స్వస్థత పరిచర్య

132/173

సిలువ మహిమ

మానవుడి పట్ల దేవుని ప్రేమ ప్రత్యక్షత సిలువలో కేంద్రీకృతమై ఉంది. దాని సంపూర్ణ ప్రాధాన్యాన్ని నాలుక వివరించలేదు. కలం వర్ణించ లేదు. మానవుడి మనసు గ్రహించలేదు. కల్వరి సిలువ వంక చూస్తే “దేవుడు లోకమునెంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహిం,చెను” అనిమాత్రమే చెప్పగలం యోహాను 3:16ఈ మన పాపాల నిమిత్తం సిలువ వేయబడ్డ క్రీస్తు, మృతుల్లో నుంచి లేచిన క్రీస్తు, పరలోకానికి ఎగసిపోయిన క్రీస్తే మనం నేర్చుకొని బోధించాల్సిన రక్షణ విజ్ఞాన శాస్త్రం. MHTel 366.7