క్రైస్తవ పరిచర్య

42/278

అధ్యాయం-4
క్రైస్తవ సేవకుడు ఎదుర్కొనే ప్రపంచ పరిస్థితులు

లోక నాటకం

లోకం ఓ నాటక రంగం. లోకనివాసులు పాత్రధారులు. చివరి గొప్ప నాటకంలో తమ పాత్ర పోషించటానికి సిద్ధపడుతున్నారు. తమ దుష్ట సంకల్పాల నెరవేర్సుకు జనులు కూటమిగా ఏర్పడితే తప్ప జనసామాన్యం మధ్య ఐక్యతలేదు. దేవుడు చూస్తున్నాడు. అవిధేయులైన తన ప్రజల నిమిత్తం ఆయన ఉద్దేశాలు నెరవేరాయి. గందరగోళం, అవ్యవస్థ కొంతకాలం కొనసాగటానికి ఆయన అనుమతించినప్పటికీ, ఈ లోకాన్ని మానవుల చేతుల్లోకి ఇవ్వటం జరగదు. పాతాళం నుంచి వచ్చే ఓ శక్తి ఈ నాటకంలోని చివరి సన్నివేశాలకు రంగం సిద్దం చేస్తుంది. అవేంటంటే సాతాను క్రీస్తులా రావటం, రహస్య సమాజాల్లో పరస్పర సన్నిహిత సంబంధాలు కలిగి ఉండే వారిలో దుర్నీతిని పుట్టించే సమస్త మోసంతో పనిచెయ్యటం. కూటమి సంబంధంగా భావోద్వేగాలకు లొంగేవారు అపవాది ప్రణాళికల్ని అమలుపర్చుతున్నారు. కార్యం వెనుక కారణం ఉంటుంది. టెస్టిమొనీస్, సం.8, పు. 27, 28. ChSTel 53.1