ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు
సమృద్ధిగా లభ్యం
(1905) M.H.297 CDTel 324.10
485. ప్రకృతి సరఫరా చేసే పండ్లు, పప్పులు, గింజలు సమృద్ధిగా లభిస్తాయి. ప్రతీ సంవత్సరం పెరుగుతున్న రవాణా సదుపాయాల వలన అన్నిదేశాల ఉత్పత్తులు అందరికీ సామాన్యంగా పంపిణీ అవుతున్నాయి. ఫలితంగా కొన్ని సంవత్సరాల క్రితం ఖరీదైన, విలాసవంతమైన ఆహారపదార్ధాలుగా పరిగణించబడ్డవి ఇప్పుడు అనుదిన ఆహారపదార్థాలుగా అందరికీ అందుబాటులో ఉన్నాయి. CDTel 324.11
(1905) M.H.299 CDTel 325.1
486. మనం సరిగా ప్రణాలికలు రూపొందించుకుంటే, ఆరోగ్యానికి బహుగా దోహదపడేవి దాదాపు ప్రతీ దేశంలోను లభ్యమౌతాయి. బియ్యం, గోధుమలు, జొన్నలు, యవలు, చిక్కుళ్లు, బటీనీలు, అపరాలతో తయారు చేసిన ఆహారపదార్ధాలు అన్ని చోట్లకూ రవాణా అవుతున్నాయి. ఇవీ, వీటితోపాటు స్థానికంగా దొరికే లేక దిగుమతి అయ్యే పండ్లు, ప్రతీ స్థలంలోను స్థానికంగా పండించే కూరగాయలు, మాంసం లేకుండా సంపూర్ణమైన ఆహారాన్ని తయారుచేసుకోటానికి ఎంపిక చేసుకోటానికి అవకాశం ఇస్తాయి. CDTel 325.2
[గింజలు ప్రకృతి సమృద్ధిగా సమకూర్చే విలాస వస్తువు-503] CDTel 325.3