క్రైస్తవ పరిచర్య

41/278

ఎదుర్కోవలసిన పరీక్ష

అంతిమ గంభీర సేవలో గొప్ప వ్యక్తులు పాలుపొందరు. వారు స్వయం సమృద్దులు, దేవుని సహాయం అవసంర లేదనుకునే వారు. దేవుడు వారిని ఉపయోగించలేడు. ప్రభువుకి నమ్మకమైన సేవకులున్నారు. భయాందోళనల కాలంలో పరీక్షా సమయంలో వారు బయలుపడ్డారు. విలువైన మనుషులు ఇప్పుడు అజ్ఞాతంలో ఉన్నారు. వారు బయలుకి మోకాలు వంచనివారు. మా మిద ప్రకాశిస్తున్న ప్రచండమైన వెలుగు వారికి లేదు. బహుశా కరకైన, ఆకర్షణీయతలేని ఓ బాహ్యరూపంలో యధార్థ క్రైస్తవ ప్రవర్తన ప్రకాశత ప్రదర్శితం కావచ్చు. పగలు ఆకాశంలోకి చూస్తాం. కాని నక్షత్రాలు కనిపించవు. అవి అక్కడే ఉంటాయి. అంతరిక్షంలో స్థిరంగా ఉంటాయి. కాని కన్ను వాటిని పోల్చుకోలేదు. రాత్రిలో వాటి శుద్ధమై ప్రకాశం చూస్తాం. ChSTel 51.3

ప్రతీ ఆత్మకు పరీక్ష వచ్చే సమయం ఎక్కువ దూరంలో లేదు.... ఈ సమయంలో సంఘంలోని బంగారం మాలిన్యం నుంచి వేరు చెయ్యబడ్తుంది. నిజమైన దైవభక్తికి భక్తిలా కనిపించే పై మెరుగుకి మధ్య భేదం స్పష్టంగా కనిపిస్తుంది. తమ ప్రతిభా ప్రకాశానికి మనం అభినందించి అభిమానించే అనేక నక్షత్రాలు అప్పుడు చీకటిలో మటుమాయమౌతాయి. గాలి శ్రేష్టమైన గోధుమ కళ్లాల నుంచి మేఘాల్ని తీసుకుపోయినట్లు పొట్టును తీసుకుపోతుంది. క్రీస్తు నీతివస్త్రాన్ని ధరించనివారు ఆలయ ఆభరణాలతో అలంకరించుకుని తమ సొంత దిగంబరత్వాన్ని కనపర్చు కుంటారు. టెస్టిమొనీస్, సం.5, పు. 80, 81. ChSTel 52.1