యుగయుగాల ఆకాంక్ష

53/88

52—దివ్యకాపరి

“నేను గొట్టెలకు మంచికాపరిని, మంచికాపరి గొట్టెల కొరకు తన ప్రాణమును పెట్టును. ” “నేను గొట్టెలకు మంచికాపరిని. తండ్రి నన్ను ఏలాగు ఎరుగునో నేను తండ్రిని ఏలాగు ఎరుగుదునో ఆలాగే నేను నా గొట్టెలను ఎరుగుదును. నా గొట్టెలు నన్ను ఎరుగును. మరియు గొట్టెలకొరకు నా ప్రాణమును పెట్టుచున్నాను.” DATel 532.1

తన శ్రోతలకు సుపరిచితమైన సంబంధాల ద్వారా యేసు మళ్లీ వారి మనసుల్ని ఆకట్టుకోగలిగాడు. ఆత్మ సంబంధమైన ప్రభావాన్ని సేద దీర్చే చల్లని నీటితో సరిపోల్చాడు. ప్రకృతికి మానవునికి సంతోషానందాలు కూర్చే వెలుగును తానేనని ఆయన సూచించాడు. తనను విశ్వసించే వారితో తన సంబంధాన్ని, ఇప్పుడు చక్కని గ్రామీణ జీవితానికి సంబంధించిన దృశ్యంతో సరిపోల్చుతున్నాడు. ఈ దృశ్యం తన శ్రోతలకు సుపరిచితమైంది. యేసు మాటలు ఆ దృశ్యాన్ని ఆయనతో నిరంతరంగా అనుసంధాన పర్చాయి. కాపరులు మందల్ని కోయటాన్ని పరిగణించినప్పుడు రక్షకుడు బోధించిన ఈ పాఠం శిష్యునికి గుర్తుకు వచ్చేది. నమ్మకమైన ప్రతీకాపరిలో శిష్యులు క్రీస్తుని చూశారు. ప్రతీ నిస్సహాయ, బరహీన మందలో వారు తమ్మును తామ చూసుకున్నారు. DATel 532.2

ఓదార్పునిచ్చే ఈ మాటల్లో యెషయా ప్రవక్త ఈ సంకేతాన్ని మెస్సీయా పరిచర్యకు వర్తింపజేస్తోన్నాడు, “సీయోనూ, సువార్త ప్రకటించుచున్నదానా, ఉన్నత పర్వతము ఎక్కుము. యోరూషలేమూ, సువార్త ప్రకటించుచున్నదానా బలముగా ప్రకటించుము. భయపడక ప్రకటింపుము... గొట్టెల కాపరివలె ఆయన తనమందను మేపును. తన బాహువుతో గొట్టిపిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును.” యెషయా 40:9-11. “యెహోవా నా కాపరి నాకు లేమి కలుగుదు.” అంటూ దావీదు గానం చేశాడు. కీర్తనలు 23:1. యెహెజ్కేలు నోట పరిశుద్దాత్మ ఇలా ప్రకటించాడు: “వాటిని మేపుటకు నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమించెదను.” “తప్పి పోయిన దానిని నేను వెదకుదును, తోలివేసిన దానిని మరల తోలుకొని వచ్చెదను, గాయపడిన దానిని కట్టు కట్టుదును. దుర్బలముగా ఉన్న దానిని బలపరచుదును.” “నేను వారితో సమాధానార్థ నిబంధన చేయుదును.” “ఇక వారు అన్యజనులకు దోపుడు సొమ్ముగా ఉండరు . . . ఎవరి వలనను భయము లేకుండ వీరు సురక్షితముగా నివసించెదరు.” యెహె 34:23, 16, 25, 28. DATel 532.3

క్రీస్తు ఈ ప్రవచనాల్ని తనకు అనువర్తించుకుంటూ తన ప్రవర్తనకు ఇశ్రాయేలు నాయకుల ప్రవర్తనకు మధ్యగల వ్యత్యాసాన్ని ఎత్తి చూపాడు. పరిసయ్యులు మందలో నుంచి ఒక వ్యక్తిని తరిమివేశారు. క్రీస్తు శక్తిని గురించి సాక్షమివ్వడమే అతడు చేసిన నేరం. యధార్థ కాపరి తన వద్దకు ఆకర్షించుకొంటున్న ఒక ఆత్మను వారు తొలగించి వేశారు. ఇలా చేయడం • ద్వారా వారు తమకు నియుక్తమైన కర్తవ్యమేంటో గ్రహించలేదని మందను కాసే కాపరులుగా తమపై పెట్టుకున్న నమ్మకానికి అనర్హులమని నిరూపించుకున్నారు. మంచి కాపరికి తమకు మధ్యగల భేదాన్ని యేసు వారి ముందుంచి ప్రభువు మందకు నిజమైన కాపరిని తానేనని సూచించాడు. దీనికి ముందు మరో సంకేతం కింద తన్ను తాను ప్రకటించుకున్నాడు. DATel 533.1

ఆయన ఇలా అన్నాడు, “గొట్టెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకొనువాడునైయున్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొట్టెలకాపరి”. ఈ మాటలు తమకు వ్యతిరేకంగా పలికిన మాటలని పరిసయ్యులు గ్రహించలేదు. వాటి భావమేంటా అని వారు లోలోన తర్జన భర్జన చేస్తున్నప్పుడు యేసు వారికి ఇలా స్వషంగా వివరించాడు, “నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైన లోపల ప్రవేశించిన యెడల వాడు రక్షింపబడినవాడై లోనికిపోవును, బయటికి వచ్చును, మేత మేయుచునుండును. దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును, గాని మరిదేనికి రాడు. గొట్టెలకు జీవము కలుగజేయుటకు అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితిని.” DATel 533.2

దేవుని మందకు ద్వారం క్రీస్తే. పూర్వకాలం నుంచి దేవుని పిల్లలందరు ఈ ద్వారంలో నుంచే లోపలికి వచ్చారు. ముంగురుల్లోనూ ఛాయారూపకాల్లోనూ ప్రదర్శితమైనట్లు, ప్రవక్తల ప్రత్యక్షతలో ప్రకటితమైనట్లు, తన శిష్యులికి బోధించిన పాఠాల్లో వెల్లడైనట్లు, మనుషుల నిమిత్తం ఆయన చేసిన అద్భుతకార్యల్లో “లోక పాపమును మోసికొనిపోవు దేవుని గొట్టె పిల్ల”ని (యోహా 1:29) వారు వీక్షించారు. ఆయన ద్వారా వారు ఆయన కృప పరిధిలోకి వస్తున్నారు. అనేకులు లోక సంబంధమైన విశ్వాసం సమర్పిస్తూ వస్తున్నారు. దైవ ప్రసన్నతను పొంది ఆయన మంద లోకి ప్రవేశం సంపాదించడానికి ఆచార కర్మల్ని పద్ధతుల్ని రూపొందించుకుంటున్నారు. కాని క్రీస్తు ఒక్కడే మార్గం. క్రీస్తు స్థానాన్ని తీసుకోడానికి ప్రయత్నించే వారందరు, మందలోకి వేరే మార్గాన ప్రవేశించడానికి ప్రయత్నించే వారందరు దొంగలు, దోపిడీదారులు. DATel 534.1

పరిసయ్యులు ద్వారం గుండా ప్రవేశించలేదు. క్రీస్తు ద్వారా గాక వేరే విధంగా మందలోకి ప్రవేశించారు. అందుకే వారు నిజమైన కాపరిగా సేవచెయ్యడంలేదు. యాజకులు, అధికారులు, శాస్త్రులు, పరిసయ్యులు పచ్చిక • బయళ్లను ధ్వంసం చేసి జీవజలాల్ని కలుషితం చేశారు. ఆ అబద్ద కాపరుల్ని పరిశుద్ధ వాక్యం ఈ విధంగా వర్ణిస్తోంది. “బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగము గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటికి కట్టుకట్టరు, తోలి వేసిన వాటిని మరల తోలుకొని రారు. తప్పిపోయిన వాటిని వెదకరు, అది మాత్రమే గాక మీరు కఠిన మనస్కులై బలాత్కారముతో వాటిని ఏలుదురు” యెహే 34:4. DATel 534.2

ఆత్మ ఆధ్యాత్మిక అవసరాన్ని తృప్తి పర్చడానికి అన్ని యుగాల్లోను తత్వవేత్తలు, బోధకులు లోకానికి సిద్ధాంతాల్ని సమర్పిస్తోన్నారు. ప్రతీ అన్యజాతికీ గొప్ప ప్రబోధకులున్నారు. మత వ్యవస్థలున్నాయి. క్రీస్తు ద్వారా గాక వేరే రక్షణ మార్గాన్ని ఈ వ్యవస్థలు ప్రతిపాదిస్తోన్నాయి. మనుషుల దృష్టిని తండ్రి మీద నుంచి మళ్లించి తమకు మేళ్లు మాత్రమే ఇస్తున్న ఆ తండ్రి పట్ల వారి మనసుల్ని భయంతో నింపుతున్నాయి. సృష్టి మూలంగా, రక్షణ మూలంగా దేవునికి చెందిన దాన్ని దోచుకోడమే వారి కృషి లక్ష్యం. ఈ అబద్ధ బోధకులు మనుషుల్ని కూడా దోచుకుంటారు. ఈ తప్పుడు మతాలు కోట్ల ప్రజల్ని బంధించివేస్తోన్నాయి. వారు భయానికి, ఉదాసీనతకు బందీలై భవిష్యత్తుని గూర్చిన భయంతో జంతువుల్లాగ భారం మోస్తూ నిరీక్షణగాని, సంతోషంగాని, ఆకాంక్షగాని లేకుండా నివసిస్తున్నారు. దైవ కృపతో నిండిన సువార్త మాత్రమే ఆత్మను పైకి లేపగలదు. కుమారుడిలో ప్రదర్శితమైన దైవప్రేమ ధ్యానం హృదయాన్ని కదిలిస్తుంది, ఆత్మ శక్తుల్ని మేలుకొల్పుతుంది. ఈ కార్యం మరి దేనివల్లా సాధ్యం కాదు, మానవుడిలో దేవుని స్వరూపాన్ని తిరిగి సృష్టించడానికి క్రీస్తు వచ్చాడు. మనుషుల్ని క్రీస్తుకి ఏ వ్యక్తి దూరం చేస్తాడో అతడు యధార్థ అభివృద్ధికి మూలం నుంచి మనుషుల్ని దూరం చేస్తున్నవాడవుతాడు. జీవితంలో నిరీక్షణను, గురిని మహిమను పొందకుండా వారిని దోచుకుంటున్నవాడవుతాడు. అతడు దొంగ, దోపిడీదారుడు. DATel 534.3

“ద్వారమున ప్రవేశించువాడు గొట్టెలకాపరి.” క్రీస్తే ద్వారమూ కాపరి కూడా. ఆయన సొంతంగా ప్రవేశిస్తాడు. సొంత త్యాగం ద్వారా ఆయన గొట్టెలకు కాపరి అయ్యాడు. “అతనికి ద్వారపాలకుడు తలుపుతీయును, గొట్టెలు అతని స్వరము వినును, అతడు తన సొంత గొట్టెలను పేరుపెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొట్టెలన్నిటిని వెలుపలికి నడిపించునపుడెల్ల వాటికి ముందుగా నడుచును, గొట్టెలు అతని స్వరమెరుగును గనుక అవి అతని వెంబడించును.” DATel 535.1

జీవులన్నిటిలో గొర్రె మిక్కిలి పిరికిది. సహాయం లేకుండా జీవింటచలేనిది. తూర్పు దేశాల్లో కాపరులు తమ మందల్ని ఎంతో శ్రద్ధగా నిర్విరామంగా కాస్తూ కాపాడుతూ ఉంటారు. నేడు పట్టణాల్లోలాగ పూర్వం ప్రాకారాలు గల పట్టణాల వెలపల భద్రత ఉండేది కాదు. సరిహద్దుల్లో సంచరించే బందిపోట్లు కొండజాతులు, లేదా బండల నడుమ పొంచి ఉండే క్రూరమృగాలు మందను దోచుకోడానికి వేచి ఉండేవి. కాపరి తన ప్రాణాన్ని పణంగా పెట్టి తన మందను కాసేవాడు. యాకోబు లాబాను మందల్ని హారాను పచ్చిక భూముల్లో మేపుతున్నప్పుడు తాను చేసిన శ్రమను వర్ణిస్తూ ఇలా అన్నాడు, “పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని, నిద్ర నా కన్నులకు దూరమాయెను” ఆది 31:40. తండ్రి గొర్రెల్ని కాస్తున్నప్పుడు బాలుడైన దావీదు ఒంటరిగా సింహం నోటి నుంచి ఎలుగుబంటి నోటినుంచి గొర్రె పిల్లల్ని రక్షించాడు. DATel 535.2

కొండల మీద నుంచి, అడవుల్లో నుంచి లోయల్లో నుంచి నది పక్కనున్న గడ్డిమైదానంలోకి కాపరి మందను నడిపిస్తాడు. కొండలపై రాత్రిలో ఒంటరిగా దొంగల నుంచి గొర్రెల్ని కాపాడూ, జబ్బుగా ఉన్న వాటిని బలహీనమైన వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ కావలికాసే కాపరి జీవితం ఆ మూగ జీవుల జీవంతో మమేకమై ఉంటుంది. తాను ఎంతో శ్రద్దగా చూసుకుంటున్న మందతో అతడికి బలీయమైన అనుబంధం ఏర్పడుతుంది, మంద ఎంత పెద్దదైనా కాపరికి ప్రతీ గొర్రె తెలుసు, ప్రతీ గొర్రెకూ దాని దాని పేరుంటుంది, కాపరి పేరు పెట్టి పిలిచినప్పుడు ప్రతీ గొర్రె ప్రతిస్పందిస్తుంది. DATel 536.1

లోక సంబంధమైన కాపరి తన గొర్రెల్ని ఎరిగినట్లే దివ్వకాపరి లోకమంతా చెదిరి ఉన్న తనమందను ఎరిగి ఉంటాడు. “నా గొట్టెలును నేను మేపుచున్న గొట్టెలునగు వారు మనుష్యులు నేను మీకు దేవుడను, ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. పేరు పెట్టి నిన్ను పిలిచియున్నాను నీవు నా సొత్తు” అంటున్నాడు యేసు. “చూడుము నాయరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను.” యెహె 34:3, యెష 43:1, 49:1 DATel 536.2

యేసుకి మనం వ్యక్తిగతంగా తెలుసు. మన బలహీనతల్ని చూసి ఆయన బాధపడ్డాడు. ఆయన మనందరిని పేరు పేరున ఎరుగును. మనం నివసిస్తున్న ఇల్లు, అందులోని ప్రతి వ్యక్తి పేరు ఆయనకు తెలుసు. కొన్ని సందర్భాల్లో ఒకానొక నగరంలో పలాన వీధిలో పలానా ఇంట్లో తన గొర్రెల్లో ఒకదాన్ని కలవమని ఆయన సూచనలిస్తాడు. DATel 536.3

ఆ ఒక్కడి కోసమే తాను మరణించానన్నట్లు యేసు ప్రతీ ఆత్మనూ సంపూర్తిగా ఎరుగును. దుఃఖంలో ఉన్న ప్రతీవారిని చూసి, ఆయన నొచ్చుకుంటాడు. సహాయం కోరే ప్రతీ గొంతు ఆయనకు వినిపిస్తుంది. మనుషులందరినీ తన వద్దకు చేర్చుకోడానికే ఆయన వచ్చాడు. “నను’ వెంబడించుము” అని వారిని ఆయన ఆదేశిస్తాడు. ఆయన ఆత్మ వారిని ఆకర్షించి ఆయన వద్దకు నడిపిస్తాడు. అనేకులు ఆ ఆకర్షణను తోసిపుచ్చుతారు. యేసుకు వారెవరో తెలుసు. తన పిలుపును విని ఎవరు సంతోషంగా తన రక్షణను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారో ఆయనకు తెలుసు. ఆయన ఇలా అంటున్నాడు. “నా గొట్టెలు నా స్వరము వినును. నేను వాటి నేరుగుదును. అవి నన్ను వెంబడించును” వాటిలోని ప్రతీదాన్ని ఆయన ప్రేమిస్తాడు, లోకంలో ఇంకొక్కటి లేదన్నట్టుగా ప్రేమిస్తాడు. “అతడు తన సొంత గొట్టెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును..... గొట్టెలు అతని స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబడించును.” తూర్పుదేశాల గొర్రెల కాపరి తన గొర్రెల్ని తోలడు బలప్రయోగంమీద భయపెట్టడం మిద అతడు ఆధారపడడు. అతడు గొర్రెలికి ముందు నడుస్తూ వాటిని పిలుస్తాడు. అతడి స్వరం వాటికి తెలుసు గనుక ఆ తణ్ని వెంబడిస్తాయి. “మోషే అహరోనుల చేత నీ ప్రజలను మందవలె నడిపించితివి” అని లేఖనం అంటున్నది, ప్రవక్త పరిముఖంగా యేసు ఇలా అంటోన్నాడు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ యెడల కృప “ఒకడు మనుష్యులను తోడుకొని పోవునట్లుగా స్నేహ బంధములతో నేను వారిని బంధించి ఆకర్షించితిని” అంటున్నాడాయన. కీర్త 77:20, యిర్మీ 31:3, హో షేయ 11:4. DATel 536.4

క్రీస్తు శిష్యులికి ఆయన్ని వెంబడించేందుకు స్ఫూర్తినిచ్చేది శిక్షను గూర్చిన భయంగాని నిత్య బహుమానాన్ని గూర్చిన నిరీక్షణగాని కాదు, బెల్లె హేము పశువులతొట్టె నుంచి కల్వరి సిలువ వరకు తన భూలోక యాత్రలో ఆయన ప్రదర్శించిన అపూర్వ ప్రేమను వారు వీక్షిస్తారు. ఆ దృష్టి ఆత్మను మెత్తబర్చుతుంది. ఆత్మ ఆయనకు లొంగుతుంది. ఆయన్ని వీక్షించే వారి మనసులో ప్రేమ నిద్రలేస్తుంది. వారు ఆయన స్వరం వింటారు. ఆయన్ని వెంబడిస్తారు. DATel 537.1

మార్గంలో పొంచి ఉన్న అపాయాన్ని ముందు తానే ఎదుర్కొంటూ కాపరి తన గొర్రెలకు ముందు ఎలా నడిచి వెళ్తాడో అలాగే యేసు తనవారి విషయంలో వ్యవహరిస్తాడు. “అతడు తన సొంత గొట్టెలన్నిటిని వెలుపలికి నడిపించునపుడెల్ల వాటికి ముందుగా నడుచును.” పరలోక మార్గం రక్షకుని అడుగు జాడలతో ముద్రాంకితమయ్యింది, మార్గం నిట్రమైంది, పిట్ట పల్లాలతో నిండింది కావచ్చు. మార్గం మనకు సుగమం చెయ్యడానికి ఆయన పాదాలు కరకు ముళ్లను అణగదొక్కేశాయి. మనం మోయాల్సి ఉన్న ప్రతీ భారాన్ని ఆయన మోశాడు. DATel 537.2

ఇప్పుడు ఆయన పరలోకంలో దేవుని సముఖంలో ఉంటూ ఆయనతో విశ్వసింహాసనంపై కూర్చున్నప్పటికీ ఆయన దయా స్వభావం ఏ మాత్రం మారలేదు. నేడు మానవాళి శ్రమలు బాధల విషయంలో ఆయన హృదయం దయ, కనికరాల్తో నిండుతుంది. నేడు లోకంలో ఉన్న తనవారిని మరింత ఆశీర్వాదించేందుకు గాయాలు పొందిన తన హస్తాన్ని ఆయన చాపాడు. “అవి ఎన్నటికిని నశింపవు, ఎవడును నా చేతిలో నుండి అపహరింపడు.” తన్ను తాను క్రీస్తుకి సమర్పించుకున్న ఆత్మ ఆయన పరిగణనలో ఎంతో విలువ గలది. ఒకడు తన రాజ్యంలో ప్రవేశించేందుకు రక్షకుడు కల్వరి వేదనను అనుభవించాడు. తాను ఏ మానవుల కోసం మరణించాడో వారిలో ఒక వ్యక్తిని సైతం ఆయన విడనాడడు. తన అనుచరులే ఆయనను విడిచి పెడితే తప్ప వారిని ఆయన గట్టిగా పట్టుకొంటాడు. DATel 538.1

మన శ్రమలన్నిటిలోను మనల్ని ఎన్నడూ విడిచిపెట్టని సహాయకుడు మనకున్నాడు. శోధనలతో పోరాడడానికి, దుర్మార్గంతో పోరు స్వల్పడానికి చివరగా భారాలతో దుఃఖంతో నలిగిపోవడానికి ఆయన మనల్ని ఒంటరిగా విడిచిపెట్టడు. మానవ నేత్రానికి ఇప్పుడాయన కనిపించక పోయినా, నేను నీతో ఉన్నాను అంటూ పలుకుతున్న ఆయన స్వరాన్ని విశ్వాసపు చెవి వినగలుగుతుంది. ” నేను మొదటి వాడను, కడపటివాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనైయున్నాను” ప్రకటన 28:18. నేను నా దుఃఖాలు భరించాను. మీ శ్రమలు అనుభవించాను. మీ శోధనల్ని ఎదుర్కొన్నాను. నా కన్నీళ్లను నేనెరుగుదును. నేను కూడా ఏడ్చాను. ఏ మానవుడికీ చెప్పుకోలేని దుఃఖాలేంటో నాకు తెలుసు. మేము దిక్కుమాలిన వారమని తృణీకరించబడ్డవారమని వారు అనుకోవద్దు. మీ బాధకు మానవులెవ్వరూ స్పందించకపోయినా నా వంక చూసి జీవించండి, “పర్వతములు తొలగిపోయినను మెట్టలు దత్తరిల్నినను నా కృప నిన్ను విడిచిపోదు. సమాధానమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు.” యెష 54:10. DATel 538.2

ఒక కాపరి తన గొర్రెల్ని ఎంతగా ప్రేమించినా అతడు తన కుమారుల్ని కుమార్తెల్ని ఇంకా ఎక్కువ ప్రేమిస్తాడు. యేసు మన కాపరి మాత్రమే కాదు. ఆయన మన “నిత్యుడైన తండ్రి.” ఆయన ఇలా అంటున్నాడు, “తండ్రి నన్ను ఏలాగున ఎరుగునో నేను తండ్రిని ఏలాగు ఎరుగుదునో ఆలాగే నేను నా గొట్టెలను ఎరుగుదును, నా గొట్టెలు నన్ను ఎరుగును.” యెహా 10:14, 15. ఇది ఎంత గొప్ప మాట! - తండ్రి రొమ్మున ఉన్నవాడు, “నా సహకారి” అని దేవుడన్నవాడు (జెక 13:7) ఆయిన అద్వితీయ కుమారుడికి నిత్యుడైన దేవునికి మధ్య గల సహవాసం మనకు ఆయనకు మధ్య ఉండే సహవాసానికి సూచిక !. DATel 539.1

మనం ఆయన తండ్రి ఇచ్చిన బహుమానం, ఆయన కార్యానికి ప్రతిఫలం అయినందువల్ల యేసు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మనల్ని తన బిడ్డలుగా ప్రేమిస్తున్నాడు, పాఠక మహాశయా ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఇంతకన్నా మెరుగైన వరం దేవుడు ఇవ్వలేదు. కనుక నమ్మండి. తాను మేపే గొర్రెలుగా ఎవర్ని పోగుచెయ్యాలని ఆయన ఆశించాడో వారు తోడేళ్ల మధ్య చెదిరిపోయి ఉన్నారు. వారిని గురించి ఆయన ఇలా అన్నాడు, “ఈ దొడ్డివి కాని వేరే గొట్టెలును నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలెను, అవి నా స్వరము వినును అప్పుడు మంద ఒక్కటియు గొట్టెల కాపరి ఒక్కడును అగును.” యెహా 10:16. DATel 539.2

“నేను దాని మరల తీసుకొనునట్లు నా ప్రాణమును పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు:” అంటే, నా తండ్రి మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే మిమ్మల్ని రక్షించడానికి నా ప్రాణం ఇచ్చినందుకు నన్ను ఇంకా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. నా ప్రాణాన్ని సమర్పించడం ద్వారా మీ లోటు పాట్లను అతిక్రమాన్ని నా మీద వేసుకుని మీకు ప్రత్యామ్నాయం, వకy అవ్వడంలో నేను నా తండ్రికి ప్రీతి పాత్రుణ్ణయ్యాను. DATel 539.3

“ఎవడును నా ప్రాణము తీసికొనడు, నా అంతట నేను దాని పెట్టుచున్నాను, దాని పెట్టుటకు నాకు అధి కారము, దాని తిరిగి తీసికొనుటకును నాకు అధికారము కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిని. ” మానవ కుటుంబ సభ్యుడుగా మర్త్యుడైనా, దేవుడుగా ఆయన లోకానికి జీవపు ఊట. ఆయన మరణాన్ని ఎదిరించి దాని ప్రాబల్యానికి లొంగకుండా ఉండేవాడే. కాని జీవాన్ని అమర్యతను వెలుగులోకి తెచ్చేందుకుగాను ఆయన స్వచ్ఛందంగా తన ప్రాణాన్ని అర్పించాడు. లోక పాపాన్ని భరించాడు, దాని శాపాన్ని అనుభవించాడు. మానవులు నిత్య మరణానికి ఆహుతి కాకుండేందుకు తన్నుతాను బలిగా అర్పించుకున్నాడు. “నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను .... మన యతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్ధమైన శిక్ష అతని మిద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొట్టెలవలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతి వాడును తన కిష్టమైన త్రోవకు తొలిగితిమి యెహోవా మనయందరి దోషము అతని మీద మోపెను.” యెష 53:4-6. DATel 539.4