క్రీస్తు ఉపమాన ప్రబోధాలు

14/61

7—పుల్లని పిండిని పోలి ఉన్నది

ఆధారం : మత్తయి 13:33, లూకా 13:20,21

గలిలియ ప్రవక్త మాటలు వినటానికి అనేక మంది విద్యావంతులు పలుకుబడి ప్రాబల్యం గలవారు వచ్చారు. వీరిలో కొందరు క్రీస్తు సముద్రం పక్క బోధిస్తుండగా వినటానికి సమావేశమైన జనసమూహం వంక వింతగా ఆసక్తితో చూసారు. సమాజంలోని అన్ని తరగతుల ప్రజలు ఈ జన సమూహంలో ఉన్నారు. బీదవారు, చదువురానివారు, బిచ్చగాళ్ళు ముఖాలపై అపరాధి ముద్రపడ్డ గజదొంగలు, కుంటివారు, వ్యర్ధులు, వర్తకులు ధనము సంపదలు కలవారు. గొప్పవారు కొద్దివారు. ధనికులు, దరిద్రులు అందరు క్రీస్తు మాటలు వినటానికి ఒకరి మీద ఒకరు పడుతూ నిలబడటానికి చోటు చేసుకుంటున్నారు. సంస్కారం గల ఈ మనుష్యులు ఆ విచిత్ర సమావేశాన్ని చూస్తూ దేవుని రాజ్యం ఇలాంటి వారితో కూడిందా? అని తమలో తాము అనుకుంటున్నారు. ప్రభువు మళ్ళీ ఒక ఉపమానం ద్వారా జవాబు చెప్పాడు. COLTel 65.1

“పరలోక రాజ్యము, ఒక స్త్రీ తీసికొని పిండి అంతయు పులిసి పొంగువరకు మూడు కుంచములు పిండిలో దాచి పెట్టిన పుల్లని పిండిని పోలియున్నది”. యూద సమాజంలో పులిసిన పిండిని కొన్నిసార్లు పాపానికి చిహ్నంగా పరిగణించటం జరిగేది. పస్కా పండుగ సమయంలో ప్రజలు పులిసిన పిండిన తమ గృహాల్లో నుంచి తీసివేయాల్సిందిగా సూచించడం జరిగేది. ఎందుకంటే ప్రజలు తమ హృదయాల్లో నుంచి పాపాన్ని తీసివేసుకోవాల్సి ఉంది. “పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి”. లూకా 12:1 అపొస్తలుడైన పౌలు “దుర్మార్గతయు దుష్టత్వమునకు పులిపిండి” గురించి ప్రస్తావిస్తున్నాడు. 1 కొరి 5:8 కాగా రక్షకుని ఉపమానంలో పరలోక రాజ్యాన్ని సూచించటానికి పులిసిన పిండిని ఉపయోగించటం జరిగింది. చైతన్యపర్చే. ఆత్మీయత కనపరిచే దైవ కృపా శక్తికి అది దృష్టాంతం. COLTel 65.2

ఈ శక్తి పని చేయలేనంత నికృష్ట దుష్టులు లేరు. ఈ శక్తి చేరలేనంత అథోగతికి దిగజారినవారు లేరు. తమ్ముని తాము పరిశుద్దాత్మకు సమర్పించుకునేవారందరిలో ఒక నూతన జీవిత నియమం స్థాపితమౌతుంది. చెరిగిపోయిన దేవుని మూరితత్వం మానవాళిలో పునరుద్దరణ పొందాల్సి ఉంది. అయితే మానవుడు తన బుద్ది బలాన్ని వినియోగించడం ద్వారా తన్ను తాను మార్చుకోలేడు. ఈ మార్పును సాధించే శక్తి అతడికి లేదు. పిండిలో ఆశించిన మార్పు జరగక ముందు అందులో పులిసిన పిండిని--- సంపూర్తిగా బయట నుండి వచ్చేది... ఉంచాలి. అలాగే పాపి మహిమా రాజ్యానికి అర్హతను పొందకముందు అతడు దైవ కృపను అందుకోవాలి. లోకం ఇవ్వగల సంస్కృతి అంతా విద్య నికృష్ట పాపిని దేవుని బిడ్డగా మార్చలేదు. నవీకరించే శక్తి దేవుని వద్ద నుండి రావాలి. పరిశుద్దాత్మ మాత్రమే ఆ మార్పు చేయగలడు. రక్షణ పొందగోరే వారందరూ ఘనులు అల్పులు, ధనికులు దరిధ్రులు ఈ శక్తి చేసే పనికి తమ్ముని తాము సమర్పించుకోవాలి. COLTel 66.1

“యెహోవా ధర్మశాస్త్రము ననుసరించి నిర్దోషముగా నడుచుకొనువారు ధన్యులు. ఆయన శాసనములకు గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదకువారు ధన్యులు. వారు ఆయన మార్గములో నడుచు కొనుచు ఏ పాపమును చేయరు. నీ ఆజ్ఞాలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించుచున్నావు. ఆహా, నీ కట్టలను గైకొనునట్లు నా ప్రవర్తన స్థిరపడి యుండిన నెంత మేలు”. కీర్త 119:1-5. COLTel 66.2

పులిసిన పిండి పిండి ముద్దలో మిళితమైనప్పుడు లోపల నుంచి పనిచేస్తుంది. అదేవిధముగా హృదయాన్ని నూతనం చెయ్యటం ద్వారా జీవితాన్ని మార్చటానికి దేవుని కృప పనిచేస్తుంది. మనకు దేవునితో సామరస్యం కూర్చటానికి బాహ్యమైన మార్పు చాలదు. ఈ చెడ్డ అలవాటుని ఆ చెడ్డ అలవాటుని సరిదిద్దుకోటం ద్వారా దిద్దుబాటు చేసుకోవటానికి ప్రయత్నించేవారు అనేకమంది. ఈ రకంగా వారు క్రైస్తవులవ్వాలని చూస్తారు. అయితే వారు తప్పు స్థలంలో ఆరంభిస్తున్నారు. మన మొదటి పని హృదయంతో జరగాలి. COLTel 66.3

విశ్వసిస్తున్నామని చెప్పుకోటం ఆత్మలో సత్యాన్ని కలిగి ఉండటం రెండూ వేర్వేరు విషయాలు. సత్యాన్ని తెలుసుకోవడం మాత్రమే చాలదు. ఇది మనకుండవచ్చు గాని మనలో ఆలోచనా ధోరణిలో మార్పు లేకపోవచ్చును. హృదయంలో మార్పు చోటు చేసుకోవాలి. హృదయం పరిశుద్దమవ్వాలి. COLTel 67.1

ఆజ్ఞల్ని కేవలం ఒక విధిగా ఆచరించటానికి ప్రయత్నించే వ్యక్తి-- అతడు అలా చేయడం తప్పనిసరి కాబట్టి -విధేయత తెచ్చే సంతోషాన్ని పొందలేడు. అతడు లోబడడు. దైవ విధులు మానవుడి అభీష్టాన్నికి అభిరుచికి విరుద్దంగా ఉన్నందువల్ల అవి భారంగా పరిగణమించినప్పుడు ఆ జీవితం క్రైస్తవ జీవితం కాదని మనకు తెలుస్తుంది. అంతర్గత నియమం బహిర్గతంగా పనిచెయ్యటమే నిజమైన విధేయత. అది నీతిపట్ల ప్రేమ నుంచి అనగా దైవ ధర్మశాస్త్రం పట్ల ప్రేమ నుంచి పుడుతుంది. మన విమోచకుడైన క్రీస్తుకి విశ్వాస పాత్రులుగా నివసించటమే సమస్త నీతి సారంశం. ఇది న్యాయం గనుక మనల్ని న్యాయం చెయ్యటానికి ఇది నడిపిస్తుంది. ఎందుకంటే న్యాయం చెయ్యటం దేవునికి ఇష్టం. COLTel 67.2

” యెహోవా , నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా నున్నది. నీ విశ్వాస్యత తరతరములుండును. అది స్థిరముగా నున్నది. నీతి ఉప దేశము వలన నీవు నన్ను బ్రతికించితివి నేనెన్నడును వాటిని మరువను... సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి యున్నాను. నీ ధర్మోపదేశములు అపరిమితమైనవి”. కీర్త 119:89-96. COLTel 67.3

పరిశుద్దాత్మ ద్వారా హృదయ పరివర్తనను గూర్చిన మహత్తర సత్యం క్రీస్తు చెప్పిన ఈ మాటల్లో నీకొదేముకి అందిచండం జరిగింది. ‘ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను... శరరీమూలంగా జన్మించినది శరీరమును ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మయునైయున్నది. మీరు కొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందునకు ఆశ్చర్యపడవద్దు. గాలి తన కిష్టమైన చోటను విసరును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడ నుండి వచ్చునో యెక్కడికి పోవునో, నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతివాడును అలాగే యున్నాడు.” యోహా 3:3-8. COLTel 67.4

ఆత్మావేశం గురించి రాస్తూ అపొస్తలుడైన పౌలు ఇలా అంటున్నాడు. “దేవుడు కరుణామయుడై యుండి, మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై యుండినప్పుడు సయితము మన యెడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడ బ్రతికించెను. కృప చేత మీరు రక్షింపబడియున్నారు. క్రీస్తు యేసు నందు ఆయన మనకు చేసిన ఉప కారము ద్వారా అత్యధికమైన తన కృపా మహాదైశ్వర్యమును రాబోవు యుగములలో కనపర్చు నిమిత్తము క్రీస్తు యేసు నందు మనలను ఆయనతో కూడ లేపి, పరలోకమందు ఆయనతో కూర్చుండబెట్టెను”. ఎ.ఫ.2:4-8 COLTel 68.1

పిండి ముద్దలో ఉంచిన పులి పిండి కనిపించకుండా పనిచేసి ముద్ద అంతటినీ పులియజేస్తుంది. అలాగే సత్యమనే పులిపిండి రహస్యంగా నిశ్శబ్దంగా నిలకడగా పనిచేసి ఆత్మలో పరివర్తన కలిగిస్తుంది. స్వాభావికమైన ప్రవృత్తి మారి చిత్తం అదుపులోకి వస్తుంది. కొత్త ఆలోచనలు, కొత్త మనోభావాలు, కొత్త ఉద్దేశాలు ఏర్పడతాయి. ప్రవర్తనకు నూతన ప్రమాణం ఏర్పడుతుంది. అదే క్రీస్తు జీవితం. మనసులో మార్పు కలుగుతుంది. నూతన మార్గాల్లో క్రియాచరణకు మానసిక శక్తులు మేల్కొంటాయి. మానవుడికి నూతన మానసిక శక్తులు లేవు. అతడికున్న మానసికశక్తులే పవిత్రీకరింపబడ్డాయి. మనస్సాక్షి మేల్కొంటుంది. దేవుని సేవ చెయ్యటానికి సామార్థ్యాన్నిచ్చే ప్రత్యేక గుణ లక్షణాలు మనకనగ్రహించబడ్డాయి. మాటల్లోను స్వభావంలోను, ప్రవర్తనలోను దిద్దుబాటు లేని అనేకులు దేవుని వాక్యాన్ని నమ్ముతున్నట్లు ఎందుకు చెప్పుకుంటున్నారు? అన్న ప్రశ్న తరచుగా వినిపిస్తున్నది. తమ ఉద్దేశాలకి ప్రణాళికలకి వ్యతిరేకతను సహించలేనివారు. అపవిత్ర కోపోద్రేకాలు ప్రదర్శించేవారు. కఠినమైన, ఆహంభావ పూరితమైన, దురాలాచోనలతో నిండిన మాటలు పలికే వారు అంతమంది ఎందుకు ఉన్నారు? లోకాన్ని ప్రేమిచే వారి జీవితాల్లో కానవచ్చే స్వార్ధప్రేమే, స్వార్ధక్రియేలు, దురాగ్రహమే, దూరాలాచోన మాటలే, వారి జీవితాల్లోనూ కనిపిస్తున్నాయి. సత్యంలో వారికి అసలు పరిచయమే లేదన్నట్లు వారిలోను అదే అహంభావం, స్వాభావిక అభిరుచులకు అదే రకమైన లొంగుబాట్లు అదే వక్రవర్తన ఉన్నాయి. అందుకు కారణం వారిలో మార్పు చోటు చేసుకోలేదు. సత్యమనే పులిసిన పిండిని వారు తమ హృదయాల్లో దాచుకోటం లేదు. అది దాని పనిని చేయటానికి దానికి తరుణం దొరకటం లేదు. దుష్టత విషయంలో వారి స్వాభావిక ప్రవృత్తుల్ని పరివర్తన కలిగించే శక్తికి వారు సమర్పించుకోలేదు. వారి జీవితాల్లో క్రీస్తు కృప లోపించింది. ప్రవర్తనను పూర్తిగా మార్చటానికి ఆయన శక్తిని వారు విశ్వసించలేదు. COLTel 68.2

“యౌవనులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా? నా పూర్ణ హృదయముతో నిన్ను వెదకియున్నాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరుగనియ్యకుము. నీ యెదుట నేను పాపము చేయకుంటునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొనియున్నాను... నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను నీ త్రోవలను మన్నించెదను. నీ కట్టడములను బట్టి నేను హర్చిందెను. నీ వాక్యమును నేను మరుకయుందును”. కీర్త 119:9-16 COLTel 69.1

“వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును.” రోమా 10:7 ప్రవర్తన పరివర్తనలో లేఖనాలు గొప్ప సాధనాలు. “సత్యము నందు వారిని ప్రతిష్ట చేయుము, నీ వాక్యమే సత్యము” అంటూ క్రీస్తు ప్రార్ధన చేసాడు. యోహా 17:17 దైవ వాక్యాన్ని పఠించి ఆచరిస్తే అది హృదయంలో పనిచేస్తుది. ప్రతీ దుర్మార్గ వైఖరిని అణిచివేస్తుంది., పాప నిర్ధారణ పుట్టించటానికి పరిశుద్దాత్మ వస్తాడు. హృదయంలో పుట్టే ప్రేమ క్రీస్తు పై ప్రేమ వల్ల క్రియాశీలమవుతుంది. శారీరకంగాను, ఆత్మ విషయంలోను మనల్ని ఆయన స్వరూపంలోకి మార్చుతుంది. అప్పుడు దేవుడు తన చిత్రాన్ని జరిగించటానికి మనల్ని ఉపయోగించగలుగుతాడు.మనకు ఇవ్వబడ్డ శక్తి లోపల నుండి బహర్షితంగా పనిచేస్తూ మనకు వచ్చిన సత్యాన్ని ఇతరులకి అందించటానికి మనల్ని నడిపిస్తుంది. COLTel 69.2

దైవ వాక్యంలోని సత్యాలు మానవుడి ప్రయోగాత్మక అవసరాన్ని తీర్చుతాయి. అంటే విశ్వాసం ద్వారా ఆత్మ పరివర్తన చెందటం, ఈ మహత్తర సూత్రాలు అనుదిన జీవితంలోకి తీసుకురాకూడనంత పవిత్రమూ పరిశు ద్దము అయినవని భావించకూడదు. ఇవి ఆకాశన్నంటేంత ఉన్నతమూ విశ్వాన్ని అవరించేంత విశాలమూ అయిన సత్యాలు. అయినా వాటి ప్రభావం మానవానుభవంతో అల్లుకుపోవాల్సి ఉన్నది. అవి జీవితంలోని గొప్ప విషయాల్లోకి అల్ప విషయాల్లోకి చొచ్చుకుపోవాల్సి ఉన్నాయి. COLTel 69.3

“యెహోవా , నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము. అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును. నీ ధర్మశాస్త్రము ననుసరించుటకు నాకు బుద్ది దయచేయుము. అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారము నడుచుకుందును. నీ ఆజ్ఞల జాడను చూచి నేను అనుసరించుచున్న దాని యందు నన్ను నడువజేయుము. నీ విచ్చిన వాక్యము మనుష్యులలో నీ భయమును పుట్టించుచున్నది. నీ సేవకునికి దాని స్థిరపర్చును. నీ న్యాయ విధులు ఉత్తమములు. నాకు భయము పుట్టించుచున్న నా అవమానమును కొట్టివేయుము” కీర్తన 119:33-39. COLTel 70.1

హృదయం స్వీకరించినపుడు సత్యమనే పులిపిండి ఆశల్ని నియంత్రిస్తుంది. తలంపుల్లి శుద్ధి చేస్తుంది. స్వభావాన్ని సౌమ్యం చేస్తుంది. మానసిక సమర్ధతల్ని ఆత్మ శక్తుల్ని చైతన్య పర్చుతింది. మనోభావాల్ని ప్రేమను వ్యక్తం చేయటానికి సామర్ధ్యాన్ని పెంచుతుంది. COLTel 70.2

ఈ నియమం గల వ్యక్తిని లోకం ఒక మర్మంగా పరిగణిస్తుంది. స్వార్ధపరుడు, ధనా పేక్ష గలవాడు అయిన వ్యక్తి సిరిసంపదలు ప్రతిష్ట సంపాదించటానికి, వినోదాల్లో తేలి ఆడటానికి ప్రయత్నిస్తాడు. నిత్య జీవం అతడి పరిగణలోనికి రాదు. అయితే క్రీస్తు అనుచరుడికి ఇవి ప్రాముఖ్యం కానే కావు. క్రీస్తు నిమిత్తం అతడు సేవ చేస్తాడు. తన్ను తాను ఉపేక్షించు కుంటాడు. క్రీస్తుని ఎరుగకుండా నిరీక్షణ లేకుండా లోకంలో ఉన్నవారిని రక్షించే పరిచర్యలో తోడ్పడాలన్నదే అతడి ఆశ. అలాంటివాణ్ని లోకం అర్ధం చేసుకోలేదు. ఎందుకంటే అతడు నిత్య వాస్తవాలపై తన దృష్టిని ఉంచుతున్నాడు. రక్షణ శక్తి గల క్రీస్తు ప్రేమ అతడి హృదయంలోకి వస్తుంది. ఈ ప్రేమ ఇతర ఉద్దేశాల్ని అదుపు చేసి అతణ్ణి లోక సంబంధమైన దుష్ప్రభావానికి దూరంగా ఉంచుతుంది. COLTel 70.3

మానవ కుటుంబములోని ప్రతీ సభ్యుడితో మన సహవాసం పై దైవ వాక్యం పరిశుద్ధపర్చే ప్రభావాన్ని ప్రసరించాల్సి ఉంది. సత్యం అనే పులి పిండి పోటీ తత్వాన్ని ఆత్యాశను అందరికన్నా ముందు ఉండాలన్న కోరికను సృష్టించదు. నిజమే, పై నుండి వచ్చే ప్రేమలో స్వార్ధం ఉండదు. అది మారదు. అది మనుషుల ప్రశంసలపై ఆనుకోదు, దేవుని కృపను పొందిన వ్యక్తి హృదయం దేవుని పట్ల క్రీస్తు ఎవరి కోసం మరణించాడో వారి పట్ల ప్రేమతో పొంగి పొర్లుతుంది (అతడు) గుర్తింపు కోసం పోరాడడు. COLTel 71.1

“నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునె యున్నది. నీ న్యాయ విధులను నేననుసరించెదనని నేను ప్రమాణము చేసియున్నాను. నా మాట నెరవేర్చుదును.... నీ శాసనములు నాకు హృదయానందకరములు అవి నాకు నిత్యస్వాస్థమని భావించుచున్నాను. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపర్చుకొనియున్నాను. ఇది తుదివరకు నిలుచు నిత్య నిర్ణయము” కీర్త 119:105-112. COLTel 71.2

ఇతరులు తనను ప్రేమిస్తున్నందుకు సంతోష పెడుతున్నందుకు తన యోగ్యతల్ని అభినందిస్తున్నందుకు కాక వారు క్రీస్తు కొన్నవారు గనుక వారిని అతడు ప్రేమిస్తాడు. తన ఉద్దేశాలు,మాటలు లేదా పనుల్ని అపార్ధం చేసుకోవడం లేక వాటికి అపార్ధం కల్పించడం జరిగినప్పుడు అతడు అభ్యంతరపడక తన న్యాయ మార్గంలోనే కొనసాగుతాడు. దయ కనికరాలు సదాలోచనలు కలిగి తన్ను గురించి తాను కొద్దివాడిగా భావిస్తాడు. అయినా అతడు నిరీక్షణతో నిండి నిత్యం దేవుని కృపను ప్రేమను నమ్ముకొని ఉంటాడు. COLTel 71.3

“మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధడైయున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్దలై యుండుడి” అంటూ అపొస్తలుడు హితవు పలుకుతున్నాడు. 1 పేతు 1:16 క్రీస్తు కృప ఉద్రేకాన్ని స్వరాన్ని అదుపు చేయ్యాలి. సహోదరులు ఒకరిపట్ల ఒకరు కనపర్చే మర్యాదలోను గౌరవంలోను దాని పనికనిపిస్తుంది. గృహంలో దేవదూత సముఖం ఉంటుంది... జీవితం సువాసన వెదజల్లుతుంది. అది పైకెగసి పరిశుద్ధ ధూపంగా దేవుని సముఖాన్ని చేరుతుంది. దయ కనికరాల్లోను వినయవిధేయతల్లోను సహనంలోను, దీర్ఘశాంతంలోను ప్రేమ వ్యక్తమవుతుంది. COLTel 71.4

ముఖ వైఖరి మారుతుంది. తనను, తన ఆజ్ఞల్ని ప్రేమించే వారి హృదయంలో క్రీస్తు నివసించి వారి ముఖాల్లో ప్రకాశిస్తాడు. వారి ముఖాల పై సత్యం రాబడి ఉంటుంది. పరలోక శాంతి వెల్లడవుతుంది. సాధుత్వం అలవాటుగా వెల్లడవుతుంది. మానవ ప్రేమను మించిన ప్రేమ వ్యక్తమౌతుంది. COLTel 72.1

సత్యమనే పులిసిన పిండి మనిషిలో పరివర్తన కలిగిస్తుంది. కఠినంగా ఉన్న వ్యక్తిని సున్నిత వ్యక్తిగా కరకుగా ఉన్న వ్యక్తిని వినయుడుగా, స్వార్ధంతో నిండిన వ్యక్తిని ఉదార వ్యక్తిగా మార్చుతుంది. అది అపవిత్రుల్ని గొర్రెపిల్ల రక్తంలో కడిగి శుద్ధి చేస్తుంది. జీవాన్నిచ్చే తన శక్తి ద్వారా మనసును ఆత్మను శక్తిని దైవిక జీవితంలోకి నడిపిస్తుంది. సమున్నతమైన పరిపూర్ణమైన ప్రవర్తనలో క్రీస్తుని ఘనపర్చడం జరుగుతుంది. ఈ మార్పులు చోటు చేసుకుంటున్నప్పుడు దేవ దూతలు సంతోషంతో పాటలు పాడతారు. దైవ పోలికను సంతరించుకున్న ఆత్మల్ని చూసి తండ్రి అయిన దేవుడు క్రీస్తు ఆనందిస్తారు. COLTel 72.2