ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు
భాగం II - గింజలు
సృష్టికర్త ఎంపిక చేసిన ఆహారంలో
(1905) M. H.296 CDTel 323.14
481. మన సృష్టికర్త మనకి ఎంపికచేసిన ఆహారం గింజలు, పండ్లు, పప్పులు, కూరగాయలు. సాధ్యమైనంత సామాన్యంగా, సహజంగా తయాగుచేసిన ఈ ల హారపదార్ధాలు మిక్కిలి ఆరోగ్యవంతమైన, మిక్కిలి బలవర్ధకమైన ఆహారం. అవి ఇచ్చే బలాన్ని, సహనశక్తిని, మానసిక ఉత్సాహాన్ని మరింత క్లిష్టమైన ఉద్రేకం పుట్టించే ఆహారం ఇవ్వలేదు. CDTel 323.15
{సందర్భానికి 111 చూడండి] CDTel 324.1
(1905) M.H.313 CDTel 324.2
482. మాంసాహారులు ఒకసారి తినేసిన గింజల్ని కూరగాయల్ని రెండోసారి తింటున్నారు. ఎందుకంటే పెరుగుదల నిచ్చే పోషకపదార్థాల్ని జంతువులు వీటి నుంచి పొందుతాయి. గింజలు, కూరగాయల్లో ఉన్న జీవం వాటిని తినే ప్రాణికి మార్పిడి అవుతుంది. దాన్ని మనం మాంసం తినటం ద్వారా పొందుతాం. దేవుడు మనకు ఏర్పాటు చేసిన ఆహారం ప్రత్యక్షంగా తినటం ద్వారా దాన్ని పొందటం ఎంత మంచిది! CDTel 324.3
[ప్రజల్ని పండ్లు, కూరగాయలు, గింజల ఆహారానికి తిరిగి తీసుకురావటం -515] CDTel 324.4