ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

46/475

పరిశుద్ధీకరణా లేక శిక్షా

అపొస్తలుడు పౌలు సంఘానికి ఈ హితవు పలుకుతున్నాడు, “కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది.” కనుక మనుషులు పాప వ్యసనాలవల్ల తమ శరీరాల్ని అపవిత్రపర్చుకోవచ్చు. అపరిశుద్ధులైతే, వారు ఆధ్యాత్మిక ఆరాధనకు అపాత్రులు, పరలోకానికి అయోగ్యులు. దేవుడు తన కృపలో మానవుడికి ఆరోగ్య సంస్కరణ పై ఇచ్చే వెలుగును అతడు ప్రేమిస్తే, సత్యం ద్వారా పరిశుద్ధుడై నిత్యజీవానికి అర్హుడవుతాడు. కాగా అతడు ఆ వెలుగును అలక్ష్యం చేసి స్వాభావిక చట్టానికి విరుద్ధంగా నివసిస్తే అతడికి శిక్ష తప్పదు. CDTel 65.1