క్రైస్తవ పరిచర్య

16/278

వారి ఖాళీల భర్తీకి నిల్వలు

మన మధ్య బాధ్యతలు వహించేవారు మరణిస్తున్నారు. ఓజనంగా మనం రూపొందించుకున్న సంస్కరణల అమలులో ముందున్న వారిలో అనేకులు ఇప్పుడు నడివయసు దాటినవారు. వారి శారీరక మానసిక వక్తులు క్షీణిస్తున్నాయి. వారి ఖాళీలని ఎవరు నింపుతారు? ఉద్యమ ప్రస్తుత నాయకులు నేలకు ఒరిగినప్పుడు సంఘం తాలూకు ప్రధానాసక్తులు ఎవరికి అప్పగించాలి? అని తీవ్ర ఆందోళనతో ప్రశ్నించవచ్చు. ఈ భారాల్ని మోయాల్సివారిగా, బాధ్యతలు వహించాల్సినవారిగా నేటి యువత వంక మనం ఆతురతతో చూడక తప్పదు. ఇతరులు ఎక్కడ విడిచి పెడతారో అక్కడే వీరు బాధ్యతలు చేపట్టాలి. నైతికత, మతవైరాగ్యం, దైవభక్తి ప్రబలుతాయో లేక అనైతికత, అపనమ్మకం వల్ల విలువైనదంతా భ్రష్టమై భగ్నమౌతుందో వారి మార్గాలు విధానలే నిర్ణయిస్తాయి. గాసిపుల్ వర్కర్స్, పు. 68. ChSTel 30.3