క్రైస్తవ పరిచర్య

211/278

అధ్యాయం 22
ప్రార్ధన,మిషనెరీసమావేశం

సఫల ప్రార్ధన రహస్యం

మానవ ప్రతినిధుల అపనమ్మకాన్నిబట్టి లేదా నమ్మకాన్నిబట్టి దేవుని రాజ్య నిర్మాణ కృషి ఆటంకాల్ని ఎదుర్కోటమో లేదా పురోగమించటమో జరుగుతుంది. మానవుడు దేవునితో సహరించటంలో విఫలమైనప్పుడు పనికి ఆటంకం కలుగుతుంది. “నీ రాజ్యము వచ్చుగాక; నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక” అని మనుషులు ప్రార్ధించవచ్చు. కాని వారు ఆ ప్రార్ధనని తమ జీవితంలో ఆచరించకపోతే వారి మనవులు నిష్పలమవుతాయి. సైన్స్ ఆఫ్ ది టైమ్స్, జూన్ 22, 1903. ChSTel 246.1