స్వస్థత పరిచర్య
ఆయన క్రీస్తే
'ఆయన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా నుండుటకు విడిచి పెట్టకూడదని భాగ్యమని యెంచుకొన లేదు. గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రక్షకునిగా చేసికొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను”. ఫిలిప్పీ 2:6-8. MHTel 367.1
“చనిపోయిన క్రీస్తు యే సే; అంతే కాదు మృతులలో నుంచి లేచినవాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును... ఆయనే”. “ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించియున్నాడు. గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడైయున్నాడు”. హెబ్రీ 7:25 MHTel 367.2
“మన ప్రధాన యాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోను మనవలెనో శోధింపబడినను ఆయన పాపము లేనివాడైయుండెను”. హెబ్రీ 4:15. MHTel 367.3
క్రీస్తు వరం ద్వారానే మనకు సకల దీవెనలు కలుగుతున్నాయి. ఆ వరం ద్వారానే రోజుకు రోజు నిరంతరం ప్రవహించే యెహోవా మంచితనం మనకు వస్తున్నది. ఆ ఒక్క వరం ద్వారా చక్కని రంగులతో సువాసనతో ప్రతీ పుష్పం మన ఆనందం కోసం దేవుడు ఇస్తున్నాడు. సూర్యుణ్ని చంద్రుణ్ని సృజించినవాడు ఆయనే. ఆకాశానికి అందాలు దిద్దుతున్న నక్షత్రాల్లో ఆయన సృజించినది ఒక్కటి లేదు. కృతజ్ఞత లేని మనం లోకం పై పడే ప్రతీ వర్షపు చినుకు. ప్రతీ సూర్య కిరణం క్రీస్తులో దేవుని ప్రేమను గూర్చి సాక్ష్యమిస్తుంది. చెప్పశక్యము గాని వరమైన దేవుని అద్వితీయ కుమారుని ద్వారా మనకు సమస్తం సరఫరా అవుతున్నది. దేవుని ప్రకృతిలోని ఇవన్నీ ప్రవహించేందుకు ఆయన సిలువ పొందాడు. MHTel 367.4
“మనము దేవుని పిలల్లలమని పిలువబడునట్లు తండ్రి మనకెట్టి ప్రేమననుగ్రహించెనో చూడుడి”. 1 యోహాను 3:1 MHTel 368.1
“తన కొరకు కని పెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడును నేకాలమున చూచి యుండేలదు”. యెషయా 64:4 MHTel 368.2