క్రైస్తవ పరిచర్య

66/278

గాన పరిచర్య

సువార్త కీర్తనలు మధురంగా స్పష్టంగా పాడటం నేర్చుకున్న విద్యార్థులు గాయక సువార్త సేవకులుగా మంచిసేవ చెయ్యవచ్చు. దుఃఖం బాధవల్ల సంతోష సూర్యకాంతిలేని చీకటి స్థలాల్లో ఏకాంతంగా ఎక్కువ సంఘ సహవాసావకాశాలు లేకుండా నివసించే అభాగ్యులలో వీరు తమకు దేవుడిచ్చిన గాన వరాన్ని ఉపయోగిస్తూ తమ గాన మాధుర్యంతో సంతోశానందాలు నింపటానికి అనేక తరుణాలు అందిపుచ్చుకోవచ్చు. ChSTel 73.3

విద్యార్థుల్లారా, రాజమార్గాల్లోకి కంచెల్లోకి వెళ్లండి. గొప్పవారిని పేదవారిని చేరటానికి కృషిచెయ్యండి. ధనికులు దరిద్రుల గృహాల్లోకి వెళ్లండి. అవకాశం దొరకుబుచ్చుకుని, “మేము కొన్ని సువార్త కీర్తనలు పాడటం మీకు ఇష్టమా?” అని అడగండి. అనంతరం, హృదయాలు మెత్తబడేకొద్దీ, దేవుని దీవెనల్ని కోరుతూ ప్రార్థన చెయ్యటానికి మార్గం ఏర్పడవచ్చు. వినటానికి నిరాకరించేవారు ఎక్కువమంది ఉండరు. అలాంటి పరిచర్య నిజమైన మిషనెరీ సేవ. కౌన్సేల్స్ టు పేరెంట్స్, టీచర్స్, అండ్ స్టూడెంట్స్, పులు. 547, 548. ChSTel 74.1