ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

276/475

బ్రెడ్లో సోడా వినియోగం

(1905) M.H.300,302 CDTel 327.5

496. బ్రెడ్ చెయ్యటంలో సోడా వినియోగం హానికరం. అది అనవసరం కూడా. సోడా కడుపులో మంట పుట్టించి తరచు వ్యవస్థని విషకలితం చేస్తుంది. చాలామంది గృహిణులు సోడా లేకుండా బ్రెడ్ చెయ్యలేమని భావిస్తారు. కాని ఇది తప్పు. వారు మెరుగైన పద్ధతులు నేర్చుకుంటే వారి బ్రెడ్ సహజమైన రుచిగలిగి ఆరోగ్యదాయకంగాను హితంగాను ఉంటుంది. CDTel 327.6

[బ్రెడ్ లో సోడా వినియోగం- “సోడా, బేకింగ్ పౌడరు” చూడండి,565,569] CDTel 327.7