క్రైస్తవ పరిచర్య

43/278

నాటకంలో చరమాంకం

ఈ వర్తమానం ఈ కాలానికి వర్తించినంత శక్తిమంతంగా మరేకాలానికీ వర్తించలేదు. లోకం అధికారికంగా దేవుని కట్టడల్ని కాలరాస్తున్నది. మనుషులు అతిక్రమాల్ని ధైర్యంగా చేస్తున్నారు. లోకనివాసుల దుర్మార్గం వారి దుర్నీతి పాత్రను దాదాపుగా నింపింది. తన నాశన కార్యాన్ని నెరవేర్చటానికి నాశన దూతకు దేవుడు సెలవిచ్చే స్థితికి లోకం దాదాపు చేరుకున్నది. దైవ దర్మశాస్త్రానికి మారుగా మానవ చట్టాల్ని అమలు పర్చటం, బైబిలు సబ్బాతు స్తానంలో - కేవలం మానవాధికారంతో - ఆదివారాన్ని ఘనపర్చటం ఈ నాటకంలో చివరి అంకం. ఈ ప్రత్యామ్నాయం లోకవ్యాప్తమైనప్పుడు దేవుడు తన్నుతాను వెల్లడి చేసుకుంటాడు. లోకాన్ని కంపింపచెయ్యటానికి ఆయన గొప్ప ఠీవితో వస్తాడు. ఈ లోకాన్ని నివాసుల్ని తమ పాపాలు అపరాధాల నిమిత్తం శిక్షించటానికి ఆయన తన స్థలం నుంచి బయలుదేరి వస్తాడు. భూమి తాను తాగిన రక్తాన్ని బయలుపర్చుతుంది. హతుల్ని ఇక ఎంత మాత్రం కప్పదు. టెస్టిమొనీస్, సం.7, పు. 141. ChSTel 53.2