క్రైస్తవ పరిచర్య

65/278

పాఠశాలకు సెలవులు వచ్చినప్పుడు

పాఠశాలకు సెలవులు వచ్చినప్పుడు అనేకమంది విద్యార్థులు సౌవార్తిక గ్రంథ విక్రయ సేవకులుగా పట్టణాలు నగరాల్లో పని చెయ్యటానికి అవకాశం లభిస్తుంది. నమ్మకమైన గ్రంథ విక్రయ సేవకుడికి అనేక గృహాల్లోకి ప్రవేశం లభిస్తుంది. ఆ గృహాల్లో అతడు ఈ కాలానికి దేవుడు ఏర్పాటు చేసిన సత్యంతో నిండిన సాహిత్యాన్ని విడిచి పెట్టవచ్చు. మన విద్యార్థులు మన పుస్తకాల్ని ఎలా అమ్మాలో నేర్చుకోవాలి. దైవ సేవలోని ఈ శాఖలో పని చెయ్యటానికి లోతైన క్రైస్తవానుభవంగల మనుషులు, మానసిక సమతౌల్యం గల మనుషులు, బలమైన, బాగా చదువుకున్న మనుషులు అవసరం. ఇప్పుడు జరుగుతున్న పనికన్నా ఎంతో ఎక్కువ సాధించటానికి యువతను గ్రంథవిక్రయ సేవకులుగా తర్బీతు చెయ్యటానికి వారిని మసర్థుల్ని చేసే ప్రతిభాపాటవాలు విద్య అనుభవం ఉన్న వ్యక్తులు కొందరున్నారు. ఈ అనుభవం గలవారు ఇతరులకు నేర్పించటమన్న ప్రత్యేక బాధ్యతను నిర్వహించాలి. కౌన్సేల్స్ టు పేరెంట్స్, టీచర్స్, అండ్ స్టూడెంట్స్, పులు. 546, 547. ChSTel 73.2