యుగయుగాల ఆకాంక్ష

2/88

1—“దేవుడు మనకు తోడు”

“ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు” “దేవుడు మనకు తోడు” అని దాని అర్ధం. “దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము క్రీస్తుయేసు నందు వెల్లడి” చేశాడు. అనాదికాలం నుంచి యేసుక్రీస్తు ప్రభువు తండ్రితో ఒకడై ఉన్నాడు. ఆయన దేవుని స్వరూపి. గొప్పతనంలోను గౌరవంలోను ఆయన తండ్రితో సమానుడు. “ఆయనే తండ్రి మహిమ ప్రకాశత” ఈ మహిమ ప్రదర్శించటానికే ఆయన మన లోకానికి వచ్చాడు. దేవుడుగా మనతో ఉండటానికి వచ్చాడు. అందుచేత “ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు” అని ఆయనను గూర్చి ప్రవచనం చెబుతోంది. DATel 1.1

మనతో నివసించటానికి రావటంచేత యేసు మానవులకు దేవదూతలకు దేవున్ని బయలుపర్చాల్సి ఉన్నాడు. క్రీస్తు దేవుని వాక్యం. క్రీస్తు దేవుని తలంపులకు స్వరం. తన శిష్యులకోసం చేసిన ప్రార్ధనలో ఇలా అన్నాడు, నీవు నన్ను ఎలాంటి ప్రేమతో ప్రేమించావో ఆ ప్రేమ వారిలో ఉండేందుకు “కనికరము, దయ, దీర్ఘశాంతము విస్తారమైన కృపాసత్యములు గల నీనామమును వారికి తెలియజేసితిని.” ఈ ప్రత్యక్షత కేవలం తన ఇహలోక ప్రజల కోసమే ఇచ్చింది కాదు. మన ఈ చిన్నలోకం విశ్వానికి పాఠ్య పుస్తకం. దేవుని అద్భుతమైన కృప ఉద్దేశం, అనగా విమోచన ప్రేమ మర్మం, “దేవదూతలు పరిశీలించటానికి” ఆకాంక్షించే అంశం. అది వారు అనంతకాలమంతా అధ్యయనం చేసే అంశం. కాగా పాపంలో పడకుండ ఉన్న ప్రజలు క్రీస్తు సిలువలో తమ విజ్ఞానశాస్త్రాన్ని తమ కీర్తనను కనుగొంటారు. క్రీస్తు ముఖంలో ప్రకాశించే ప్రభావం ఆత్మార్పణ చేసే ప్రేమ DATel 1.2

తాలూకు మహిమ. కల్వరి వెలుగులో ఆత్మ నిరసన ప్రేమ సూత్రమే ఇహపరలోకాల నియమమని “స్వప్రయోజనమును విచారించుకొనని” ప్రేమకు నిలయం దేవుని హృదయమని, సాత్వికుడు నిరాడంబరుడు అయిన ఆ ప్రభువులో ఏమానవుడూ సమిపించలేని వెలుగులో నివసించే దేవుని ప్రవర్తన ప్రదర్శిత మయ్యిందని గ్రహిస్తారు. DATel 2.1

ఆదిలో సృష్టి కార్యాలన్నిటిలో దేవుడు బహిర్గతమయ్యాడు. ఆకాశ విశాలన్ని చేసి భూమికి పునాదులు వేసింది క్రీస్తే. అంతరిక్షంలో లోకాల్ని నిలిపి ఉంచింది, భూమిపై కనిపించే పుష్పాల్ని రూపుదిద్దింది ఆయన హస్తమే. “తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే” (సముద్రము ఆయనది ఆయన దాని కలుగజేసెను” కీర్తనలు 65:6; 95:5. భూమిని ప్రకృతి సొగసులతోను గాలిని పక్షుల పాటలతోను నింపింది ఆయనే. భూమి పైన గాలిలోను ఆకాశంలోను ఉన్నవాటన్నిటి పైన ఆయన తండ్రి ప్రేమ సందేశాన్ని రాశాడు. DATel 2.2

దేవుని పరిపూర్ణ సృష్టిని పాపం పాడుచేసింది. అయినా ఆయన చేతిరాత చెరిగిపోకుండా నిలిచి ఉంది. ఇప్పుడు సయితం సృజించబడ్డ సమస్తం దేవుని ఔన్నత్యాన్ని మహిమను చాటుతోంది. స్వార్ధహృదయం ఒక్కటి తప్ప తనకోసం తాను నివసించేది సృష్టిలో ఏదీ లేదు. గాలిలో ఎగిరే ప్రతీ పక్షి నేలపై సంచరించే ప్రతీ జంతువు ఇంకో ప్రాణికి సేవ చేస్తూ ఉంటుంది. ప్రతీ చెట్టూ ప్రతీ పొద ప్రాణావసర మూలపదార్థాన్ని ధారబోస్తుంది. అది లేకుండా మనిషి గాని జంతువుగాని జీవించటం అసాధ్యం. ఇక జంతువు, చెట్టు, పొద ఆకు, బతకడానికి మనుషుడు, జంతువు తమతమ విధులు నిర్వహించడం జరుగుతోంది. పువ్వులు సువాసన విరజిమ్ముతాయి. లోకాన్ని ఆనందింపజేయటానికి తమ అందాన్ని ఆవిష్కరిస్తాయి. సూర్యుడు తన వెలుగును ప్రసరించి వేలాది లోకాల్ని ఆనందింపజేస్తాడు. మన సెలయేళ్ళకు ఊటలకు నిలయమైన మహాసముద్రం ప్రతీ దేశం నుంచి ప్రవహించే ఏరుల్ని స్వీకరిస్తుంది. సముద్రం నుంచి పైకెగసే పొగమంచు భూమిని తడపటానికి వర్షధారలుగా పడుతోంది. అది మొక్కలు మొలిచి మొగ్గలు తొడగటానికి దోహదపడుతోంది. DATel 2.3

దేవదూతలు ఇవ్వటం ద్వారానే ఆనందాన్ని పొందుతారు. పడిపోయిన DATel 2.4

ఆత్మలపట్ల ప్రేమ శ్రద్ధాసక్తులు ప్రతినిత్యం కనపర్చుతూ ఆనందిస్తారు. పరలోక నివాసులు మానవుల్ని ప్రేమిస్తారు. చీకటి మయమైన ఈ లోకానికి పరలోకం నుంచి వెలుగును తెస్తారు. నశించిన వారిని క్రీస్తుతో సహవాసం చేయటానికి వారు సున్నితంగా సహనంతో మానవుల స్వభావాల పై పనిచేస్తారు. ఈ సహవాసం వారే అవగాహన చేసుకోలేనంత సన్నిహిత సహవాసమౌతుంది. DATel 3.1

ఈ చిన్నా చితక ప్రదర్శనలనుంచి దృష్టి మరల్చుతూ మనం యేసులో దేవున్ని చూస్తాం. యేసువంక చూస్తూ ఇవ్వటంలోనే మన దేవుని మహిమను మనం గుర్తిస్తాం. క్రీస్తు ఇలా అన్నాడు, “నా అంతట నేనే యేమియు చేయక తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులు మాటలాడుచున్నాను.” “నేను నా మహిమను వెదకుట లేదు.” నన్ను పంపిన వాని మహిమనే వెదకుతున్నాను. యోహాను 8:28;6:57; 8:50; 9:18. ఈ మాటల్లో గొప్ప నియమం నిక్షిప్తమై ఉంది. అది విశ్వానికి జీవన నియమం. క్రీస్తు సమస్తం తండ్రి వద్దనుంచి పొందాడు. కాని ఇవ్వడానికే ఆయన అందుకున్నాడు. అలాగే పరలోకంలో కూడా. అలాగే సృష్టి అయిన వారందరికి తన సేవ విషయంలో తన ప్రియకుమారుని ద్వారా తండ్రి జీవితం అందరికీ ప్రవహిస్తుంది. కుమారుని ద్వారా స్తుతిద్వారా సంతోషంతో చేసే సేవ ద్వారా వరద వంటి ప్రేమగా అది సమస్తానికి ఆధారభూతుడైన ప్రభువు వద్దకు తిరిగి వెళ్తుంది. DATel 3.2

ఈ నియమం పరలోకంలోనే ఉల్లంఘనకు గురి అయ్యింది. స్వార్థాశతో పాపం ప్రారంభమయ్యింది. ఆశ్రయంగా ఉన్న కెరూబు అయిన లూసిఫర్ పరలోకంలో తానే మొదటి వాడు కావాలని వాంఛించాడు. పరలోక నివాసులపై అదుపు అధికారం చెలాయించాలని వారిని సృష్టికర్తనుంచి దూరం చెయ్యాలని వారి స్తుతి వందనాలు తానే పొందాలని ప్రయత్నించాడు. ఆందుచేత అతడు దేవుని గురించి అసత్య ప్రచారం చేసి ఆయనకు తన్ను తాను హెచ్చించుకోవాలన్న ఆకాంక్ష ఉన్నదని ఆరోపించాడు. ప్రేమా పూర్ణుడైన సృష్టికర్తకు తన సొంత దుర్గుణాల్ని ఆరోపించటానికి ప్రయత్నించాడు. ఈరకంగా అతడు దేవదూతల్ని మోసగించాడు. ఈరకంగా మనుషుల్ని మోసగించాడు. న్యాయవంతుడు మహోన్నతుడు అయిన ఆయనను వారు కఠినుడుగాను, క్షమించని వానిగాను అపార్ధం చేసుకోటానికి నడిపించాడు. దేవుని పై తిరుగుబాటు చెయ్యటంలో మనుషులు తనతో చెయ్యికలపడానికి వారిని అకట్టుకున్నాడు. లోకాన్ని కారు చీకట్లు కమ్ముకున్నాయి. DATel 3.3

దేవుని గూర్చిన అబద్ద ప్రచారంతో భూమి కాంతి హీనమయ్యింది. కమ్మిన చీకట్లను పారదోలేందుకు లోకాన్ని తిరిగి దేవుని వద్దకు చేర్చేందుకు సాతాను మోసపూరిత శక్తిని నిర్వీర్యం చెయ్యాలి. అది బల ప్రయోగం ద్వారా జరగకూడదు. బల ప్రయోగం దైవ ప్రభుత్వ సూత్రాలకు విరుద్ధం. ప్రేమ వలన చేసే సేవను మాత్రమే దేవుడు కోర్తున్నాడు. ప్రేమ ఆజ్ఞాపించి పొందేదికాదు. అది బలత్కారంతో అధికారంతో పొందేదీకాదు. ప్రేమ ద్వారా మాత్రమే ప్రేమ పుడుతుంది. దేవుని ఎరగటమంటే ఆయన్ని ప్రేమించటం. సాతాను ప్రవర్తనకు భిన్నమైన దేవుని ప్రవర్తనను ప్రదర్శించటం. ఈ పనిని విశ్వమంతటిలోను ఒక్కడు మాత్రమే చేయగలడు. దేవుని ప్రేమ ఎత్తును లోతును ఎరిగినవాడు మాత్రమే చేయగలుగుతాడు. లోకం చీకటి రాత్రిపై “ఆరోగ్యము కలుగజేయు” రెక్కలతో నీతిసూర్యుడు ఉదయించాలి. మలా 4:2. DATel 4.1

మన విమోచన ప్రణాళిక తర్వాతి పరిణామం కాదు. ఆదాము పతనం తర్వాత ఏర్పాటయిన ప్రణాళిక కాదు. అది “అనాది నుండి రహస్యముగా ఉంచబడి యిప్పుడు ప్రత్యక్షపరచబడిన రహస్యము” రోమా 16:25; అనాదిగా దైవ సింహసనానికి పునాది అయిన సూత్రాల ప్రచురణ సాతాను వల్ల భ్రష్టత చోటుచేసుకుంటుందని ఆ భ్రష్టశక్తి వంచన వల్ల మానవుడు పడిపోతాడని దేవునికి క్రీస్తుకూ ఆదినుంచీ తెలుసు. పాపం ఉనికి దేవుని సంకల్పం కాదు. కాని పాపం చోటుచేసుకుంటుందని దేవునికి ముందే తెలుసు. ఆ భయంకర అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవటానికి దేవుడు ప్రణాళికను ఏర్పాటు చేశాడు. లోకంపట్ల తనకున్న మహత్తర ప్రేమను బట్టి తనకుమారునిపై “విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు” తన ఏకైక కుమారుణ్ని ఇవ్వటానికి దేవుడు అంగీకరించాడు. యోహాను 3:16. “దేవుని నక్షత్రములకు పైగా నా సింహానమును హెచ్యింతును.... మహోన్నతునితో నన్ను సమానునిగా చేసికొందును” అని లూసీఫర్ భావించాడు. యెషయా 14:13, 14. కాని క్రీస్తు “దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచు కొన లేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్నుతాను రిక్తునిగా చేసికొనెను. ” ఫిలిప్పి 2:6, 7. DATel 4.2

ఇది స్వచ్ఛంద సమర్పణ. క్రీస్తు తండ్రి పక్కనే ఉండిపోయేవాడే, పరలోక మహిమను దేవదూతల శ్రద్ధాంజలుల్ని విడిచి పెట్టుకునేవాడు కాడు. కాని అధికార దండాన్ని తిరిగి తండ్రి. చేతికివ్వడానికి విశ్వ సింహసనం నుంచి దిగి పోవటానికి ఆయన నిర్ధారించుకున్నాడు. చీకటిలో ఉన్న వారికి వెలుగు నశిస్తున్న వారికి జీవాన్ని ఇవ్వటానికే అయన ఈ తీర్మానం చేసుకున్నాడు. DATel 5.1

దాదాపు రెండు వేల సంవత్సరాల కిందట పరలోకంలో దేవుని సింహాసనం నుంచి ఓ మర్మగర్భితమైన స్వరం వినిపించింది. “ఇదిగో నేను వచ్చియున్నాను.” “బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి...నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నాను.” హెబ్రీ 10:5-7; యుగయుగములగా దాగిఉన్న ఉద్దేశం నెరవేర్చు ఈ మాటల్లో ప్రకటితమయ్యింది. “నాకొక శరీరమును అమర్చితివి” అంటున్నాడు. లోకం ఉనికిలోకి రాక ముందు తండ్రితో పాటు తనకున్న మహిమతో ఆయన కనపడిఉంటే ఆయన సన్నిధి కాంతిని మనం తట్టుకొనే వాళ్లం కాము. మనం ఆ మహిమను చూసి నాశనం కాకుండేందుకోసం దాన్ని ఆయన కప్పి ఉంచాడు. ఆయన దైవత్వం మానవత్వం ముసుగు కింద కంటికి కనిపించని మహిమ కనిపించే మానవాకృతి కింద దాగి ఉంది. DATel 5.2

ఈ సంకల్పం ఛాయలు గుర్తుల రూపంలో వ్యక్తమయ్యింది. క్రీస్తు మోషేకి ఏ మండుతున్న పొదలో కనిపించాడో ఆ పొద దేవుణ్ని సూచించింది. దేవుణ్ని సూచించేందుకు ఎంపిక అయిన చిహ్నం సామాన్యమైన పొద. అనంతుడైన దేవున్ని ఈ పొద తనలో నిలుపుకొంది. సర్వ కృపానిధి అయిన దేవుడు మోషే తనను చూసి చావకుండేందుకోసం అతి సామాన్యమైన చిహ్నంలో తన మహిమను కప్పి ఉంచాడు. అలాగే పగటి పూట మేఘ స్తంభంలోను రాత్రిపూట అగ్ని స్తంభంలోను ఉండి దేవుడు ఇశ్రాయేలియుల్ని నడిపించాడు. తన చిత్రాన్ని మనుషులకి తెలియపర్చి తన కృపను వారికి అందించాడు. మానవుల దుర్బల దృష్టి చూడగలిగేందుకు దేవుని మహిమ ప్రకాశత ఆయన ఔన్నత్యం నియంత్రించబడ్డాయి. కనుక క్రీస్తు “మన దీన శరీరం ధరించి” “మనుష్యుల పోలికగా” ఫిలిప్పి 3:21. (ఆర్.వి) లోకంలోకి రావలసి ఉన్నాడు. ఆయనను ఆశించటానికి లోకం దృష్టికి ఆయనలో సురూపం లేదు అయినా ఆయన నరావతారి అయిన దేవుడు. ఇహపరలోకాల DATel 5.3

వెలుగు ఆయన మహిమ ముసుగు కింద ఉంది. దుఃఖానికి శోధనకు గురి అయిన మనుషులికి సమీపంగావచ్చేందుకు ఆయన తన మహాత్మ్యాన్ని ఔన్నత్యాన్ని మరుగు పర్చుకున్నాడు. DATel 6.1

ఇశ్రాయేలీయుల పక్షంగా మోషేని దేవుడు ఇలా ఆజ్ఞాపించాడు, “నేను వారిలో నివసించునట్లు వారు నాకు వరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను”(నిర్గమ 25:8). అలాగే ఆయన తన ప్రజల మధ్య గుడారంలో నివసించాడు. ఆయాసకరమైన తమ ఎడారి సంచారమంతటిలోను ఆయన సన్నిధి చిహ్నమైన గుడారం వారితో ఉన్నది. అలాగే క్రీస్తు తన గుడారాన్ని మానవ శిబిరం మధ్య ఏర్పర్చుకున్నాడు. ఆయన మనమధ్య నివసించి తన ప్రవర్తనను జీవితాన్ని గూర్చి మనల్ని చైతన్యపర్చేందుకు తన డేరాని మనుషుల డేరాల సరసన వేసుకున్నాడు. “ఆ వాక్యము శరీరధారియై కృపాసత్య సంపూర్ణుడుగా మనమధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి” యోహాను 1:14. DATel 6.2

క్రీస్తు మనతో నివసించటానికి వచ్చాడు. గనుక మన శ్రమలు కష్టాల గురించి దేవునికి తెలుసునని దుఃఖంలో వేదనలో ఆయన సానుభూతి మన కుటుందని మన మెరుగుదుం. మన సృష్టికర్త పాపులకు మిత్రుడని ఆదాము కుమారులు కుమార్తెలు గ్రహించవచ్చు. ఎందుకంటే లోకంలో రక్షకుని జీవితంలో ప్రదర్జితమైన ప్రతీ కృపా సిద్ధాంతంలో, సంతోషాన్ని గూర్చిన ప్రతి వాగ్దానంలో, ప్రతీ ప్రేమ కార్యంలో, ప్రతీ దైవాకర్శణలో “దేవుడు మనకు తోడు” గా ఉన్నట్లు మనం చూస్తాం. DATel 6.3

ప్రేమతో కూడిన దైవధర్మశాస్త్రాన్ని స్వార్థంతో కూడిన చట్టంగా సాతాను వ్యవహరిస్తాడు. ధర్మశాస్త్ర సూత్రాల్ని ఆచరించటం అసాధ్యమని అతడంటాడు. మన మొదటి తలిదండ్రుల పతనానికి సృష్టి కర్తను సాతాను బాధ్యుణ్ని చేస్నున్నాడు. ఇలా మనుషులు దేవున్ని పాపానికి, బాధకు మరణానికి కర్తగా పరిగిణించేటట్లు మనుషుల్ని నడిపిస్తున్నాడు. యేసు ఈ మోసాన్ని బయలు పెట్టాల్సి ఉన్నాడు. ఆయన మనలో ఒకడుగా విధేయతకు ఉదాహరణగా నిలవాల్సి ఉన్నాడు. ఈ కారణంగా ఆయన మన స్వభావాన్ని స్వీకరించి మన అనుభవాల్ని అనుభవించాడు. “అన్నివిషయములలో ఆయన తన DATel 6.4

సహోదరుల వంటివాడు కావలసివచ్చెను.” హెబ్రి 2:17. యేసు భరించని బాధ మనం భరించాల్సివస్తే దాన్ని ఆధారం చేసుకుని మనకు దేవుని శక్తి చాలదని సాతాను సూచిస్తాడు. అందుచేత యేసు “సమస్త విషయములోను మనవలేనే శోధింపబడ్డాడు. హెబ్రీ4:15. మనం గురి అయ్యే ప్రతీ శ్రమను యేసు భరించాడు. మనకు అందుబాటులో లేని ఏ శక్తినీ ఆయన తన సొంత విషయంలో వినియోగించుకోలేదు. ఆయన శోధనను మనిషిగా ఎదుర్కొని దేవుడ్చిన శక్తితో దాన్ని జయించాడు. “నాదేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది.” అంటున్నాడాయన. కీర్త 40:8. మేలు చేస్తూ సాతాను బాధితుల్ని స్వస్తపర్చుతూ సంచరించినప్పుడు దేవుని ధర్మశాస్త్ర స్వభావాన్ని ఆయన సేవాస్ఫూర్తిని ఆయన మానవులకు విశదం చేశాడు. దేవుని ధర్మశాస్త్రానికి విధేయులై నివసించటం సాధ్యమని ఆయన జీవితం సాక్ష్యమిస్తోంది. DATel 7.1

తన మానవత్వంవల్ల క్రీస్తు మానవాళిని స్పృశించాడు. తన దేవత్వాన్ని బట్టి దైవ సింహాసనానికి హక్కు కలిగి ఉన్నాడు. మనుష్యకుమారుడుగా విధేయతకు ఉదాహరణగా నిలిచాడు. దైవ కుమారుడుగా విధేయులవ్వటానికి మనకు శక్తినిస్తాడు. హోరీబు కొండమీద మండుతున్న పొదలో నుంచి “నేను ఉన్నవాడను అనువాడనై యున్నానని.... ఉండుననువాడు నా యొద్దకు నన్ను పంపెనని” చెప్పమంటూ మోషేతో మాట్లాడింది క్రీస్తే. నిర్గమ 3:14. ” ఇది ఇశ్రాయేలీయుల విడుదలకు చేసిన ప్రమాణం. కనుక ఆయన “మనుష్యుని పోలికగా” వచ్చినప్పుడు తాను నేను అనువాడనని ప్రకటించుకున్నాడు. బేల్లె హేము శిశువు, సాత్వికుడు విధేయుడు అయిన రక్షకుడు “సశరీరుడుగా ప్రత్యక్షుడ” య్యిన దేవుడు. 1 తిమోతి 3:16. మనతో ఆయన ఇలా చెబుతున్నాడు, “నేను గొట్టెలకు మంచికాపరిని” “జీవాహారమును నేనే” “నేనే మార్గమును, సత్యమును, జీవమును,” “పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధి కారము ఇయ్యబడియున్నది. ” యోహాను 10:11, 6:51, 14: 6, మత్తయి 28:18. నేనున్నాను, భయపడవద్దు. దేవుడు మనకు తోడు” అన్నది పాప విముక్తికి దేవుడు మనకిచ్చిన భరోసా. దైవ ధర్మశాస్త్రాన్ని ఆచరించటానికి ఆయన మనకు శక్తినిస్తాడు అన్న వాగ్దానం. DATel 7.2

తన్నుతాను తగ్గించుకుని మానవుడవ్వటంలో క్రీస్తు సాతానుకు విరుద్ధమైన ప్రవర్తనను బయలు పర్చాడు. “మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను.” ఫిలిప్పి 2:8; ప్రధాన యాజకుడు తన అధికారిక యాజకదుస్తుల్ని పక్కన పెట్టి సామాన్యమైన యాజకుడి తెల్లని వ్వవహరించి బలి అర్పించాడు. ఆందులో యాజకుడూ ఆయనే ఆర్పణా ఆయనే! “మన యతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపర్చబడెను. మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్ధమైన శిక్ష అతని మిద పడెను” యెషయా 53:5. DATel 8.1

మనం క్రీస్తువలె పరిగణన పొందేందు కోసం క్రీస్తు మనవలె పరిగణన పొందాడు. మన పాపాలతో ఆయనకు ప్రమేయం లేకపోయినా మన పాపాల నిమిత్తం ఆయన శిక్ష అనుభవించాడు. మనకేమి పాలులేని ఆయన నీతి వలన మనం నీతిమంతులుగా తీర్పు పొందాం. ఆయనకు సొంతమైన జీవాన్ని మనం పొందేందుకుగాను మనం పొందాల్సి ఉన్న మరణాన్ని ఆయన పొందాడు. “అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది.” DATel 8.2

పాపం కలిగించిన నాశనం నుంచి తన జీవితం మరణం ద్వారా క్రీస్తు పునరుద్ధరించటమే కాదు అంతకన్నా ఎక్కువే సాధించాడు. మానవుణ్ని దేవునినుంచి నిరంతరంగా విడదీయాలన్నది సాతాను సంకల్పం. కాని క్రీస్తులో మనం దేవునికి మరింత దగ్గరయ్యాం . పాపంలో పడకుండా ఉండి ఉంటే సాధ్యమయ్యేదానికన్నా సన్నిహితమయ్యాం . మన స్వభావాన్ని స్వీకరించటంలో రక్షకుడు మానవులతో ఎన్నడూ తెగిపోని బాంధవ్యాన్ని పెంచుకున్నాడు. అనంత. యుగాల పొడవునా ఆయన మనతో అనుబంధం కలిగి ఉంటాడు. “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారుని..... అనుగ్రహించెను.” యోహాను 3:16. మన పాపాల్ని మోయటానికి మన కోసం మరణించటానికే కాదు, పతనమైన మానవజాతికి కూడా దేవుడు ఆయనను అనుగ్రహించాడు. సమాధానకరమైన మార్పులేని తన ఆలోచన నిత్యం మనతో ఉంటుందని భరోసా ఇవ్వటానికి దేవుడు తన ఏకైక కుమారుణ్ని ఇచ్చాడు. మానవ కుటుఁబంలో సభ్యుడై తన మానవ DATel 8.3

స్వభావాన్ని నిత్యం కలిగిఉండేందుకు ఇచ్చాడు. దేవుడు తన మాటను నెరవేర్చుకుంటానంటూ చేసిన ప్రమాణమిది. “మనకు శిశువు పుట్టెను. మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఆయన భుజము మీద రాజ్యభారముండును.” తన కుమారుని రూపంలో దేవుడు మానవ స్వభావాన్ని అంగీకరించాడు. దాన్ని క్రీస్తు ఉన్నతాకాశానికి తీసుకువెళ్లాడు! విశ్వ సింహాసనాన్ని మనతో పంచుకునేది మనుష్యకుమారుడే “ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి” అని పేరు పెట్టటం జరుగుతుంది. యెషయా 9:6. నేను ఉన్నవాడను అనువాడు దేవునికి మానవుడికీ మధ్యవర్తి. ఆయన ఆ యిద్దర్నీ కలిపే వ్యక్తి. “పవిత్రుడగు నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును” అయిన ఆయన మనల్ని సహోదరులని పిలవటానికి సిగ్గు పడటం లేదు. హెబ్రీ 7:26; 2:11. భూలోకంలోని కుటుంబం పరలోకంలోని కుటుంబం క్రీస్తులో ఒకటవుతున్నాయి. తన ప్రజల్ని గురించి దేవుడిలా అంటున్నాడు, “నా జనులు యెహోవా దేశములో కిరీటములందలి రత్నములవలెనున్నారు. గనుక కాపరి తన మందను రక్షించునట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును. వారు ఎంతో క్షేమముగా ఉన్నారు. ఎంతో సొగసుగా ఉన్నారు. ‘ జెకర్యా 9:16:17. విమోచన పొందిన వారిని ఘనపర్చటం దేవునికృపకు నిత్య సాక్ష్యంగా నిలుస్తోంది. “క్రీస్తు యేసు నందు... అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనపరుచు”తాడు. “దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసు నందు చేసిన నిత్యసంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును... తన యెక్క నానావిధమైన జ్ఞానము.... తెలియబడవలెనని , ఉద్దే” శించాడు. ఎఫెస్సీ 2: 6; 3:10, 11. DATel 9.1

క్రీస్తు విమోచన కార్యం ద్వారా దేవుని ప్రభుత్వం న్యాయసమ్మతమైందిగా నిలిచింది. సర్వశక్తుడైన దేవుడు ప్రేమామయుడైన దేవుడుగా వెల్లడయ్యాడు. సాతాను ఆరోపణలు తిరస్కరించబడ్డాయి. అతడి ప్రవర్తన బట్టబయలయ్యింది. ఇక ఎన్నడూ తిరుగుబాటు సంభవించదు. పాపం ఇక ఎన్నడూ తలెత్తదు. ముందుయుగాల్లో ఎవ్వరూ భ్రష్టులు కారు. ప్రేమ చేసిన త్యాగం వల్ల భూలోక పరలోక నివాసులందరూ వీడని అనుబంధంతో సృష్టికర్తతతో ఏకమై జీవిస్తారు. DATel 9.2

రక్షణ కర్తవ్యం సమాప్తమవుతుంది. పాపం వృద్ధిచెందిన చోట దేవుని కృపమరెంతో వృద్ధి చెందుతుంది. తనదీ అని సాతాను చెబుతున్న ఈ భూమి విముక్తి పొందటమే కాదు ఉన్నత స్థితికి చేరనుంది. పాపం పర్యవసానంగా అద్భుతమైన సృష్టి అంతటిలోను నల్లటి మచ్చగా ఉన్న మన చిన్నలోకం దైవసృష్టిలోని ఇతరలోకాల కన్న ఎక్కువ ఘనతను పొందబోతోంది. దైవకుమారుడు మానవుడుగా నివాసమున్నది ఇక్కడే. ఆ మహిమరాజు నివసించి శ్రమలు పొంది మరణించింది ఇక్కడే. ఆయన సమస్తాన్ని నూతన పర్చినప్పుడు దేవుని నివాసం మనుషులతో ఇక్కడే ఉంటుంది. “ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలై యుందురు, దేవుడు తానే వారి దేవుడై యుండి వారికి తోడై యుండును.” విమోచన పొందిన జనులు అనంత యుగాల పొడవునా ప్రభువు మహిమలో నడుస్తారు. వర్ణన కందని వరం అయిన ఇమ్మానుయేలు - “దేవుడు మనకు తోడు” - నిమిత్తం వారు ప్రభువును కొనియాడ్డారు. DATel 10.1