ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు
ఏలీయా, యోహాన్లది ఛాయా రూపక సేవ
(1872) 3T 61,64 CDTel 65.2
98. ఆరోగ్య సంస్కరణ పై గమనాన్ని నిలుపవలసిందిగా ప్రభువు అనేక సంవత్సరాలుగా తన ప్రజలకి పిలుపునిస్తున్నాడు. ప్రభువు రాకకు సిద్ధంచేసే సేవావిభాగాల్లో ఇది ఒకటి. ప్రభువు మార్గాన్ని సిద్ధం చెయ్యటానికి ప్రజల మనసుల్ని పరిశుద్దుల జ్ఞానానికి తిప్పటానికి స్నానికుడైన యోహాను ఏలియా స్పూర్తితోను ఏలియా శక్తితోను బయలుదేరాడు. ప్రజల ముందుంచటానికి, క్రీస్తు రెండో రాకకు మార్గం సిద్ధపర్చటానికి దేవుడు ఎవరికి పరిశుద్ధ సత్యాల్ని అప్పగించాడో, ఈ చివరి దినాల్లో నివసించే ఆ ప్రజలకు యోహాను ప్రతినిధి. యోహాను సంస్కర్త. గబ్రియేలు దూత నేరుగా పరలోకం నుంచి వచ్చి యోహాను తల్లికి తండ్రికి ఆరోగ్య సంస్కరణ గురించి ఉపదేశిమిచ్చాడు. అతడు మద్యం లేక మత్తుకలిగించే ఏ పానీయం తీసుకోకూడదని, పుట్టినప్పటి నుంచి అతడు పరిశుద్ధాత్మతో నిండి ఉంటాడని చెప్పాడు. CDTel 65.3
యోహాను స్నేహితుల నుంచి వేరయ్యాడు. జీవితంలోని విలాసాల్ని విసర్జించాడు. ఒంటె రోమాలతో నేసిన అతడి సాదాసీదా వస్త్రం యూదు యాజకులు యూదు ప్రజల దుబారాకు ఆడంబరానికి చెంపపెట్టు. మిడతలు అడవి తేనెతో కూడిన అతడి శుద్ధమైన శాఖాహారం అన్నిచోట్ల ప్రబలిన వక్రతిండికి తిండిబోతుతనానికి మందలింపుగా నిలిచింది. మలాకీ అంటున్నాడు, “యోహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలీయాను మీయొద్దకు పంపుదును. నేను వచ్చి, దేశమును శపించ కుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును.” ప్రవక్త ఇక్కడ పని స్వభావాన్ని వర్ణిస్తున్నాడు. క్రీస్తు మొదటి రాకకు మార్గం సిద్ధం చెయ్యటానికి యోహాను ఏలీయా స్వభావంతో వచ్చినట్లే క్రీస్తు రెండో రాకకు మార్గం సిద్ధం చెయ్యాల్సివున్న వారిని ఏలీయా సూచిస్తున్నాడు. CDTel 65.4
సంస్కరణాంశం పై ప్రజల మనసుల్లో ఆసక్తి రేకెత్తించాలి. దైవ ప్రజల్ని తమ విగ్రహాల నుంచి, తమ తిండిబోతుతనం నుంచి, వస్త్రధారణ వగైరా విషయాలనుంచి మళ్లించటానికి అన్ని విషయాల్లోను మితానుభవాన్ని వర్తమానంతో అనుసంధాన పర్చవలసి ఉంది. CDTel 66.1
తీవ్రభేదం CDTel 66.2
ఈ దుర్మార యుగంలో నివసించే ప్రజల నియంత్రణలేని, ఆరోగ్యాన్ని నాశనం చేసే అలవాట్లకు భిన్నంగా దైవ ప్రజల కుండాల్సిన ఆత్మత్యాగం, అణకువ, ఆశానిగ్రహాల్ని ప్రజలకు సమర్పించాలి. దేహంతో హస్తం ఎంత సన్నిహితంగా అనుసంధానపడి ఉన్నదో అంత సన్నిహితంగా మూడోదూత వర్తమానంతో ఆరోగ్య సంస్కరణ అనుసంధానపడి వుంది. శారీరక, నైతిక క్షీణతకు ఈ అంశం పై ప్రదర్శితమౌతున్న నిర్లక్ష్యం కన్నా కారణం ఎక్కడా కనిపించదు. అమిత తిండి, శారీరక ఆవేశాల్లో మునిగి, తాము విడిచి పెట్టటానికి సమ్మతంగాలేని పాపాలు కనిపిస్తాయేమోనని భయపడూ వెలుగు చూడకుండా కళ్లు మూసుకునేవారు దేవుని ముందు అపరాధులు. CDTel 66.3
ఒక్క సందర్భంలో వెలుగు నుంచి తప్పుకునేవారు ఇతర విషయాల పై వెలుగును అలక్ష్యం చెయ్యటానికి తమ హృదయాన్ని కఠిన పర్చుకుంటారు. తినటంలోను బట్టలు ధరించటంలోను ఎవరు నైతిక విధుల్ని అతిక్రమిస్తారో వారు నిత్యజీవ ఆసక్తుల విషయంలో దేవుని హక్కుల్ని అలక్ష్యం చెయ్యటానికి మార్గం సుగమం చేస్తారు...... CDTel 66.4
దేవుడు నడిపించే ప్రజలు ఆయన సొత్తుగా ఉండే ప్రజలు. వారు లోకస్తులులా ఉండరు. దేవుడు నడిపినట్లు నడుచుకుంటే వారు ఆయన ఉద్దేశాల్ని నెరవేర్చుతారు. తమ చిత్రాల్ని ఆయన చిత్తానికి లోపర్చుతారు. వారి హృదయాల్లో క్రీస్తు నివసిస్తాడు. దేవుని ఆలయం పరిశుద్ధంగా ఉంటుంది. మీ శరీరం పరిశుద్ధాత్మకు ఆలయమంటున్నాడు అపోస్తలుడు. CDTel 67.1
శరీర శక్తికి హాని కలిగేటట్లుగా తమను తాము ఉపేక్షించుకోవాలని తన ప్రజల్ని దేవుడు కోరటం లేదు. స్వాభావిక చట్టానికి విధేయులై ఆరోగ్యాన్ని కాపాడుకోవలసిందిగా ఆయన వారిని కోరుతున్నాడు. ఆయన ప్రకృతి మార్గాన్ని స్పష్టంగా నిర్దేశించాడు. ప్రతీ క్రైస్తవుడు నడిచేందుకు అది విశాలంగా వుంది. మన పోషణకు సంతోషానికి అవసరమైన వాటిని ఆయన సమృద్ధిగా అనుగ్రహించాడు. అయితే, ఆరోగ్యాన్ని కాపాడి దీర్ఘాయుషు ఇచ్చేందుకు అగత్యమయ్యే స్వాభావికాహారాన్ని మనం తిని ఆనందించేందుకు ఆయన మన తిండిని నియంత్రిస్తున్నాడు. అస్వాభావిక తిండి గురించి జాగ్రత్త; దాన్ని నియంత్రించండి, త్యాగం చెయ్యండి. వక్రతిండి అలవాటు చేసుకుంటే, మన దేహానికి సంబంధించిన చట్టాల్ని అతిక్రమించి, మన శరీరాల్ని దుర్వినియోగం చెయ్యటానికి, వ్యాధి కొని తెచ్చుకోటానికి మనమే బాధ్యత వహిస్తాం. CDTel 67.2