క్రైస్తవ పరిచర్య

210/278

కుటుంబ బలిపీఠం ప్రాముఖ్యం

క్రీస్తుని ప్రేమిస్తున్నట్లు చెప్పేమీరు మీరెక్కడికి వెళ్తే అక్కడికి మాతో క్రీస్తుని తీసుకువెళ్లండి. పూర్వం పితరుల వలే మీ గుడారాలు ఎక్కడ వేసుకుంటే అక్కడ ప్రభువుకి ఓ బలిపీఠం నిర్మించండి. ఈ విషయంలో లోతైన విశాలమైన దిద్దుబాటు అవసరం. టెస్టిమొనీస్, సం. 5, పులు. 320, 321. ChSTel 244.1

ప్రజల్ని దేవుని నుంచి దూరంగా నడిపించటానికి సాతాను ప్రతీ ప్రయత్నం చేస్తాడు. మత జీవితం వ్యాపార విషయాలు చింతల్లో మునిగిపోయినప్పుడు, అతడు తమ మనసుల్ని ఎంతో ఆకట్టుకోటం వల్ల వారు బైబిలు చవటం, రహస్య ప్రార్ధనలో సమయం గడపటం, దహన బలిపీఠం మీద ఉదయం సాయంత్రం స్తుతి వందనార్పణల్ని మండుతూ ఉంచటం చెయ్యనప్పుడు అతడు తన కార్యసాధనలో జయం పొందుతాడు. టెస్టిమొనీస్, సం. 5, పు. 426. ChSTel 244.2

కుటుంబ ఆరాధన ఆనందదాయకంగా ఆశాజనకంగా ఉండాలి. టెస్టిమొనీస్, సం. 5, పు. 335. ChSTel 244.3

వారికి (పిల్లలికి) ప్రార్ధన సమయాన్ని భక్తిభావంతో పరిగణించటం నేర్పించాలి. కుటుంబ ఆరాధనకు హాజరు కావటానికే వారు ఉదయాన లేచేటట్టు చూడాలి. టెస్టిమొనీస్, సం. 5, పు. 424. ChSTel 244.4

మతాన్ని పిల్లలకి ఆకర్షణీయం చెయ్యాలి. నిరోధించేటట్లు కాదు. కుటుంబారాధన సమయాన్ని రోజంతటిలోను అత్యానందదాయక సమయం చెయ్యాలి. లేఖన పఠనాన్ని జాగ్రత్తగా ఎంపిక చెయ్యాలి. అది సామాన్యంగా ఉండాలి. పిల్లల్ని మీతో కలిసి పాటలు పాడనివ్వండి. ప్రార్ధనలు తిన్నగా విషయానికి వచ్చి కురచగా ఉండాలి. సదర్న్ వాచ్ మేన్, జూన్ 13, 1905. కుటుంబ భోజన బల్లవద్దకు, కుటుంబ ఆరాధనకు అతిథుల్ని స్వాగతించండి. ఆతిథ్యం పొందుతున్న వారిపై ప్రార్ధన సమయం దాని ప్రభావాన్ని చూపిస్తుంది. ఒక్క సందర్శన సయితం ఒక ఆత్మను నిత్యమరణం నుంచి రక్షించవచ్చు. ప్రభువు దీనికి లెక్కచూస్తాడు. “నేనే ప్రతిఫలమిత్తును” అని ఆయన అంటున్నాడు. టెస్టిమొనీస్, సం. 6, పు. 347. ChSTel 244.5

ప్రార్ధన సమయంలో గౌరవంగా భక్తిగా మెలగటం పిల్లలకి నేర్పించాలి. పనికి వెళ్లటానికి ఇల్లు విడిచి పెట్టకముందు తండ్రి, తండ్రి లేప్పుడు తల్లి, కుటుంబమంతటిని పిలిచి, దినమంతా వారిని కాచి కాపాడమంటూ మనః పూర్వకంగా ప్రార్థించాలి. వినయంగా, ప్రేమతో నిండిన హృదయంతో మీ ముందు, మీ బిడ్డల ముందు ఉన్న శోధనలు ప్రమాదాల స్పృహతో, ప్రభువు ముందుకి వచ్చి, విశ్వాసమూలంగా వారి హృదయాల్ని ప్రార్ధనలో ఏకం చేసి ప్రభువు కాపుదల కోసం విజ్ఞాపన చెయ్యాలి. ఈ రీతిగా దేవునికి ప్రతిష్టించబడే పిల్లల్ని పరిచర్య చేసే దూతలు కాపాడారు. ఉదయం సాయంత్రం ప్రార్ధన ద్వారా పట్టుదలతో కూడిన విశ్వాసం ద్వారా తమ బిడ్డల చుట్టూ కంచె వెయ్యటం క్రైస్తవ తల్లిదండ్రుల విధి. దేవుడు సంతోషించే రీతిగా ఎలా నివసించాలో తల్లిదండ్రులు తమ బిడ్డలకి ఉపదేశించాలి; దయగా, నిర్విరామంగా బోధించాలి. టెస్టిమొనీస్, సం. 1, పులు. 397-398. ChSTel 245.1

దేవుని “స్నేహితుడైన అబ్రాహాము” మనకు ప్రశస్తమైన ఆదర్శం. అతడిది ప్రార్థన జీవితం. తన డేరాని ఎక్కడ వేస్తే అతడు దాని పక్క ఓ బలిపీఠం కట్టి తన శిబిరంలో ఉన్నవారందరినీ ఉదయ సాయంత్రాలు బలి అర్పణలకు పిలిచాడు. అతడు తన డేరాను తీసివేసినప్పుడు బలిపీఠం మిగిలి ఉండేది. ఆ తర్వాతి సంవత్సరాల్లో సంచరించే కనానీయుల్లో కొందరు అబ్రాహాము ఉపదేశాన్ని స్వీకరించారు. వీరిలో ఒకడు ఆ బలిపీఠం వద్ద కు వచ్చినప్పుడల్లా, తనముందు అక్కడికి ఎవరు వచ్చారో గ్రహించేవాడు. అక్కడ తన డేరా వేసుకున్నప్పుడు, ఆ బలిపీఠాన్ని బాగుచేసి జీవంగల దేవుణ్ని ఆరాధించేవాడు. పేట్రియర్క్స్ అండ్ ప్రోఫెట్స్, పు. 128. ChSTel 245.2