స్వస్థత పరిచర్య

167/173

43—సమున్నత అనుభవం

మనకు నిత్యం క్రీస్తు తాజా ప్రత్యక్షత ఆయన బోధనలకు అనుగుణమైన రోజువారీ అనుభవం అవసరం. ఉన్నతమైన పరిశుద్ధమైన సాధనలు మన అందుబాటులో ఉన్నాయి. జ్ఞానంలోను సద్గుణంలోను వృద్ధిపొందటం మన విషయంలో దేవుని సంకల్పం. ఆయన ధర్మశాస్త్రం థిఆయన స్వరం ప్రతినిధి. ఇంకా పైకి రండి. పరిశుద్ధులు దండి ఇS పరిశుద్దలు కండి” అన్న ఆహ్వానాన్ని అది అందరికి అందిస్తున్నది. క్రైస్తవ ప్రవర్తన సంపూర్ణత సాధనలో మనం దినదినం ముందుకు సాగగలం. MHTel 447.1

ప్రభువు సేవలో నిమగ్నమైనవారికి అనేకులు పొందాలని తలస్తున్న దానికన్నా ఇంకా ఉన్నతమైన లోతైన, విశాలమైన అనుభవం అవసరం. ఇప్పటికే దేవుని కుటుంబములో సభ్యులుగా ఉన్న అనేకులు ఆయన మహిమను వీక్షించటమంటే ఏమిటో, మహిమ నుంచి అధిక మహిమకు మార్పు చెందటమంటే ఏమిటో ఎరుగరు. క్రీస్తు శ్రేష్టతను గూర్చి అనేకులకు మసక మసక అవగాహన మాత్రమే ఉన్నది. వారి ఆత్మలు ఉత్సహిస్తాయి. రక్షకుని ప్రేమను గూర్చి ఇంకా సంపూర్ణమైన లోతైన అవగాహనను అనేకులు ఆకాక్షిస్తున్నారు. వారి ఆత్మ దేవుని పట్ల ప్రేమతో నిండనివ్వండి. ఎవ్వరు తమలో పరిశుద్దాత్మ పని చెయ్యటానికి ఇష్టపడతారో వారితో పని చెయ్యటానికి ఎవరు తమను ఆయన తీర్చి దిద్దటానికి ఇష్టపడతారో వారిని తీర్చి దిద్దటానికి పరిశుద్దాత్మ సిద్ధంగా ఉంటాడు. ఆధ్యాత్మిక ఆలోచనలు పరిశుద్ద సాంగత్యాల సంస్కృతిని పొందండి. ఆయన మహిమ ఉదయ సంధ్య మొదటి కిరాణాల్ని మాత్రమే మీరు చూసారు. ప్రభువును తెలుసుకోవటం కొనసాగించే కొద్ది “పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును” అని మీరు తెలుసుకుంటారు. MHTel 447.2

“మీ యందు నా సంతోషము ఉండవలెననియు, మీ సంతోషము సంపూర్ణము కావలెననినియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను.” యోహాను 15:11 MHTel 447.3

తన మిషను ఫలితాల్ని క్రీస్తు నిత్యం తన ముందు చూశాడు. తాను ఈ శ్రమలు కష్టాలు భరించటం వ్యర్థంగా కాదన్న భావన శ్రమ, త్యాగంతో నిండిన ఆయన భూలోక జీవితాన్ని సంతోషంతో నింపింది. మనుషులు జీవించటానికి తన ప్రాణాన్నివ్వటం ద్వారా మానవాళిలో ఆయన దేవుని స్వరూపాన్ని పుణరుద్ధరిస్తాడు. మనల్ని మట్టిలో నుంచి పైకి లేపి, మనప్రవర్తల్ని తన ప్రవర్తన మాదిరిగా తిరిగి నిర్మించి తన మహిమతో వాటిని అందంగా చేస్తాడు. MHTel 448.1

క్రీస్తు తన ఆత్మ ప్రసవ వేదనను చూసి తృప్తి పొందాడు. అనంతమైన విద్యకాల విషయాలన్ని, తన అవమానం ద్వారా క్షమాపను నిత్య జీవాన్ని పొందే వారి సంతోషాన్ని ఆయన చూశాడు. వారి అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపర్చబడ్డాడు, వారి దోషాలను బట్టి ఆయన నలుగగొట్టబడ్డాడు.వారి సమాధార్థమైన శిక్ష ఆయన మీద పడింది. ఆయన పొందిన దెబ్బల చేత వారికి స్వస్థత కలిగింది. విమోచన పొందిన వారి కేకను ఆయన విన్నాడు. రక్తం ద్వారా బాప్తిస్మాన్ని ముందు పొందవలససి ఉన్నప్పటికీ, నిరపరాధి అయిన ఆయన ఆత్మపై లోక పాపాలు మోప బడాల్ని ఉన్నప్పటికీ, చెప్పశక్యం కాని దు:ఖం నీడ ఆయన మీద ఉన్న ప్పటికీ, తనముందున్న ఆనందం నిమిత్తం సిలువను భరించటానికి ఎంపిక చేసుకుని ఆయన సిగ్గును భరించాడు. MHTel 448.2

ఈ ఆనందాన్ని ఆయన అనుచరులందరూ పంచుకోవాలి, భవిష్యత్తు ఎంత మహిమాన్వితమైనదైనా, మన బహుమానం అంతా చివరి విమోచనవరకూ దాచి ఉంచబడదు. ఇక్కడ సయితం విశ్వాసం ద్వారా మనం రక్షకుని సంతోషంలో ప్రవేశించవచ్చు. మో షేలా మనం అదృ శ్యుడైన ఆయనను చూసి తాళుకోవలసి ఉన్నాం. MHTel 448.3

సంఘం ఇప్పుడు పోరాడుతున్న సంఘం. ఇప్పుడు చీకటిలో ఉన్న పూర్తిగా విగ్రహారాధనకు అంకితమైన లోకాన్ని మనం ఎదుర్కుంటున్నాం. పోరాటం జరిగి విజయం లభించే దినం రాబోతున్నది. పరలోకంలో జరుగుతున్నట్లు భూమి పై దేవుని చిత్తం నెరవేరాల్సి MHTel 448.4