటా ఇని రూపొందించిన వ్యక్తి ఆలోచనను గూర్చి మనకు కొంత జ్ఞానాన్ని కలిగిస్తాయి. కాని ఆ కార్యమే కార్యకర్త కాదు. మన్ననకు పని కాదు పనిచేసినవాడు అర్హుడు. అలాగే ప్రకృతి దేవుని ఆలోచన వ్యక్తీకరణ కాగా, ఘనత పొందాల్సింది ప్రకృతి కాదు, సృష్టించిన దేవునికి. MHTel 355.4
“రండి నమస్కరాము చేసి సాగిలపడుదము మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము”. MHTel 355.5
“భూమ్యగాధస్థలములు ఆయన చేతిలో నున్నవి పర్వత శిఖరములు ఆయనవే సముద్రము ఆయనది ఆయన దాని కలుగజేసెను ఆయన హస్తములు భూమిని నిర్మించెను”. కీర్తనలు 95:7, 95:4,5 MHTel 355.6
“ఆయన సప్తఋషీ నక్షత్రములను, మృగశీర్ష నక్షత్రమును సృష్టించి నవాడు, కారు చీకటిని ఉదయముగా మార్చువాడు పగటిని రాత్రి చీకటివలె మర్పు చేయువాడు”; MHTel 356.1
“పర్వతమును నిరూపించువాడును గాలిని పుట్టించువాడును ఆయనే ఉదయమున చీకటి కమ్మజేయువాడును ఆయనే; భూమి యొక్క ఉన్నత స్థలము మీద సంచరించు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా అని ఆయనకు పేరు”. యోషయా 45:7-12, 48:13 MHTel 356.2