పితరులు ప్రవక్తలు

54/75

52—సాంవత్సరిక పండుగలు

ఇశ్రాయేలీయులందరు దైవారాధన నిమిత్తం గుడారంలో మూడు సాంవత్సరిక సమావేశాలు జరుపుకొనేవారు. నిర్గమ 23:14-16. ఈ సమావేశాలు కొంతకాలం షిలోహులో జరిగాయి.అనంతరం జాతీయ ఆరాధనకు యెరూషలేము కేంద్ర మయ్యింది. ఇశ్రాయేలీయుల గోత్రాలన్నీ ఇక్కడ పరిశుద్ద పండుగలకి సమావేశ మయ్యేవి. PPTel 536.1

ఇశ్రాయేలీయుల చుట్టూ యుద్ధ శూరులైన జాతుల ప్రజలుండేవారు. వారి భూముల్ని ఆక్రమించటానికి ఆతృతగా ఉండేవారు. అయినా దేహదారుఢ్యం గలవారు, ప్రయాణాన్ని తట్టుకోగలిగిన వారు తమ నివాసాలు వదిలి ఆ స్థలానికి వెళ్ళి సంవత్సరంలో మూడుసార్లు సమావేశం కావలిసిందిగా దేవుని ఆదేశం. శత్రువులు తమ గృహాల్ని అగ్నితోను, ఖడ్గంతోను ధ్వంసం చేయకుండా వారిని నిలువరించే వారెవరు? విదేశ శత్రువులు తమ దేశం పై దండెత్తి ఇశ్రాయేలీయుల్ని చెరగొనకుండా కాపాడేదెవరు? తన ప్రజల్ని పరిరక్షిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. “యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టు ఆయన దూత కావలి యుండి వారిని రక్షించును” కీర్తనలు 34:7. ఇశ్రాయేలీయులు దేవుని ఆరాధించటానికి వెళ్ళిన సమయంలో వారి శత్రువుల్ని దేవుడు అదుపులో ఉంచాడు. వారితో దేవుడిలా వాగ్దానం చేశాడు, “నీ యెదుట నుండి జనములను వెళ్ళగొట్టి నీ పొలిమేరలను గొప్పని చేసెదను. మరియు నీవు సంవత్సరమునకు ముమ్మారు నీ దేవుడైన యెహోవా సన్నిధిని కనబడబోవున్నప్పుడు ఎవడును నీ భూమిని ఆశింపడు” నిర్గమ 34:24. PPTel 536.2

వీటిలో మొదటి పండుగ పస్కా. అది పులియని రొట్టెల పండుగ. అది యూదుల మొదటి మాసమైన హబీబు నెలలో జరిగేది. హబీబు నెల మార్చి చివరికి ఏప్రిల్ ఆరంభానికి సమానం. శీతాకాలంలోని చలిపోతుంది. ప్రకృతి వసంత కాలపు తాజాతనంతో అందంతో హృదయాన్ని రంజింప చేస్తుంది. కొండల మీద లోయల్లోను పచ్చని గడ్డి ఉంటుంది. ఎక్కడ చూసినా అందమైన పువ్వులు కనిపిస్తాయి. PPTel 536.3

పున్నమికి చేరువలో ఉండే చంద్రుడు సాయంత్రాల్ని ఆనందదాయకం చేస్తాడు. అది పరిశుద్ధ రచయిత చక్కగా వర్ణించిన కాలం: PPTel 536.4

“చలికాలము గడిచిపోయెను
వర్షాకాలము తీరిపోయెను వర్షమిక రాదు
దేశమంతట పువ్వులు పూసి యున్నవి
పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చెను
పావుర స్వరము మన దేశములో వినబడుచున్నది
అంజూరపు కాయలు పక్వమగుచున్నవి
ద్రాక్ష చెట్లు పూతపట్టి సువాసన నిచ్చుచున్నవి”
PPTel 537.1

పరమ గీతము 2:11-13.

దేశం నలుమూలల నుంచి యాత్రిక బృందాలు బయలుదేరి యెరూషలేము దిశగా వెళ్తున్నాయి. మందలనుంచి గొర్రెల కాపరులు, పర్వత ప్రాంతాల నుంచి పశువుల కాపరులు, గలిలయ సముద్రం నుంచి మత్స్యకారులు, పొలాల నుంచి వ్యవసాయదారులు, పరిశుద్ధ పాఠశాలల నుంచి ప్రవక్తల కుమారులు - అందరూ దేవుని సన్నిధి ప్రదర్శితమవుతున్న ఆ స్థలానికి తమ ప్రయాణం సాగిస్తున్నారు. వారు మజిలీలు వేసుకొంటూ ప్రయాణం సాగించారు. ఎందుకంటే పలువురు కాలి నడకన వెళ్ళారు.ఈయాత్రిక బృందాల్లో మనుషులు నిత్యం చేరటంవల్ల పరిశుద్ధ పట్టణం చేరే సరికి అవి పెద్ద జన సమూహాలయ్యేవి. PPTel 537.2

ప్రకృతి ఇచ్చే ఆనందం ఇశ్రాయేలీయుల హృదయాల్లో ఉత్సాహాన్ని, సకల దీవెనలు ఇచ్చే దేవుని పట్ల కృతజ్ఞతల్ని పుట్టించింది. యెహోవా మహిమను ఔన్నత్యాన్ని ఉగ్గడిస్తూ వారు చక్కని హెబ్రీ గీతాల్ని పాడారు. తాళ సునాదం మధ్య బూర ధ్వని వినిపించినప్పుడు కృతజ్ఞతలు చెల్లిస్తూ వందలాది ప్రజలు గళాలు కలిపారు. PPTel 537.3

“యెహోవా మందిరమునకు వెళ్ళుదమని
జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని
యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములలో
నిలుచున్నవి.....
యెహోవా నామమునకు
కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై ... యెహోవా గోత్రములు అక్కడికి
ఎక్కి వెళ్ళును...
యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి
యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్థిల్లుదురు”.
PPTel 537.4

కీర్తనలు 122:1-6.

అన్యులు ఏ కొండల్లో తమ బలిపీఠాలు వెలిగించుకొనేవారో తమ చుట్టూ ఉన్న ఆ కొండల్ని ఇశ్రాయేలీయులు వీక్షించినప్పుడు వారిలా గానం చేశారు. PPTel 538.1

“కొండల తట్టు నా కన్ను లెత్తుచున్నాను
నాకు సహాయము ఎక్కడ నుండివచ్చును?
యెహోవా వలననే నాకు సహాయము కలుగును
ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు”
PPTel 538.2

కీర్తనలు 121:1,2.

“యెహోవా యందు నమ్మికయుంచువారు
కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలె
నుందురు
యెరూషలేము చుట్టు పర్వతములున్నట్లు
యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల
PPTel 538.3

చుట్టు ఉండును” కీర్తనలు 125:1,2.

పరిశుద్ధ పట్టణానికి ఎదురుగా ఉన్న కొండల్ని ఎక్కుతూ దేవాలయం వద్దకు వెళ్తున్న భక్తజన సమూహాల్ని వెల్లు వెత్తుతున్న భక్తి భావంతో వారు వీక్షించారు. ధూపం పొగ పైకి లేవటం చూశారు. పరిశుద్ధ ఆరాధనను గూర్చి లేవీయులు బూరలతో ప్రకటించటం విన్నారు. ఆ పరిశుద్ధ ఘడియ స్పూర్తితో నిండి వారిలా గానం చేశారు. PPTel 538.4

“మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ
పట్టణమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడునై యున్నాడు ఉత్తర దిక్కున
మహారాజు పట్టణమైన సీయోను పర్వతము
రమ్యమైన యెత్తుగల చోటనుంచబడి సర్వ
PPTel 538.5

భూమికి సంతోషకరముగా నున్నది” కీర్త 48:1,2.

“నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక
నీ నగరములలో క్షేమముండునుగాక”
“నేను వచ్చునట్లు నీతిగుమ్ముములు తీయుడి
నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు
కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను”.
“ఆయన ప్రజలందరి యెదుటను యెహోవా మందిరపు
ఆవరణములోను యెరూషలేమా, నీ మధ్యను
నేను యెహోవాకు నా మ్రొక్కుబళ్ళు చెల్లించెదను
PPTel 539.1

యెహోవాను స్తుతించుడి” కీర్త. 122:7, 118:19, 116:18, 19.

ఈ యాత్రికులకు యెరూషలేములోని గృహాల తలుపులు తెరుచుకొన్నాయి. వారి వసతికి గదులు ఉచితంగా ఏర్పాటయ్యాయి. కాగా ఆ విస్తార జన సమూహాలకు అవి చాలలేదు. అందుచేత పట్టణంలోను చుట్టుపట్ల ఉన్న కొండలమీద ఉన్న ఖాళీ స్థలాలన్నిటిలోను గుడారాలు వేశారు. PPTel 539.2

ఆ నెల పద్నాలుగోనాడు సాయంత్రం పూట పస్కాను ఆచరించారు. ఆ సందర్భంగా జరిగిన పరిశుద్ధమైన, ఆకర్షణీయమైన కర్మకాండ ఐగుప్తు బానిసత్వం నుంచి తమ విడుదలను గుర్తుకు తెచ్చి తమను పాప దాస్యం నుంచి విమోచించనున్న బలిదానాన్ని వారికి సూచించింది. కల్వరి పై రక్షకుడు తన ప్రాణాన్ని విడిచి పెట్టినప్పుడు పస్కా పండుగ ప్రాధాన్యం అంతమయ్యింది. పస్కా దేనికైతే చిహ్నంగా ఉంటూ వచ్చిందో ఆ త్యాగానికి ప్రతీకగా ప్రభురాత్రి భోజన సంస్కారం నెలకొన్నది. PPTel 539.3

పస్కా తర్వాత ఏడు దినాలు పులియని రొట్టెల పండుగ జరిగేది. మొదటి రోజున ఏడో రోజున వారు పరిశుద్ధ సంఘంగా సమావేశమవ్వాల్సి ఉన్నారు. ఆ సమయంలో వారు జీవనోపాధికి సంబంధించిన ఏ పని చేయకూడదు. ఆ పండుగ రెండో రోజున ఆ ఏడాది పంటలోని ప్రథమ ఫలాల్ని ప్రభువుకి సమర్పించాల్సి ఉన్నారు. పాలస్తీనా దేశంలో మొట్టమొదటి పంట బార్లీ. ఈ పండుగ ఆరంభంలో అది పండటం ప్రారంభించేది. యాజకుడు ఈ పంట పనను దేవుని బలిపీఠం ముందు అల్లాడంచేవాడు సమస్తం ప్రభువుదేనన్న గుర్తింపుకు ఇది చిహ్నం. ఈ ఆచారాన్ని అనుష్టించిన తర్వాతనే వారు తమ పంటను కూర్చుకోవాల్సి ఉండేది. PPTel 539.4

ప్రథమ ఫలాల అర్పణ జరిగిన ఏభై రోజులకు పెంతెకొస్తు పండుగ వచ్చేది. దీన్ని కోతపండుగని వారముల పండుగని కూడా వ్యవహరించేవారు. ధాన్యాన్ని ఆహారంగా సిద్ధం చేసుకోగలగటానికి కృతజ్ఞత సూచకంగా పులియని పిండితో రెండు రొట్టెలు చేసి వాటిని దేవుని ముందుంచేవారు. పెంతెకొస్తు పండుగ ఒక రోజే జరిగేది. ఆ దినమంతా దైవారాధనలో గడిచేది. PPTel 540.1

ఏడో నెలలో పర్ణశాలల పండుగ లేక ఫల సంగ్రహణ పండుగ జరిగేది. పండ్ల తోటలు ఒలీవ తోటలు, ద్రాక్షతోటల నుంచి దేవుడు విస్తారంగా దిగుబడులిచ్చాడని ఈ పండుగ ద్వారా ప్రజలు గుర్తించేవారు. సంవత్సరమంతటిలోను ఇదే బ్రహ్మాండమైన పండుగ సమావేశం. భూమి సమృద్ధిగా పంటనిచ్చింది. ధాన్యంతో కొట్లు నిండాయి. పండ్లు, నూనె, ద్రాక్షారం నిల్వ చేసుకోటము జరిగింది. ప్రథమ ఫలాల్ని ప్రత్యేకించి ఉంచటం జరిగేది. ఇక ఇప్పుడు ప్రజలు తమను బహుగా దీవించిన దేవునికి కృతజ్ఞతలు వ్యక్తం చేస్తూ తమ అర్పణలతో వచ్చేవారు. PPTel 540.2

ఈ పండుగ ప్రధానంగా ఉత్సహించటానికి ఏర్పాటయ్యింది. తమ పాపాలు ఇక ఎన్నటికీ గుర్తికిరావు అన్ని నిశ్చయతను కూర్చే ప్రాయశ్చిత్తార్థ దినం తర్వాత ఈ పండుగ వచ్చేది. ఇలా దేవునితో సమాధానం కలిగి ఆయన ఔషద్యాన్ని గుర్తించి ఆయన కృపాబాహుళ్యానికి ఆయనకు స్తుతులర్పించటానికి ఇప్పుడు ఆయన ముందుకు వచ్చేవారు. కోత పనులు ముగిసి కొత్త ఏడాది సాధకబాధకాలింకా ప్రారంభం కాకమునుపు ప్రజలు ఎలాంటి బత్తిళ్ళూ లేకుండా స్వేచ్చగా ఉండి పరిశుద్ధమైన ఉత్సాహభరితమైన ఆ ప్రభావానికి చోటిచ్చే ఘడియ అది. తండ్రులు కుమారులు మాత్రమే ఈ పండుగలకు రావాల్సిందిగా ఆజ్ఞ ఉన్నప్పటికీ సాధ్యమైనంత వరకు కుటుంబీకులందరూ హాజరయ్యేవారు. సేవకుల్ని, లేవీయుల్ని, పరదేశుల్ని, పేదల్ని తమ అతిథులుగా ఆహ్వానించేవారు. PPTel 540.3

పస్కా మల్లే పర్ణశాలల పండుగ కూడా జ్ఞాపకార్థకంగా ఏర్పటయేది. అరణ్యంలో తమ యాత్రిక జీవితాన్ని స్ఫురణకు తెచ్చుకొంటూ ఇప్పుడు తమ గృహాలు వదిలి “ఈతమట్టలను గొంజి చెట్ల కొమ్మలను కాలువల యొద్ద నుండు నిరమంజి చెట్లను” మలిచి కట్టుకొన్న పొదరిళ్ళలో నివసించాల్సి ఉన్నారు. లేవీ. 23:40, 42, 43. PPTel 540.4

మొదటి రోజు పరిశుద్ధ సంఘ సమావేశం జరిగేది. ఆ ఏడు దినాల పండుగకు ఇంకోదినం కలిపి అదే విధంగా దాన్ని కూడా ఆచరించటం జరిగేది. PPTel 541.1

ఏటేటా జరిగే ఈ సభల్లో దేవుని సేవ చేయటానికి పిన్నల్ని పెద్దవారిని ప్రోత్సహించటం జరిగేది. ఆదేశం పలు ప్రాంతాల నుంచి వచ్చే ప్రజల మధ్య సహవాసాలు ఏర్పడి దేవునితో తమ బాంధవ్యాన్ని తమ పరస్పర సంబంధాల్ని పటిష్ఠపర్చేవి. దేవుడు తమకు చేసిన ఉపకారాల్ని జ్ఞాపకం చేసుకొంటూ దైవ ప్రజలు ఈనాడు ఉత్సాహంగా పర్ణశాలల పండుగ జరుపుకోటం సమంజసం. దేవుడు తమ తండ్రులకు విడుదల కలిగించి ఐగుప్తు నుంచి వారు చేసిన ప్రయానంలో వారిని ఆశ్చర్యకంగా పరిరక్షించటాన్ని ఇశ్రాయేలు ప్రజలు పండుగగా జరుపుకొన్నట్లే లోకంలో నుంచి మనల్ని బయటికి తీసుకురావటానికి, పాపాంధకారంలో నుంచి ఆయన కృపలోకి సత్యంలోకి మనల్ని నడిపించటానికి ఆయన ఏర్పాటు చేసిన వివిధమార్గాల్ని కృతజ్ఞతా చిత్తాలో మనం గుర్తు చేసుకోవాల్సి ఉన్నాం. PPTel 541.2

గుడారానికి దూరంగా నివాసముండేవారు సాంవత్సరిక పండుగలకు హాజరు కావటంలో ఒక మాసానికి పైచిలుకు సమయం గడిచేది. ఆదర్శవంతమైన ఈ భక్తి పూరిత దైవారాధన ఆధ్యాత్మికమైన నిత్యకాలికమైన ఆసక్తుల నిమిత్తం మన స్వార్థపూరిత లౌకికాశక్తుల్ని విడిచి పెట్టాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నది. దేవుని సేవలో పరస్పరం బలపర్చుకోటానికి ఉద్రేక పర్చుకోటానికి కలిగే తరుణాల్ని నిర్లక్ష్యం చేస్తే మనకే నష్టం వాటిల్లుతుంది. ఆయన వాక్యంలోని సత్యాలు మన మనసులికి స్పష్టంగా అర్థం కావు. వాటి పరిశుద్ధ ప్రభావం మన హృదయాల్ని ఉత్తేజపర్చి మేల్కొల్పలేకపోటంతో మనం ఆధ్యాత్మికంగా క్షీణిస్తాం. పరస్పర సానుభూతి లోపించటం వల్ల క్రైస్తవులుగా మనం ఆధ్యాత్మికంగా క్షీణిస్తాం. పరస్పర సానుభూతి లోపించటం వల్ల క్రైస్తవులుగా మన సహవాసం దెబ్బతింటుంది. తన మానాన తానే నివసించే వ్యక్తి దేవుడు తనకు ఉద్దేశించిన కార్యాన్ని నెరవేర్చటం లేదని చెప్పాలి. మనమంతా ఒకే తండ్రి పిల్లలం. ఆనందమయ జీవనానికి మనం ఒకరిపై ఒకరు ఆధారపడి నివసిస్తాం. మన పై దేవునికి మానవాళికీ హక్కులున్నాయి. మన స్వభావంలోని సాంఘిక గుణాల వికాసం మన సహోదరులపట్ల సానుభూతి చూపటానికి మనల్ని ప్రేరేపిస్తుంది. పరులకు ఉపకారం చేయటం మనకు ఆనందాన్నిస్తుంది. PPTel 541.3

పర్ణశాలల పండుగ జ్ఞాపకార్థకమే కాదు సంకేతాత్మకం కూడా. అది వెనకటి అరణ్య ప్రయాణాన్ని సూచించటమే కాక కోత పండుగగా భూఫలాల్ని సంగ్రహిం చటాన్ని పండుగగా ఆచరించి ముందు సంభవించనున్న ఆ చివరి మహా సంగ్రహణాన్ని సూచించింది. ఆ సమయంలో దహించి వేయటానికి గురుగుల్ని, పనలుగా కూర్చేందుకు తన కొట్లలో కూర్చేందుకు గోధుమల్ని పోగుచేయటానికి కోత ప్రభువు కోత గాండ్రను పంపనున్నాడు. అప్పుడు దుష్టులు నాశనమవుతుతారు. “వారు ఇక నెన్నడు నుండని వారైనట్లు” ఉంటారు. ఓబద్యా 16. దేవుని సన్నుతించటంలో విశ్వంలోని ప్రతీ స్వరం ఏకమౌతుంది. ప్రకటన రచయిత ఇలా అంటున్నాడు, “అంతట పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము,అనగా వాటిలోనున్న సర్వమును - సింహా సనాసీనుడైయున్న వానికిని గొట్టె పిల్లకును స్తోత్రమును ఘనతయు ప్రభావమును యుగయుగములు కలుగును గాకని చెప్పుట వింటిని” ప్రకటన 5:13. PPTel 542.1

పర్ణశాలల పండుగలో ఇశ్రాయేలు ప్రజలు తమను ఐగుప్తు దాస్యం నుంచి విడిపించి తాము అరణ్యంలో యాత్రికులుగా సంచరించిన కాలమంతటిలోను తమను కాపాడిన దేవుని కరున కటాక్షాల్ని కొనియాడారు. అప్పుడే సమాప్తమైన ప్రాయశ్చిత్తార్థ పరిచర్య ద్వారా తమకు పాపక్షమాపణ లభించింది తమను దేవుడు అంగీకరించాడు అన్న స్పృహతో వారు బహుగా ఆనందించారు. ఏ శాపం నిమిత్తం “సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవవేదన పడు” తున్నదో (రోమా 8:22) ఆ పాప దాస్యం నుంచి నిరంతరం విమోజన పొందిన వారిని ప్రభువు పరలోక కనానులో పోగు చేసే తరుణంలో వారి ఆనందం వర్ణింప శక్యంకానిది. వారి మహిమ సంపూర్ణమైనది. మానవుల ప్రాయశ్చితార్థం క్రీస్తు చేస్తున్న మహోన్నత పరిచర్య అప్పుడు పరిసమాప్తమౌతుంది. వారి పాపాలు ఇక ఎన్నడూ లేకుండా తుడుపుపడ్డాయి. PPTel 542.2

“అరణ్యమున ఎండిన భూమియు సంతోషించును
అడవి ఉల్లసించి కస్తూరి పుష్పమువలె పూయును
అది బహుగా పూయుచు ఉల్లసించును
ఉల్లసించి సంగీతములు పాడును
లెబానోను సౌందర్యము దానికి కలుగును కర్మెలు షారోనులకున్న సొగసు దానికుండును
అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును
“గుడ్డి వారి కన్నులు తెరువబడును
చెవిటి వారి చెవులు విప్పబడును
కుంటివాడు దుప్పివలె గంతులు వేయును
మూగవాని నాలుక పాడును
అరణ్యములో నీళ్ళు ఉబుకును”...
“అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును
అది పరిశుద్ధ మార్గమనబడును
అది అపవిత్రులు పోకూడని మార్గము
అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడును
మూఢులైనను దానిలో నడచుచు త్రోవను తప్పకయుందురు”

“అక్కడ సింహాముండదు క్రూర జంతువులు దాని
ఎక్కవు, అవి అక్కడ కనబడవు
విమోచింపబడినవారే అక్కడ నడచుదురు”

“యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు
తిరిగి సీయోనుకు వచ్చెదరు
వారి తలలమీద నిత్యానందముండును
వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు.
దు:ఖమును నిట్టూర్పను ఎగిరిపోవును”
PPTel 542.3

యెషయా 35:1, 2, 5-10.