క్రీస్తు ఉపమాన ప్రబోధాలు

13/61

6—విత్తనం విత్తటం నుంచి ఇతర పాఠాలు

విత్తనం విత్తటం నుంచి విత్తనం నుంచి మొక్క పెరుగుదల నుంచి కుటుంబంలోను పాఠశాలలోను విలువైన పాఠాలు నేర్పవచ్చు. ప్రకృతి సంబంధమైన విషయాల్లో పనిచేసే దైవ సాధనాన్ని చిన్న పిల్లలు యువత గుర్తించటం నేర్పించడం. వారు విశ్వాసమూలంగా అదృశ్యమైన ఉపకారాల్ని గ్రహించటానికి సామర్థ్యం పొందుతారు. దేవుడు తన విశాల కుటుంబ అవసరాల్ని సరఫరా చెయ్యటానికి చేస్తున్న అద్భుతమైన పనిని వారు అవగాహన చేసుకొని ఆయనతో మనం ఎలా సహకరించాలో తెలుసుకున్నప్పుడు వారికి దేవుని మీద మరింత విశ్వాసం ఏర్పడుతుంది. తమ రోజువారీ జీవితంలో దేవుని శక్తిని మరింత గుర్తిస్తారు. COLTel 56.1

తన నోటి మాటతో భూమిని సృజించినట్లే దేవుడు విత్తనాన్ని సృజించాడు. అది పెరిగి వృద్ధి చెందటానికి తన మాట వలన దానికి శక్తినిచ్చాడు. “గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనము గల ఫలమిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించు గాకని పలుకగా ఆప్రకారమాయెను... అది మంచిదని దేవుడు చూచెను”. అది 1:11, 12. విత్తనం పెరగటానికి ఆ మాటే ఇంకా శక్తినిస్తుంది.తన పచ్చని మొలకల్ని సూర్యరశ్మికి విప్పే ప్రతి విత్తనం ఎవరు “మాట సెలవియ్యగా దాని ప్రకారమాయెనో” ఎవరు “ఆజ్ఞాపింపగా కార్యము స్థిరపడెనో” (కీర్త 33:9) అద్భుత కార్యాలు చేసే ఆ ప్రభువు శక్తిని ప్రకటిస్తున్నది. COLTel 56.2

క్రీస్తు తన శిష్యులకి “మా అనుదినాహారము నేడు మాకుదయ చేయుము” అని ప్రార్ధించడం నేర్పించాడు. పువ్వుల వంక వేలు చూపిస్తూ “అడవి గడ్డిని దేవుడిలాగు అలంకరించిన యెడల... మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును గదా” అంటూ వారికి భరోసా ఇచ్చాడు. మత్త 6:11,30 ఈ ప్రార్ధనను సఫలం చెయ్యటానికి ఈ భరోసాని సహాకారం చెయ్యటానికి క్రీస్తు నిరంతరం కృషి చేస్తున్నాడు. మానవుడికి COLTel 56.3

అన్నవస్త్రాలివ్వటానికి ఒక అదృశ్య శక్తి సేవకుడిలా నిత్యం పనిచేస్తుంది. పారవేసినట్లు కనిపించే విత్తనాన్ని జీవిస్తున్న మొక్కగా చెయ్యటానికి ప్రభువు అనేక సాధనాల్ని వినియోగిస్తాడు. పంటను పరిపూర్ణం చెయ్యటానికి ప్రభువు అనేక సాధనాల్ని వినియోగిస్తాడు. పంటను పరిపూర్ణం చెయ్యటానికి అవసరమైనదంతా సరియైన పాళ్ళలో ఆయన సరఫరా చేస్తాడు. COLTel 57.1

కీర్తన కారుని చక్కని మాటల్లో

“నీవు భూమిని దర్శించి దాని తడుపుచున్నావు
దానికి మహాదైశ్వర్యము కలుగజేయుచున్నావు
దేవుని నది నీళ్ళతో నిండియున్నది
నీవు భూమిని అట్లు సిద్ధపర్చిన తరువాత
వారికి ధాన్యము దయచేయుచున్నావు
దాని దుక్కులను విస్తారమైన నీళ్ళతో తడిపి
దాని గనిమలను చదును చేయుచున్నావు
వాన జల్లుల చేత దానిని పదును చేయుచున్నావు
అది మొలకెత్తగా నీవు దాని నాశీర్వదించుచున్నావు
సంవత్సరము నీ దయాకిరీటము ధరింపజేసియున్నావు
నీ జాడలు సారము వెదలజల్లుచున్నవి.
COLTel 57.2

కీర్త 65:9-11.

భౌతిక ప్రపంచం దేవుని అదుపులో ఉంది. ప్రకృతి ప్రకృతి చట్టాలకి లోబడి ఉంటుంది. సమస్తం సృష్టికర్త చిత్రం ప్రకారం పలుకుతుంది. నడుచుకుంటుంది. మేఘం సూర్యరశ్మి, మంచు, వర్షం, గాలి, తుఫాను అన్ని దేవుని పర్యవేక్షణ కింద ఉన్నాయి. అవి ఆయన ఆజ్ఞను విధేయలగుచు నెరవేర్చుతాయి. దేవుని చట్టానికి లోబడే విత్తనం మొలక భూమిని బద్దలు కొట్టుకుంటూ “మొదట మొలకను తరువాత వెన్నును ఆటు తరువాత వెన్నులో ముదురు గింజలు ఇస్తుంది. మార్కు 4: 28 ఇది వాటి వాటి సమయంలో వృద్ధి చెందుతాయి. ఎందుకంటే అవి ఆయన చేస్తున్న పని ప్రతిఘటించవు. దేవుని స్వరూపంలో సృష్టి అయి వివేచన భాషావరం కలిగి ఉన్న మానవడు ఒక్కడు మాత్రమే ఆయన వరాల్ని అభినందించకుండా ఆయన చిత్తానికి అవిధేయంగా నివసించడం జరగుతుందా? COLTel 57.3

మానవుడి సంరక్షణకు సంబంధించిన ప్రతీ విషయంలోను దైవ మానవ సంయుక్త కృషి కనిపిస్తుంది. విత్తనం చల్లటంలో మావన హస్తం పనిచేస్తేనే గాని పంటకోయటం ఉండదు. ఎండ, వాన, మంచు మేఘాన్ని ఇవ్వటంలో దేవుడు సమకూర్చే సాధనాలు లేకుండా వృద్ధి సాధ్యాం కాదు. ప్రతీ వ్యాపార విషయంలోను చదువు శాస్త్రం ప్రతీ శాఖలోను ఇలాగే ఉంటుంది. ఆధ్మాత్మిక విషయాల్లోను, ప్రవర్తన నిర్మాణములోను క్రైస్తవ సేవ ప్రతి విభాగంలోను ఇలాగే జరుగుతుంది. మనకు ఒక పాత్ర ఉంది. అయితే మనతో కలసి పనిచెయ్యటానికి మనకు దైవశక్తి అవసరం. లేకుంటే మన కృషి వ్యర్థమౌతుంది. COLTel 58.1

ఆధ్మాత్మికంగా గాని ఐహికతరంగా గాని మానవడు ఏదైనా సాధించినపుడు అది తన ప్రభువైన క్రీస్తు సహకారం ద్వారానే సాధించగలిగానని అతడు జ్ఞాపకముంచుకోవాలి. మనం దేవుని పై ఆధారపడి ఉన్నామని గుర్తించడం ఎంతో అవసరం. మానవుడిపై అతిగా నమ్మకం పెట్టుకోవడం మానవ ఆవిష్కరణలపై అతిగా ఆధారపడటం జరుగుతుంది. దేవుడు ఇవ్వటానికి సంస్ధంగా ఉన్న శక్తిని అతి తక్కువగా విశ్వసించడం జరుగుతున్నది. ” మేము దేవుని జతపనివారమై యున్నాము.” 1 కొరి.3:9 మానవడు పోషించేది ఎంతో అల్పమైన పాత్ర. కాని క్రీస్తు దైవత్వంతో జతపడితే అతడు క్రీస్తు అనుగ్రహించే శక్తితో సమస్తం సాధించగలుగుతాడు. COLTel 58.2

విత్తనం నుంచి మొక్క క్రమక్రమంగా పెరగటం వల్ల శిక్షణలో ఓ సాదృశ్య పాఠాన్ని సమకూర్చుతుంది. “మొదట మొలకను తరువాత వెన్నును అటు తరువాత వెన్నులో ముదురు గింజలు” రావటం జరుగుతంది. ఈ సమాచారం ఎవరు ఇచ్చారో ఆయన ఆ చిన్న విత్తనాన్ని సృజించి దానికి ముఖ్యమైన లక్షణాలిచ్చి దాని పెరుగుదలకు సంబంధించిన చట్టాల్ని నియమించాడు. ఈ ఉపమానం బోధించే సత్యాలు ఆయన జీవితంలో సజీవ సత్యాలయ్యాయి. తన శారీరక జీవితంలోను ఆధ్మాత్మిక జీవితంలోను మొక్క ఉదహరిస్తున్న దైవిక పెరుగుదల ప్రక్రియ ఆయన అనుసరించాడు. యువత తన మాదిరిన అవలంబించాల్సిందిగా ఆయన కోరుతున్నాడు. ఆయన పరలోక ప్రభువు, మహిమరాజు అయినప్పటికి బేళ్లే హేములో శిశువు అయి తల్లి ఆలనపాలన కింద ఉన్న నిస్సహాయుడైన పసిబాలున్ని సూచించాడు. బాల్యంలో ఆయన విధేయుడైన బాలుడుగా పనిచేసాడు. చిన్నవాడిలా మాట్లాడి చిన్నవాడిలా పనులు చేసాడు. పెద్దవాడిలా వ్యవహరించలేదు. తల్లితండ్రుల్ని గౌరవించి వారు చెప్పిన పనుల్ని ఉప యుక్తమైన మార్గాల్లో చిన్న బిడ్డ శక్తి మేరకు నిర్వహించాడు. కాని తన పెరుగుదలలో ప్రతీ దశలోను సామాన్య కృపాభరిత, పాప రహిత జీవితంలో పరిపూర్ణతను సాధించాడు. ఆయన బాల్యం గురించి పరిశుద్ధ లేఖనం ఇలా చెబుతున్నది, “బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలమును పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద నుండెను”. ఆయన యౌవనం గురించి “యేసు జ్ఞానమునందును వయస్సు నందును దేవుని దయయందును, మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను” అని లేఖనాలు చెబుతున్నది. లూకా 2:40,52. COLTel 58.3

ఇక్కడ తల్లితండ్రులు ఉపాధ్యాయుల కర్తవ్యం సూచించబడుతున్నది. ఆ కాలానికి సముచితమైన, పెరిగే తోటలో మొక్కల్లా, స్వాభావికంగా విప్పారే సౌందర్యాన్ని సూచించేలా యువత జీవితం ప్రతీ దశలో వారి ప్రవృత్తుల్ని పెంపార చెయ్యటానికి తల్లితండ్రులు ఉపాధ్యాయులు ప్రయత్నించాలి. COLTel 59.1

కృత్రిమము లేకుండా సహజంగా ఉండే పిల్లలు చూడముచ్చటగా ఉంటారు. వారిని ప్రత్యేకంగా గుర్తించటం, వారి తెలివైన మాటల్ని వారి ముందర పునరుచ్చరించడం విజ్ఞత కాదు. వారి ఆందాన్ని వారి మాటల్ని లేక వారి కార్యాల్ని ప్రశంసించటం ద్వారా అహాంకారిన్ని ప్రోత్సహించ కూడదు. వారికి ఖరీదైన, ఆడంబరమైన దుస్తులు వెయ్యకూడదు. ఇది వారిలో గర్వం పుట్టించి వారి మిత్రుల హృదయాల్లో ఈర్ష్య కలిగిస్తుంది. COLTel 59.2

చిన్న పిల్లలకి చిన్న పిల్ల సారళ్యతతో విద్య నేర్పించాలి. చిన్న చిన్న ఉపయుక్తమైన విధులతో వారి వయస్సుకు స్వాభావికమైన వినోదాలు అనుభవాలతో తృప్తి చెందటానికి వారిని తర్పీతు చెయ్యాలి. బాల్యం ఉపమానంలోని పచ్చని మొలకవంటిది. ఆ మెలకకు తనదైన సొగసు ఉంది. పిల్లల్ని ఆకాల పక్వానికి బలవంతంగా నడిపించకూడదు. వారు తమ బాల్య సంవత్సరాల తాజతనాన్ని అమాయకత్వాన్ని సాధ్యమైనంత కాలం నిలుపుకోవాలి. COLTel 59.3

ప్రకృతిలోని దేవుని చట్టాల్లో కార్యాన్ని కారణం తప్పక అనుసరిస్తుంది. ఎలా విత్తటం జరిగిందో కోత వెల్లడి చేస్తుంది. సోమరి పనివాణ్ణి అతడి పని ఖండిస్తుంది. పంట అతడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతుంది. ఆధ్మాత్మికంగాను ఇదే జరుగుతుంది. ప్రతీ పనివాడి విశ్వాసపాత్రను అతడు చేసిన పని ఫలితాలు కొలుస్తాయి. అతడి పని జాగ్రత్తగా నమ్మకంగా చేసిందో లేక ఆషామాషిగా సోమరితనంగా చేసిందో పండిన పంట వెలువరిస్తుంది. అతడి నిత్య జీవార్హత ఇలా నిర్ణయమౌతుంది. COLTel 60.1

నాటిన ప్రతి విత్తనం దాని జాతి ఫలాలు ఫలిస్తుంది. మానవ జీవితంలో కూడా ఇంతే, మనం, దయ, సానుభూతి ప్రేమ విత్తనాలు విత్తటం అవసరం ఎందుచేతనంటే మనం ఏమి విత్తితే దాని పంటనే కోస్తాం. స్వార్ధపరత్వం, స్వార్ధ ప్రేమ, ఆత్మగౌరవం, శరీరాశల్ని తృప్తి పర్చే కార్యాలు వాటి పంట పండుతాయి. స్వార్థం కోసం నివసించే వ్యక్తి శరీరాశను విత్తుతున్నాడు. శరీర సంబంధమైన దుర్నీతి పంటనే కోస్తాడు. COLTel 60.2

దేవుడు ఎవరిని నాశనం చెయ్యడు నాశనమయ్యే ప్రతీవాడు తన్ను తానే నాశనం చేసుకుంటాడు. మనస్సాక్షి ప్రభోదాన్ని లెక్క చెయ్యని ప్రతి వ్యక్తి అవిశ్వాస విత్తనాలు విత్తుతున్నాడు. అవి తప్పక వాటి పంట పండుతాయి. దేవుని హెచ్చరికను తిరస్కరించటంద్వారా ఫరో మూర్ఖత్వ విత్తనాలు విత్తాడు దాని పంటనే కోశాడు. అతడు నమ్మకుండా మూర్ఖంగా ప్రవర్తించటానికి దేవుడు అతణ్ని ఒత్తిడి చేయలేదు. అతడు చల్లిన జేష్టునిచల్లని శవం మీద నుంచి తన ఇంటి వారి మొదటి సంతానం శవాల మీద నుంచి తన రాజ్యంలోని కుటుంబల్లోని ప్రథమ సంతానం శవాల మీద నుంచి అతలాకుతలమైన తన దేశాన్ని చూసే వరకు సముద్ర జలాలు తన గుర్రాలు తన రథాలు తన యుద్దశూరుల్ని ముంచే వరకు అతడి మూర్ఖత్వం కొనసాగింది. “మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును” (గల6:7) అన్న మాటల్లోని వాస్తవానికి ఫరో చరిత్ర భయంకర సాదృశ్యం. COLTel 60.3

విత్తిన విత్తనం పంటను ఉత్పత్తి చేస్తుంది. ఇది మళ్లీ విత్తనప్పుడు పంట ఎన్నో రెట్లవుతుంది. ఇతరులతో మన సంబంద:లో ఈ నిబంధనే పనిచేస్తుంది. ప్రతీ చర్య ప్రతీ మాట విత్తనమై పంట పండుతుంది. దయ, విధేయత, స్వారో పేక్షను సూచించే ప్రతీ క్రియ ఇతరుల్లో పునరుత్పత్తి అవుతుంది. వారి ద్వారా అది ఇంకా ఇతరుల్లో పునరుత్పత్తి అవుతుంది. అలాగే అసూయ, ద్వేషం లేక విభేదాన్ని సూచించే ప్రతీ కార్యం “చేదైన వేరు” (హెబ్రీ 12:15)ను మొలకెత్తించే విత్తనమవుతుంది. దాని మూలంగా అనేకులు దుష్టులవుతారు. “అనేకమంది వలన భ్రష్టులయ్యే వారి సంఖ్య ఇంకెంత పెద్దదో! ఈ రకంగా మంచి చెడులను విత్తటం నిత్యం కొనసాగు తుంది. COLTel 61.1

ఆధ్మాత్మిక విషయాల పరంగాను లౌకిక విషయాల పరంగాను విత్తనం విత్తే పాఠం ఓదార్యాన్ని బోధిస్తున్నది. “సమస్త జలముల యొద్దను విత్తనములు చల్లు... మీరు ధన్యులు”అని ప్రభువంటున్నాడు.“కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంటకోయును. సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటకోయును అని యీ విషయమై చెప్పవచ్చును.” COLTel 61.2

యెష 32:20 కొరి 9:6 సమస్త జలములు వద్ద విత్తనాలు చల్లటమంటే దేవుని వరాల్ని నిత్యం పంచటం దేవుని సేవకు లేక మానవుల అవసరాలికి ఎక్కడ మన చేయూత అవసరమౌతుందో అక్కడ ఇవ్వటమని అర్ధం.ఇది పేదరికం కలిగించదు. “సమృద్దిగా విత్తువాడు సమృద్ధిగా పంటకోయును”. విత్తువాడు విత్తనాల్ని చల్లటం ద్వారా విత్తనాల్ని ఎక్కువగా కూర్చుకుంటాడు. దేవుని వరాల్ని పంచటంలో నమ్మకంగా ఉండేవారు. అలాగే వృద్ది చెందుతారు. ఇవ్వటం ద్వారా వారు తమ దీవెనల్ని వృద్ధి చేసుకుంటారు. వారు ఇస్తూనే ఉండేందుకు దేవుడు వారికి సమృద్ధిని వాగ్దానం చేస్తున్నాడు. “ఇయ్యుడి, అప్పుడు మీకియ్యబడను, అణచి, కుదించి, దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు.” లూకా 6:38. COLTel 61.3

విత్తటం పంట కొయ్యటంలో ఇంతకన్నా ఎక్కువే ఉంది. దేవుడు మనకిచ్చిన లౌకిక దీవెనల్ని ఇతరులికి పంచినప్పుడు మన ప్రేమ సానుభూతి నిదర్శనం లబ్దిదారుడిలో దేవుని ప్ల కృతజ్ఞతా స్వభావంప ఉట్టించి ఆయనకు వందనాలు చెల్లింపజేస్తుంది. హృదయమనే నేలను ఆధ్యాత్మిక సత్య విత్తనాల్ని స్వీకరించటానికి సిద్ధం చేస్తుంది. విత్తువాడికి విత్తనాలిచ్చే ప్రభువు విత్తనం మొలకెత్తేటట్లు నిత్య జీవానికి పంట పండేటట్లు చేస్తాడు. COLTel 62.1

నేలలో విత్తనం చల్లే ప్రక్రియ ద్వారా క్రీస్తు మనకు విమోచన కూర్చే నిమిత్తం తాను చేసిన త్యాగాన్ని సూచిస్తున్నాడు. ఆయన ఇలా అంటున్నాడు. “గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన యెడల అది ఒంటిగానే యుండును. అది చచ్చిన యెడల విస్తారముగా ఫలించును” యోహా 12:24 అలాగే క్రీస్తు మరణం దేవుని రాజ్యం కోసం పంట పండుతుంది. పండని ప్రపంచ నిబంధన ప్రకారం ఆయన మరణం, ఫలితం, జీవం. COLTel 62.2

క్రీస్తు పనివారుగా ఫలాలు ఫలించాలని కోరుకునే వారందరు మొదటిగా నేలలో పడి మరణించాలి. జీవితంలో లోకావసరం బాటలో పడాలి. స్వార్ద ప్రేమ స్వార్ధాశక్తి నశించాలి. స్వయం త్యాగ నిబంధన స్వయం రక్షణ నిబంధన. నేలలో నాటిన విత్తనం ఫలం ఉత్పత్తి చేస్తుంది. అది మళ్ళీ నాటబడుతుంది. ఇలా పంట వృద్ధి అవుతుంది. వ్యవసాయదారుడు తన ధాన్యాన్ని నేలలో పడెయ్యటం ద్వారా దాన్ని భద్రపర్చుకుంటాడు. అలాగే మానవ జీవితంలో ఇవ్వడం జీవించడం దైవ సేవకు మానవ సేవకు అర్పితమైన జీవితం రక్షిత జీవితం. క్రీస్తు కోసం తమ ప్రాణాన్ని త్యాగం చేసేవారు దాన్ని నిత్య జీవానికి భద్రపర్చుకుంటారు. COLTel 62.3

నూతన జీవము మొలకెత్తటానికి విత్తనం మరణిస్తుంది. ఇందులో మనకు పునరుత్థానాన్ని గూర్చిన పాఠం ఉంది. దేవున్ని ప్రేమించే వారందరు పరలోక ఏదెనులో మరల నివసిస్తారు. సమాధిలో కుళ్ళిపోయే మానవ శరీరం గురించి దేవుడిలా అంటున్నాడు. “శరరీరము క్షయమైనదిగా విత్తబడి అక్ష్యమైనదిగా లేపడబడును. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును. బలహీనమైనదిగా విత్తబడి, బలమైనదిగా లేపబడును”. 1 కొరి 15:42,43 COLTel 62.4

ప్రకృతి తాలూకు సజీవ ఉపమానమైన విత్తువాడు. విత్తనం ఉపమానం బోధించే అనేక పాఠాల్లో కొన్ని ఇలాంటివి. తల్లితండ్రులు, ఉపాధ్యాయులు ఈ పాఠాలు నేర్పటానికి ప్రయత్నించేటప్పుడు ఆ పనిని ప్రయోగాత్మకం చెయ్యాలి. పిల్లల్నే నేలను సిద్ధం చేసి విత్తనాలు చల్లనివ్వండి. వారు పని చేస్తుండగా తల్లితండ్రులు లేక ఉపాధ్యాయులు హృదయమనే తోటను గురించి మంచి చెడ్డ విత్తనాల్ని గురించి విపులంచేసి సత్య విత్తనం నాటటానికి హృదయాన్ని సిద్ధం చేయాలని నేర్పించాలి. పిల్లలు విత్తనాల్ని నాటేటప్పుడు వారికి క్రీస్తు మరణం గురించి నేర్పించవచ్చు. విత్తనాలికి మొలక వచ్చినప్పుడు పునరుత్థాన సత్యాన్ని గూర్చిన పాఠం వారికి బోధించవచ్చు. మొక్కలు పెరుగుతున్నప్పుడు స్వాభావిక విత్తటానికి ఆధ్మాత్మిక విత్తటానికి మధ్య ఉన్న సారూపకతను కొనసాగించవచ్చు. COLTel 63.1

యువతకూ ఇదే విధంగా నేర్పించాలి. వారికి నేల దున్నటం నేర్పాలి. సేద్యం చెయ్యటానికి ప్రతి పాఠశాలకు అనుబంధంగా కొంత నేల ఉండ టం మంచిది. అలాంటి భూముల్ని దేవుని పాఠశాల గదులుగా పరిగణించలి. ప్రకృతి సంగతులన్ని పఠించాల్సిన వాచకంగా దేవుని బిడ్డలు పరిగణించాలి. దాని నుండి ఆత్మకు సంబంధించిన జ్ఞానాన్ని సంస్కృతిని వారు పొందవచ్చు. COLTel 63.2

నేలను దున్నటం, నేలను బాగుపర్చి అదుపులో ఉంచటంలో పాఠాలు నిత్యం నేర్చుకోవచ్చు. బీడు భూమిని ఎంపిక చేసుకొని అది వెంటనే ఫలసాయం ఇవ్వాలని ఎవరు కనిపెట్టరు విత్తనం విత్తకముందు నేలను సిద్ధం చేసే కృషిలో పట్టుదల, శ్రద్ధ, ఓర్పుతో కూడిన శ్రమ చేయాల్సి ఉంటుంది. మానవ హృదయంలో ఆధ్యాత్మిక కృషి ఈ విధంగానే ఉ ంటుంది. నేల దున్నటం వల్ల ఉపకారం పొందే వారు తమ హృదయంలోని దైవ వాక్యంతో ముందుకు పోవాలి. హృదయపు బీడు భూమిని పరిశు ద్దాత్మ దున్ని మొత్తబర్చి, సిద్ధం చేసే ప్రభావాన్ని ప్రసరిస్తున్నట్లు వారు కనుగొంటారు. నేలను కఠిన శ్రమతో సిద్ధం చెయ్యకపోతే అది పంట పండదు. అలాగే హృదయం కూడా హృదయం దేవున్ని మహిమపర్చే ఫలాలు ఫలించక ముందు పరిశుద్దాత్మ దాన్ని నిర్మలం చేసి క్రమశిక్షణలో పెట్టడం జరగాలి. COLTel 63.3

ఆషామాషీగా పనిచేసినప్పుడు నేల దాని సామర్ధ్యం మేరకు పంటనివ్వదు. దాని పై ఆలోచనతో కూడిన దినవారీశ్రద్ధ అవసరం. నాటిని మంచి విత్తనం నుంచి పోషణను హరించే కలుపు మొక్కల్ని దూరంగా ఉంచేందుకు నేలను తరుచుగాను లోతుగాను దున్నాలి. దున్ని విత్తేవారు పంటకు ఈవిధంగా సిద్ధపడతారు. తమ పొలంలో ఎవరు భగ్నమైన తమ ఆశలు నీరీక్షణల శిధిలాల నడుమ నిలవవలసిన అవసరం లేదు. COLTel 64.1

ప్రకృతి నుంచి ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకుంటూ ఎవరు తమ భూమిని ఈ రకంగా సాగు చేసుకుంటారో వారికి దేవుని ఆశీర్వాదాలుంటాయి. నేలను సాగు చేయడంలో ఎంత గొప్ప భాగ్యం తన ముందున్నదేదో వ్యవసాయదారుడు ఎరుగడు. అనుభవం సంపాదించిన వారి నుండి వివేకం గలవారు అందించగల సమాచారం నుంచి సంపాదించగల ఉపదేశాన్ని తృణీకరించకుండల్సి ఉండగా, అతడు స్వతహాగా తనకు తాను పాఠాలు పోగు చేసుకోవాలి. ఇది అతడి శిక్షణలో ఒక భాగం. నేలను సేద్యం చేయడం ఆత్మకు విద్యను వికాసాన్ని సమకూర్చుతుంది. COLTel 64.2

విత్తనం మొలకెత్తేటట్లు చేసేవాడు. దాన్ని రాత్రింబగళ్ళు జాగ్రత్తగా కాపాడేవాడు. అది పెరిగి వృద్ధి చెందటానికి శక్తినిచ్చేవాడు మనల్ని సృజించన పరలోక ప్రభువే. తన బిడ్డల పట్ల ఇంకా ఎక్కువ శ్రద్ధ అసక్తి అయనకున్నాయి. విత్తనం విత్తే మనుషుడు మన ఐహిక జీవితాన్ని సాగించటానికి విత్తుతుంటే పరలోక సంబంధి అయిన విత్తువాడు నిత్య జీవం జీవించటానికి పంటనిచ్చే విత్తనాన్ని ఆత్మలో నాటుతాడు. COLTel 64.3