అపొస్తలుల కార్యాలు

37/59

36—గలతీయలో మతభ్రష్టత

కొరింథులో ఉన్నకాలంలో అప్పటికే స్థాపితమై ఉన్న సంఘాల గురించి పౌలు ఆందోళన చెందటానికి కారణముంది. యెరూషలేము విశ్వాసుల నడుమ బయలుదేరిన అబద్ధ బోధకుల ప్రభావంవల్ల గలతీయ విశ్వాసుల్లో చీలిక, తప్పుడు సిద్ధాంతాలు, శరీరేచ్ఛలు బలపడ్తున్నాయి. ఈ అబద్ధ బోధకులు సువార్త సత్యాల్ని యూదు సంప్రదాయాల్లో కలగలిపి బోధిస్తున్నారు. యెరూషలేములో జరిగిన సాధారణ సభ తీర్మానాన్ని లెక్క చెయ్యకుండా వారు ఆచార ధర్మశాస్త్రాన్ని ఆచరించాల్సిందిగా క్రైస్తవులైన అన్యజనులకు విజ్ఞప్తి చేస్తున్నారు. AATel 271.1

పరిస్థితి సంక్లిష్టంగా తయారయ్యింది. గలతీయ సంఘాల్లోకి ప్రవేశించిన దురాచారాలు ఆ సంఘాల్ని నాశనంచేసే ప్రమాదం ఏర్పడింది. AATel 271.2

పౌలు హృదయం వేదనతో నిండింది. తాను ఎవరికి సువార్త సూత్రాల్ని నేర్పించాడో ఆ ప్రజలు భ్రష్టులవ్వటం గురించి అతడు క్షోభించాడు. మోసపోతున్న ఆ విశ్వాసులికి వెంటనే ఒక ఉత్తరం రాశాడు. అందులో వారు అంగీకరించిన తప్పుడు సిద్ధాంతాల డొల్లతనాన్ని ఎండగట్టాడు. విశ్వాసాన్ని విడిచి పెట్టి దూరంగా వెళ్ళిపోతున్నవారిని మందలించాడు. “తండ్రియైన దేవుని నుండియు మన ప్రభువైన యేసుక్రీస్తునుండియు మీకు కృపయు సమాధానమును కలుగునుగాక” అన్న ఆశీర్వచనాల అనంతరం గలతీయులికి ఈ తీవ్రమందలింపు అందించాడు. AATel 271.3

క్రీస్తు కృపనుబట్టి మిమ్మును పిలిచినవానిని విడిచి, భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకాశ్చర్యమగుచున్నది. అది మరియొక సువార్త కాదుగాని, క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువారగాక మరియొక సువార్తను మేమైనను పరలోకమునుండి వచ్చిన యొకదూతయైనను మీకు ప్రకటించిన యెడల వాడు శాపగ్రస్తుడవునుగాక.” పౌలు బోధనలు లేఖనాలకు అనుగుణంగా ఉన్నాయి. అతని సేవలో పరిశుద్ధాత్మ సహకరిస్తూ సాక్షిగా ఉన్నాడు. అందునుబట్టి తాను బోధించిన సత్యాలకు విరుద్ధమైన బోధను వినవద్దని పౌలు సహోదరుల్ని హెచ్చరించాడు. AATel 271.4

క్రైస్తవ జీవనంలో తమ ప్రథమ అనుభూతిని జాగ్రత్తగా పరిగణించాల్సిందిగా గలతీ విశ్వాసుల్ని పౌలు కోరాడు. “ఓ అవివేకులైన గలతీయులారా, అని సంభోదిస్తూ పౌలిలా అంటున్నాడు, “మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? సిలువవేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల యెదుట ప్రదర్శించబడెనుగదా! ఇది మాత్రమే మీ వలన తెలిసికొనగోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధ క్రియలవలన ఆత్మను పొందితిరా లేక విశ్వాసముతో వినుటవలన పొందితిరా? మీరింత అవివేకులైతిరా? మొదట ఆత్మానుసారముగా ఆరంభించి, యిప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా? వ్యర్థముగానే యిన్ని కష్టములు అనుభవించితిరా? అది నిజముగా వ్యర్థమగునా? ఆత్మను మీకు అనుగ్రహించి, మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియలవలననా లేక విశ్వాసముతో వినుటవలననా చేయించుచున్నాడు.” AATel 272.1

- గలతీయలోని విశ్వాసుల్ని తమ సొంత మనస్సాక్షి న్యాయస్థానంలో నిందించి వారి తప్పుడు కార్యాల్ని ఆపుచెయ్యటానికి పౌలు ఇలా ప్రయత్నించాడు. రక్షించేందుకు దేవునికున్న శక్తి పై ఆధారపడూ, భ్రష్టబోధకుల బోధనల్ని తిరస్కరించాలని ఉద్బోధించాడు. తాము గొప్ప వంచనకు గురి అయ్యారని అయినా సువార్తపై తమ ముందటి విశ్వాసాన్ని కలిగి ఉండటం ద్వారా తాము సాతాను ప్రయత్నాల్ని వమ్ము చేయవచ్చునని గ్రహించటానికి వారిని నడిపించేందుకు ప్రయత్నించాడు. పౌలు సత్యాన్ని నీతిని బలంగా సమర్థించాడు. తాను బోధిస్తున్న వర్తమానం పై తనకున్న ప్రగాఢ విశ్వాసం, విశ్వాసాన్ని కోల్పోయిన అనేకమంది తిరిగి క్రీస్తును చేరి ఆయనకు నమ్మకంగా నిలవటానికి దోహదపడింది. AATel 272.2

కొరింథు సంఘానికి పౌలు రాసిన తీరుకీ గలతీయుల్తో అతడు వ్యవహరించిన తీరుకీ మధ్య ఎంత వ్యత్యాసముంది! కొరింథీయుల్ని జాగ్రత్తగా, సున్నితంగా మందలించాడు. కాని గలతీయుల్ని నిష్కరగా గద్దించాడు. కొరింథీయులు శోధనకు లొంగిపడిపోయారు. యుక్తిగా తప్పును సత్వంగా కనిపించేటట్లు తమకు సమర్పించిన బోధకులచేవారు వంచితులయ్యారు. తికమకపడి దిమ్మెరపోయారు. సత్యమేదో అసత్యమేదో గుర్తించటానికి వారిని చైతన్యపర్చటంలో ఆచితూచి అడుగులు వెయ్యటం, సహనం పాటించటం అవసరం. పౌలు కఠినంగా, దుందుడుకుగా వ్యవహరించి ఉంటే, తాను ఎవరికి చేయూతనివ్వాలని వెంపర్లాడాడో వారిలో ఎక్కువమంది పై అతడి ప్రభావాన్ని అది నాశనం చేసి ఉండేది. AATel 272.3

గలతీ సంఘాల్లో సువార్తకు బదులు అసత్యం బాహాటంగా దాపరికం లేకుండా ప్రచారం అయ్యింది. అర్థంపర్థంలేని యూదుమతాచారాలికి ఆకర్షితులై ఆ ప్రజలు విశ్వాసానికి పునాది అయిన క్రీస్తును విడిచి పెట్టారు. తమను నాశనం చేయనున్న దుష్ప్రభావాలనుంచి గలతీయ విశ్వాసుల్ని కాపాడటానికి నిర్ణయాత్మికమైన చర్య తీసుకోటం, తీవ్ర హెచ్చరిక చెయ్యటం అవసరమని అపొస్తలుడు గుర్తించాడు. AATel 272.4

క్రీస్తు సేవ చేస్తున్న ప్రతీ సువార్తికుడు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే తాను ఎవరి రక్షణ కోసం పాటుపడున్నాడో వారి పరిస్థితులకు అనుగుణంగా తన పరిచర్య పద్ధతుల్ని మార్చుకోటం. కనికరం, సహనం, నిశ్చయత, నిర్ణయాత్మకత అవసరం. ఆయా పరిస్థితుల్లో వేర్వేరు మనస్తత్వాలుగల వ్యక్తులతో వ్యవహరించటానికి దేవుని ఆత్మ నడుపుదల కింద లభించే వివేకం ఆలోచన అవసరం. AATel 273.1

గలతీయ విశ్వాసులికి రాసిన ఉత్తరంలో తాను క్రైస్తవమతం స్వీకరించటం గురించి, తన ఆరంభ క్రైస్తవానుభవం గురించిన ప్రధాన ఘటనల్ని పౌలు సంక్షిప్తంగా రాశాడు. ప్రత్యేకమైన దైవశక్తి ప్రదర్శన ద్వారానే తాను సువార్తమహత్తర సత్యాల్ని గ్రహించగలగటం జరిగిందని పౌలు స్పష్టీకరించాడు. దేవుని వద్దనుంచి వచ్చిన ఉపదేశాన్ని పురస్కరించుకునే గలతీయుల్ని అంత గంభీరంగా అంత నిశ్చయాత్మకంగా హెచ్చరించగలిగాడు. అతడు వెనకాడుతూ, సందేహిస్తూ రాయలేదు. దృఢవిశ్వాసంతో, పొరపాటులేని జ్ఞానంతో రాశాడు. మానవుడి వద్దనుంచి ఉపదేశం పొందటానికీ, నేరుగా దేవుని వద్దనుంచే ఉపదేశం పొందటానికీ మధ్యగల తేడాను వారికి వివరించాడు. AATel 273.2

తమను తప్పుదారి పట్టించిన అబద్ధ బోధ కుల్ని విడిచి పెట్టి, దేవుని ఆమోదముద్రకు తిరుగులేని నిదర్శనాలున్న తమ పూర్వ విశ్వాసాన్ని తిరిగి చేపట్టాల్సిందిగా గలతీయులికి అపొస్తలుడు విజ్ఞప్తి చేశాడు. సువార్త విషయంలో నమ్మకాన్ని పాడుచెయ్యటానికి ప్రయత్నించిన వ్యక్తులు మోసగాళ్ళు. వారివి కల్మషంతో నిండిన హృదయాలు. వారి జీవితం దుర్నీతిమయం. వారి మతం అద్దంపర్థంలేని ఆచారాల సమాహారం. వాటి ద్వారా దేవుని అనుగ్రహాన్ని పొందుతామన్నది వారి ఆశాభావం. “ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడు” (యోహాను 3:3) అన్న సువార్తకు వారు లోబడలేదు. అట్టి సిద్ధాంతంమీద ఆధారితమైన మతం కోరే త్యాగం తాము చేయలేమని తీర్మానించుకుని వారు తమ పొరపాట్లను గట్టిగా పట్టుకొని ఉండి ఆత్మ వంచన చేసుకోటమే కాదు ఇతరుల్ని కూడా మోసగించారు. AATel 273.3

బాహ్యాచారాలతో కూడిన మతాన్ని హృదయ పరిశుద్ధతకు నీతిజీవితానికి ప్రత్యామ్నాయంగా ఎంచటం యూదుమత గురువుల దినాల్లో లాగే నేడుకూడా పరివర్తన పొందని స్వభావంగల వ్యక్తులికి నేడుకూడా ఎంతో ఆనందాన్నిస్తుంది. అప్పటిలోలాగే ఇప్పుడుకూడా కపట ఆధ్యాత్మిక మార్గదర్శకులున్నారు. అనేకమంది వారి సిద్ధాంతాల్ని శ్రద్ధగా నేర్చుకుంటున్నారు. క్రీస్తు పై విశ్వాసము ద్వారా రక్షణ కలుగుతుందన్న నిరీక్షణ నుంచి మనుష్యుల మనసుల్ని మళ్ళించటం సాతాను ధ్యేయం. తాను మోసగించటానికి ప్రయత్నించే మనుషుల పూర్వాభిప్రాయాలకు అభిరుచులకు అనుగుణంగా తన శోధనల్ని మల్చుకోటానికి సాతాను ప్రతీ యుగంలోను కృషిచేస్తూ వచ్చాడు. అపొస్తలుల యుగంలో ఆచార ధర్మశాస్త్రాన్ని ఘనపర్చి క్రీస్తును విసర్జించటానికి యూదుల్ని నడిపించాడు. ప్రస్తుత కాలంలో క్రైస్తవులమని చెప్పుకునే అనేకులు క్రీస్తును ఘనపర్చుతున్నామంటూ నీతి ధర్మశాస్త్రాన్ని కించపర్చి అందులోని సూత్రాల్ని అతిక్రమించవచ్చని ప్రబోధిస్తున్నారు. విశ్వాసాన్ని వక్రీకరించే ఈ వక్రమారుల్ని ప్రతిఘటించటం వాక్యాన్ని ఆధారంచేసుకుని వారి దోషాన్ని నిర్భయంగా ఎండగట్టటం ప్రతీ దైవ సేవకుడి విహిత కర్తవ్యం. AATel 273.4

గలతీయలోని తన సహోదరుల విశ్వాసాన్ని తిరిగి సంపాదించే ప్రయత్నంలో తాను క్రీస్తుకి అపొస్తలుడనన్న విషయాన్ని అతి సమర్థంగా ధ్రువపర్చుకున్నాడు. “మనుష్యుల మూలముగానైనను, ఏ మనుష్యునివలననైననుకాక, యేసుక్రీస్తువలనను, ఆయనను మృతులలోనుండి లేపిన తండ్రియైన దేవునివలనను అపొస్తలుడుగా” తన్నుతాను ప్రకటించుకున్నాడు పౌలు. తన ఆదేశాన్ని మానవులవలన కాదు పరలోకమందున్న సర్వంసహాధికారివలన పాలు పొందాడు. అతడి హోదాను యెరూషలేము సభ గుర్తించింది. అన్యజనుల మధ్య తన సేవ అంతటిలోను పౌలు యెరూషలేము సభ తీర్మానాన్ని అనుసరించి వ్యవహరించాడు. AATel 274.1

“మిక్కిలి శ్రేష్ఠులైన యీ అపొస్తలులకంటె లేశమాత్రమును తక్కువ వాడను” (2కొరిం 11:5) కాననటానికి పౌలు రుజువు ఇవ్వటం తన్నుతాను ఘనపర్చుకోటానికి కాదు, కాని దేవుని కృపను విపుల పర్చటానికే. తన పిలుపును పరిచర్యను కించపర్చటా నికి కని పెట్టుకుని ఉన్నవారే తన ద్వారా ప్రదర్శితమౌతున్న క్రీస్తుకు వ్యతిరేకంగా పోరాటం సల్పుతున్నారు. ప్రత్యర్థుల వ్యతిరేక కారణంగా పౌలు తన హోదాను అధికారాన్ని నిరూపించుకోటానికి నిశ్చితంగా వ్యవహరించక తప్పింది కాదు. AATel 274.2

ఒకప్పుడు తమ జీవితాల్లో క్రీస్తు శక్తిని ఎరిగినవారు తను మొదటి ప్రేమ అయిన సువార్త సత్యానికి తిరిగి రావాల్సిందిగా పౌలు విజ్ఞాపన చేశాడు. క్రీస్తులో స్వేచ్ఛగల స్త్రీ పురుషులుగా తమ ఆధిక్యతను తిరుగులేని వాదనలో పౌలు వారిముందుంచాడు. తన ప్రాయశ్చిత్తార్థ కృపకు తమ్మును తాము పూర్తిగా సమర్పించుకునే వారికి క్రీస్తు తన నీతి వస్త్రాన్ని ధరింపజేస్తాడు. రక్షణ పొందే ప్రతీ ఆత్మకూ దైవ విషయాల్లో నిజమైన వ్యక్తిగతమైన అనుభవం ఉండాలని ఆయన నిర్దేశించాడు. AATel 274.3

అపొస్తలుడి విజ్ఞాపన నిరర్థకం కాలేదు. పరిశుద్ధాత్మ శక్తిమంతంగా పనిచే చేశాడు. అవిధేయ మార్గాల్లో సంచరిస్తున్న అనేకులు సువార్త విశ్వాసానికి మరలి వచ్చారు. తమకు క్రీస్తు ప్రసాదించిన స్వేచ్చలో ఆనాటినుంచి స్థిరంగా నిలిచారు. వారి జీవితాల్లో ” ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘా శాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము” అన్న ఆత్మఫలాలు కనిపించాయి. దేవునికి మహిమకలిగింది. ఆ ప్రాంతంలో అనేకులు విశ్వాసులై సంఘంలో చేరారు. AATel 274.4