ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

36/475

“సమస్తమును దేవుని మహిము కొరకు చేయుడి”

(1896) స్పెషల్ టెస్టిమెనీస్, సీరీస్ A, నెం.9, పు. 58 CDTel 50.1

75. అపోస్తులుడైన పౌలు దైవాత్మ ఆవేశం వల్ల రాస్తూ “మీరేమి చేసినను” అంటే అన్నపానాలు తీసుకునే సామాన్య కార్యం చేసినా వక్రభోజన వాంఛలను తృప్తి పర్చుకోటానికి గాక బాధ్యత గుర్తింపుతో “సమస్తము దేవుని మహిమ కొరకు చేయుడి” అంటున్నాడు. మనుషుడు శరీరంలోని ప్రతీ భాగాన్ని కాపాడుకోవాలి. మనం లోపలకి తీసుకునేది ఉన్నతమైన పరిశుద్ధమైన ఆలోచనల్ని మనసులో నుంచి బహిష్కరించకుండేటట్లు జాగ్రత్తపడాలి. తెలివిగా తినాల్సిన అవసరం గురించి, తమ అలవాట్లను దేవుడు స్థాపించిన చట్టాలకు అనుగుణంగా సరిదిద్దుకోవాలని మనం సూచించినప్పుడు వారికి ఒనగూడే గొప్ప మేలును మనం తమకు దక్కకుండా చేయటానికి ప్రయత్నిస్తున్నట్లు, నేను నా ఇష్టప్రకారం చేయకూడదా? అని కొందరు ప్రశ్నిస్తారు. CDTel 50.2

ప్రతీ వ్యక్తికీ హక్కులుంటాయి. మనకు మన సొంత వ్యక్తిత్వం, గుర్తింపు వుంటాయి. తమ గుర్తింపును ఇంకొకరి గుర్తింపు కింద దాచివుంచలేరు. అందరూ తమంతట తాము తమ మనస్సాక్షి ప్రకారం వ్యవహరించాలి. మన బాధ్యత ప్రభావాల సందర్భంగా మన జీవితానికి దేవునిమీద ఆధారపడూ ఆయనకు అనుకూలంగా నివసించాలి. జీవం మానవులిచ్చేది కాదు. దేవుడు మాత్రమే ఇచ్చేది. ఆయన మనల్ని సృజించాడు. మనం ఆయనకు చెందుతాం. మనల్ని సృజించినందుచేత విమోచించినందుచేత మనం ఆయనవారం. మన దేహాలు మనవి కావు మన ఇష్టం వచ్చినట్లు వ్యవహరించటానికి. మన అలవాట్ల వల్ల వాటికి వైకల్యం కలిగించి తద్వారా దేవునికి పరిపూర్ణ సేవ చెయ్యటం అసాధ్యపర్చటానికి అవి మనవి కావు. మన జీవితాలు మన శక్తి సమర్థతలు మొత్తం ఆయనకు చెందుతాయి. ప్రతీ నిమిషం మనల్ని ఆయన కాచి కాపాడుతున్నాడు. ఆయన సజీవ శరీర యంత్రాంగాన్ని పనిచేయిస్తాడు. మనం ఒక్క క్షణం దాన్ని నడపడం జరిగితే మనం మరణిస్తాం. మనం సంపూర్తిగా ఆయన మీద ఆధారపడి నివసిస్తున్నాం. CDTel 50.3

దేవునితో మన సంబంధాల్ని మనతో దేవుని సంబంధాల్ని మనం అవగాహన చేసుకున్నప్పుడు మనం గొప్ప పాఠం చేర్చుకుంటాం. “మీరు మీ సొత్తుకారు. విలువ పెట్టి కొనబడినవారు” అన్న మాటలు మన వరాలకి, మన ఆస్తికి, మన ప్రభావానికి, వ్యక్తులంగా మనకు దేవుడు హక్కుదారుడని గుర్తుంచుకొనేందుకు మన మనోమందిరంలో వేలాడ గట్టు కుని వుంచుకోవాలి. క్రీస్తు కొన్నవారిగా మనం ఆయనకు ఆరోగ్యంతో పరిమళించే సేవ చేసేందుకు మనసు, ఆత్మ, శరీరాల్లో దేవుడిచ్చిన ఈ వరాన్ని మనం ఎలా ఉపయోగించాలో నేర్చుకోవాలి. CDTel 51.1

(1868) 2T60 CDTel 51.2

76. ఆరోగ్య సంస్కరణ విషయమై, ఈ చివరి దినాల్లో అన్ని విషయాల్లోనూ మితానుభవం పాటించటానికి దైవ ప్రజల పై ఉన్న బాధ్యత విషయమై, మీ మార్గంలో వెలుగు ప్రకాశిస్తున్నది. వెలుగును చూడటానికి, ఆహారపానాల విషయంలో, పనిచెయ్యటం విషయంలో వెనుకబడి వున్నవారి సంఖ్యలో మీరు ఉండటం నేను చూశాను. సత్యపు వెలుగును అంగీకరించి అనుసరించే కొద్దీ దాని ద్వారా పరిశుద్ధీకరణ పొందేవారందరి జీవితాల్లోనూ ప్రవర్తనలోనూ అది సంపూర్ణ దిద్దుబాటు కలిగిస్తుంది. CDTel 51.3