స్వస్థత పరిచర్య
ప్రభువు సంతోషం
సురక్షితంగా ఉన్నవి తొంభై తొమ్మిది
దొడ్డి నీడలో కాపుదలలో
కాని ఒకటి దూరాన కొండల్లోకి తప్పిపోయింది
మంద బంగరు తలుపుకి దూరంగా
నీడలేని దూరపు కొండలపై
ఉంది కాపరి పోషణ అనురాగం లేకుండ
“ప్రభువా, నీకు తొంబయి తొమ్మిది ఉన్నవిగదా
మిగిలి: అవి నీకు చాలవా?’
“నా మందలో ఒకటి నన్ను విడిచింది తప్పి పోయింది
దారి కఠినంగా కష్టతరంగా భారంగా ఉన్నా
నా గొర్రెను వెదకుతూ వెళ్తాను అడవికి” అన్నాడు కాపరి.
కాని రక్షణ పొందినవి ఎరుగవు కాపరి
దాటిన నీళ్లలోతులు, ప్రభువు గడిపిన చీకటి రాత్రులు
తప్పిపోయిన తన గొర్రెను కనుగొనక ముందు:
ఎడారిలో ఎక్కడో విన్నాదో దాని అరుపు
పీలగా, నిస్సహాయంగా, చనిపోడానికి సిద్ధంగా ఉన్నట్లుగా
“ప్రభువా, ఎక్కడివి ఈ రక్తపు చుక్కలు
కొండలపై నీ మార్గమంతా స్పష్టంగా చూపిస్తున్నది?”
“తప్పిపోయిన ఒక్క ఆత్మకై అది కాపరి కార్చిన రక్తం
దాన్ని తిరిగి తేక ముందు”
“ప్రభువా, నీ చేతులకు గాయాలు ఎందుకయ్యాయి?”
” ఈ రాత్రి అనేక ముళ్లు గుచ్చటం వల్ల జరిగింది”
కాని పర్వతాలు ఉరుముల శబ్దంతో ధ్వనించినా
ఎత్తయిన లోతైన ఆ బండల్లో నుంచి
ఓ కేక లేచింది, పరం గుమ్మాల వరకు వినిపించింది
“రా గొర్రె దొరికింది ఉత్సహించండి” అంటూ
దూతలు పాడారు సింహాసనం చుటు ఉంది.
MHTel 449.1
-ఎలిజిబెత్ క్లైఫనీ
రక్షించబడ్డ జాతులు పరలోక చట్టం తప్ప వేరే చట్టాన్ని ఎరుగరు. అందరూ స్తుతి కృతజ్ఞతార్పణ వస్తాలు అనగా క్రీస్తు నీతి వస్త్రం ధరించి ఒకే కుటుంబంగా ఆనందిస్తారు. ప్రకృతి దాని సౌందర్యమంతటితో దేవున్ని స్తుతించి ఆరాధిస్తుంది. లోకం ఆకాశం నుంచి వచ్చే వెలుగుతో వెలిగిపోతుంది. చంద్రుడి కాంతి సూర్యకాంతిలా ఉంటుంది. సూర్యుని కాంతి ఇప్పటికన్నా ఏడు రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఏళ్ళు ఆనందంగా గడిచిపోతాయి. ఆ దృశ్యం గురించి ఉదయ నక్షత్రాలు ఏకంగా కూడి పాడతాయి, దేవదూతలు ఆనంద ధ్వనులు చేస్తారు. దేవుడు క్రీస్తు కలిసి” పాపం ఇక ఉండదు. మరణం ఇక ఉండదు.” అని ప్రకటిస్తారు MHTel 450.1
భవిష్యత్తు మహిమను గూర్చి దేవుని హస్తం చిత్రించిన ఈ దృశ్యాలు ఆయన బిడ్డలకు ప్రియమైనవి కావాలి. MHTel 450.2
నిత్యకాల ద్వారంలో నిలబడి, ఈ జీవితంలో ఆయన నిమిత్త బాధలను భవించటం ఏ ప్రత్యేక గౌరవంగా పరిగణించి ఆయనతో సహకరించిన వారికి ఆయన అందించే ఆహ్వానాన్ని వినండి. తమ కిరీటాల్ని విమోచకుని పాదల వద్ద పెట్టి దేవదూతలతో కలిసి “వధింపబడిన గొట్టె పిల్ల, శక్తియు ఐశ్యర్యమును జ్ఞానమును బలమును ఘనతను మహిమయు సోత్రమును పొంద నర్హుడని... సింహాసనాసీనుడైయున్న వానికిని గొట్టె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమ ప్రభావమును యుగయుగ ములు కలుగునుగాక” అని చెప్పటం. ప్రకటన 5:12, 13. MHTel 450.3
విమోచించబడ్డవారు తమను రక్షకుని వద్దకు నడిపించిన వారిని అక్కడ పలకరిస్తారు. మానవుల జీవితం దేవుని జీవితంతో సమానంగా ఉండేందుకు మరణించిన ఆ ప్రభువును స్తుతించటంలో గొంతు కలుపు తారు. సంఘర్షణ సమాప్తమౌతుంది. శ్రమలు పోరాటం సమాప్తమౌతాయి. విమోచించబడ్డ వారందరు దేవుని సింహాసంన చుట్టూ నిలబడి ఉండగా పరలోకమంతా విజయ గీతాలతో మారు మోగుతుంది. అందరూ “మమ్మల్ని విమోచించి దేవునికి సమర్పించటానికి వధింపబడడ్డ గొట్టెపిల్ల ... అర్హుడు” అన్న పల్లవిని అందుకుంటారు. MHTel 450.4
“అటు తరువాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండియు ప్రతి శంశములో నుండియు ప్రజలలో నుండియు, ఆయా భాషాలు మాటలాడువారిలో నుండియు వచ్చి, యెవడును లెక్కింపజాలని యెక గొప్ప సమూహము. కనబడకను. వారు తెల్లని వస్త్రములు ధరించుకొన్న వారై ఖర్జూరపు మట్టలు చేతపట్టుకొని సింహాసనము ఎదుటను గొట్టెప్లయెదుటను నిలువబడి సింహాసనాసీనుడైన మా దేవునికి గొఱ్ఱపిల్లకు మా రక్షణకై స్తోత్రమని మహా శబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి”. ప్రకటన 7:9, 10. MHTel 451.1
“వీరు మహా శ్రమ నుండి వచ్చివారు: గొట్టెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసికొనిరి. అందువలన వారు దేవుని సంహాసనము ఎదుట ఉండి రాత్రింబగళ్లు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనా సీనుడైయ్నువాడు తానే తన గుడారమును వారి మీద కృపను. వారికి ఇకమీదట ఆకలియైనను దాహమైనను ఉండదు, సూర్యుని యెండయైనను ఏ వడగాలియైనను వారికి తగులదు. ఏలయనగా సింహాసన మధ్యవుందుండు గొట్టెపిల్ల వారికి కాపరియై, జీవ జలముల బుగ్గయెద్దకు వారిన నపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్పబిందువును ఉతడిచివేయును.” “మరణము ఇక ఉండదు, దు: MHTel 451.2
ఖమైనను ఏడ్పయినను వేదనయైనను ఇక ఉండవు. మొదటి సంగతలు గతించిపోయేనని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని.” 14-17 వచనాలు: 21:4. MHTel 451.3
అదృశ్యమైన ఈ విషయాల్ని గురించిన దర్శనాన్ని మనం మన ముందు నిత్యం ఉంచుకోవాలి. నిత్య విషయాల పై ప్రస్తుత కాల విషయాలపై ఈ విధంగా మనం సరియైన విలువను ఉంచగలుగుతాం. ఇతరుల్ని ఉన్నత జీవితానికి ప్రభావితం చెయ్యటానికి మనకు శక్తినిచ్చేది ఇదే. MHTel 451.4
దేవునితో కొండపై MHTel 451.5
“కొండ మీదికి తన వద్దకు రమ్మని” దేవుడు మనల్ని ఆదేశిస్తున్నాడు. ఇశ్రాయేలీలును విడిపించటానికి దేవుని సాధనం కాకముందు కొండల ఏకాంతంలో దేవునితో సహవాసానికి మోషేకు నలభై సంవత్సరాలు MHTel 451.6
నియమించబడ్డాయి. ఫరోకి దేవుని వర్తమానాన్ని అందించక ముందు మండుతున్న పొదలో దేవదూతతో మోషే మాట్లాడాడు. దేవుని ప్రజల ప్రతినిధిగా దేవుని ధర్మశాస్త్రాన్ని అందుకోకముందు, మోషేని దేవుడు కొండ మీదికి పలిచాడు. అక్కడ మోషే దేవుని మహిమను చూశాడు. విగ్రహా రాధకుల పై దేవుని తీర్పులను అమలుపర్చక ముందు అతడు బండ సందులో దాచబడ్డాడు. అప్పుడు ప్రభువన్నాడు, ” యెహోవా అను నామమును ప్రకటించెదను” “కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు...... ఏ మాత్రమును దోషులను నిర్దోషులుగా” ఎంచనివాడు. నిర్గమ 34:67. ఇశ్రాయేలు పక్షంగా తన భార్య భాద్యతలను తన జీవితాన్ని చాలించక ముందు మోషేని దేవుణ్ణి పిస్గా కొండపైకి పిలిచి వాగ్దాత్త దేవ మహిమ ప్రభావాల్ని అతడి ముందు పరిచాడు. MHTel 452.1
తమ సేవ నిమిత్తం శిష్యులు బలయలుదేరి వెళ్లక ముందు యేసు వారిని కొండమీదికి పిలిచాడు. పెంతెకొస్తు శక్తి మహిమల ముందు రక్షకునితో సహవాసంలో ఒలీవ కొండపై ఆరోహణ దృశ్యం, మేడగదిలో ప్రార్థన సహవాస దినాలు చోటుచేసుకున్నాయి. MHTel 452.2
గొప్ప శ్రమకో లేక ఓ ప్రముఖమైన పనికో సిద్ధపడేటప్పుడు యేసు కొండల్లో ఏకాంత స్థలానికి వెళ్లి ఆ రాత్రి తన తండ్రికి ప్రార్థన చెయ్యటంలో గడిపేవాడు. అపొస్తలుల అభి షేకానికి, కొండ మీద ప్రసంగానికి, రూపాంతరానికి, తీర్పు గదిలోని, సిలువ మీది వేదనకు, పుతార్థన మహిమకు ముందు ఓ ప్రార్థన రాత్రి చోటుచేసుకుంది. MHTel 452.3