ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు
ద్రవ ఆహారం వల్ల ఆటంకం
(1872) 3T 74 CDTel 100.1
161. నీ శరీరారోగ్యం దెబ్బతిని ఉండకపోతే నీవు ఉత్కృష్టమయిన ఉపయోగకరమైన మహిళవయ్యేదానివి. నీవు దీర్ఘకాలం జబ్బుగా వున్నావు. అది నీ తలంపుల్ని ప్రభావితం చేస్తున్నది. నీ తలంపులు నీ మీదే నిన్ను గూర్చే కొనసాగటంతో నీ ఆలోచన నీ శరీరానికి హాని చేస్తున్నది. నీ అలవాట్లు మంచివి కావు. పరిమాణం పరంగా లేదా నాణ్యత పరంగా నీ ఆహారం సరైంది కాదు. అది మంచి రక్తంగా మార్చబడగలిగింది కాదు. ఈ రకమైన ఆహారానికి నీ కడుపుని తర్ఫీదు చేస్తున్నావు. అది ఎలాంటి సమస్యా సృష్టించటంలేదు కనుక ఇదే ఉత్తమమైందని నీ ఆలోచన నీకు బోధిస్తున్నది. కాని ఇది సరైన అనుభవం కాదు. నీ ఆహారం నుంచి నీ కడుపుకి అందాల్సిన బలం అందటం లేదు. ద్రవరూపంలో నీవు తీసుకుంటున్న ఆహారం ఆరోగ్యదాయకమైన శక్తిని గానీ, కళను గానీ నీ శరీరానికి ఇవ్వదు. అయితే నీవు ఈ అలవాటు మార్చుకుని ఎక్కువ ఘనపదార్థం తక్కువ ద్రవాహారం తీసుకున్నప్పుడు నీ కడుపులో కలకలం ఏర్పడుతుంది. అయినా నీవు మరింత గట్టి ఆహారానికి నీ కడుపును తర్ఫీదు చేయ్యాలి. CDTel 100.2
ఉత్తరం 9, 1887 CDTel 100.3
162. తమ ఆహారపు తయారీ పద్ధతి తప్పుపద్ధతి అని, సూపులు, కాఫీ, బ్రెడ్ పై ప్రధానంగా నివసించటం ఆరోగ్యసంస్కరణ కాదని, అంత ద్రవపదార్థంతో కడుపు నింపటం ఆరోగ్యదాయకం కాదని అలాంటి ఆహారం తినేవారందరూ మూత్రపిండాలపై ఎక్కువ భారం మోపుతున్నారని, అంత ద్రవపదార్థం అన్నకోశాన్ని బలహీనపర్చుతుందని నేను వారికి చెప్పాను. CDTel 100.4
ఇలాంటి ఆహారం తిన్నందుకు సిబ్బందిలో అనేకమంది అజీర్తితో బాధ పడుతున్నారని నా ధృఢ నమ్మకం. జీర్ణక్రియ అవయవాలు బలహీనమై, రక్తం శక్తిని కోల్పోయింది. వారి బ్రేక్ ఫాస్ట్ కాఫీ, బ్రెడ్, ఫ్రూన్ జూస్ మాత్రమే. ఇది ఆరోగ్యవంతం కాదు. అలసిపోయినప్పటికన్నా విశ్రాంతి తీసుకుని నిద్రించిన తర్వాత కడుపు సారవంతమైన ఆహారాన్ని మెరుగుగా జీర్ణించగలిగింది. ఇక మధ్యాహ్న భోజనం సాధారణంగా సూప్, కొన్నిసార్లు నూంసం. కడుపు చిన్నది ఆకలి తీరకపోటంతో కడుపు ద్రవాహారాన్ని ఎక్కువ తీసుకుంటుంది. అలా కడుపు పై భారం పెరుగుతుంది. CDTel 101.1
[ఆహారం తినే సమయంలో పానీయం చల్లార్చుతుందనుకునే మంటను పండ్లు నివారిస్తాయి-475] CDTel 101.2