ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

275/475

మంచి బ్రెడ్ ముక్కలో ఉన్న మతం

[C.T.B.H.49] (1890)C.H.117 CDTel 327.1

494. ఆహారం సరిగా తయారు చెయ్యటం ఓ మత విధి అని కొందరు భావించరు. అందుకే వారు సరిగా వండటం నేర్చుకోటానికి ప్రయత్నించరు. వారు బ్రెడ్నె బేక్ చెయ్యటానికి ముందు పులవనిస్తారు. ఆ పొరపాటుని సరిచెయ్యటానికి కలిపే బేకింగ్ పౌడరు ఆ బ్రెడ్ మానవ జీర్ణకోశానికి అనర్హం చేస్తుంది. మంచి బ్రెడ్ చెయ్యటానికి ఆలోచన శ్రద్ధ అవసరం. అయితే అనేకులు భావించే దానికన్నా ఎక్కువ మతం ఓ బ్రెడ్ ముక్కలో కనిపిస్తుంది. CDTel 327.2

(1868) 1T 684 CDTel 327.3

495. ముతక గోధుమ పిండితో తేలికైన, రుచికరమైన, మంచి బ్రెడ్ తయారుచెయ్యటం నేర్చుకోటం ప్రతీ క్రైస్తవ యువతి, ప్రతీ క్రైస్తవ స్త్రీ మత పరమైన విధి. తమ కుమార్తెలు చిన్న వయసులో ఉన్నప్పుడే తల్లులు వారిని తమతో వంట గదిలోకి తీసుకువెళ్లి వంట కళను నేర్పించాలి. (బ్రెడ్ తయారు చేసే జ్ఞానం అత్యవసరం-822] CDTel 327.4