క్రైస్తవ పరిచర్య

15/278

ఎంపికైనప్పుడు తిమోతి కేవలం నవ యువకుడే

తిమోతి నమ్మకంగా, స్థిరంగా, యధార్థంగా నివసించటం పౌలు గమనించాడు. కనుక సేవలోను ప్రయాణంలోను తనకు తోడుగా ఉండటానికి పౌలు అతణ్ని ఎంపిక చేసుకున్నాడు. తన బాల్యంలో తిమోతికి విద్యనేర్పినవారు తమ విద్యార్థి ఆ గొప్ప అపొస్తలుడికి సన్నిహిత సహచరుడుగా ఉండటం చూసి తమ సేవకు ప్రతిఫలం పొందామని సంతోషించారు. తనను బోధకుడుగా దేవుడు ఎంపిక చేసుకున్నప్పుడు తిమోతి కేవలం యువకుడే. అయితే తన తొలినాళ్ల విద్య అతడికందించిన నియమాలు పౌలుకి సహాయకుడుగా తన స్థానాన్ని ఆక్రమించటానికి సమర్థుడుగా అతణ్ని తీర్చిదిద్దాయి. వయసులో చిన్నవాడైనప్పటికీ తిమోతి తన బాధ్యతల్ని సాత్వికంతో నిర్వహించాడు. ది ఏక్ట్స్ ఆఫ్ ది అపాజల్స్, పులు 203, 204. ChSTel 30.2