ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు
విజయవంతమైన జీవితానికి సంబంధం
Y.I., మే, 1894 CDTel 51.4
77. తినటం, తాగటం, దుస్తులు ధరించుకోటం ఇవన్నీ మన ఆధ్యాత్మికత అభివృద్ధిని ప్రభావితం చేస్తాయి. CDTel 51.5
(1905) M.H.280 CDTel 51.6
78. తమ చుట్టూ ఉన్న అన్యులు తినే అనేక ఆహార పదార్థాలు తాము తినకూడదని ఇశ్రాయేలీయుల్ని దేవుడు ఆదేశించాడు. ఇది ఏకపక్షంగా చూపించిన విచక్షణకాదు. నిషేధించబడ్డ పదార్థాలు ఆరోగ్యానికి హాని కలిగించేవి. అవి అపవిత్రమన్న ప్రకటన హానికరమైన ఆహార పదార్థాల వినియోగం శరీరాన్ని అపవిత్రపర్చుతుందన్న పాఠం బోధిస్తుంది. శరీరాన్ని పాడుచేసేది ఆత్మను పాడు చేస్తుంది. వినియోగదారుణ్ని అది దేవునితో సహవాసానికి, ఉన్నత పరిశుద్ధ సేవకు అనర్హుణ్ని చేస్తుంది. CDTel 51.7
హెల్త్ రిఫార్మర్, సెప్టెంబర్, 1871 CDTel 52.1
79. మనం మన దేహాలకి హాని చేసుకునేంతగా తిండి వాంఛను తీర్చుకుంటుండగా, జీవిత డంబం మనల్ని అదుపుచేస్తుండగా దేవుని ఆత్మ మనకు చేయూతనిచ్చి క్రైస్తవ ప్రవర్తనను పరిపూర్ణం చేసుకోటానికి సాయం చెయ్యటానికి ముందుకు రాదు. CDTel 52.2
(1870) 2T400 CDTel 52.3
80. దేవ స్వభావంలో పాలివారయ్యేవారందరూ దురాశను అనుసరించటం వలన లోకంలో ఉన్న, భ్రష్టత్వాన్ని తప్పించుకుంటారు. తిండి వాంఛలో తలమునకలైనవారు క్రైస్తవ సంపూర్ణతను సాధించటం అసాధ్యం . CDTel 52.4
R.&H., జన. 25 (1881) CDTel 52.5
81. ఇది నిజమైన పరిశుద్దీకరణ, అది ఓ సిద్ధాంతంగాని, భావోద్రేకంగాని మాటల తీరుగాని కాదు. అది ఓ సజీవ, క్రియాత్మక, దైనందిన జీవితంలో ప్రవేశించే నియమం. ప్రభువుకి మన శరీరాన్ని చెడు అలవాట్ల వల్ల భ్రష్టమైన యాగంగా కాక “పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా” సమర్పించేందుకు ఆహారపానాలు వస్త్రధారణ విషయాల్లో మన అలవాట్లు శారీరక, మానసిక, నైతిక ఆరోగ్యాన్ని కాపాడేవిగా ఉండటం ఎంతో అవసరం. సందర్భానికి 254 చూడండి] CDTel 52.6
(1900) 6T 372 CDTel 52.7
82. మనం లోకానికి చెందిన వారమో, ప్రభువు తన శక్తిమంతమైన సత్యఖడ్గంతో లోకంనుంచి వేరుచేసినవారి సంఖ్యలో నివారమో ఆహారపానాల విషయంలో మన అలవాట్లు బయలుపర్చుతాయి. CDTel 52.8
ఉత్తరం 135,1902 CDTel 53.1
83. మితంలేని తిండి తీవ్ర అశక్తత కలిగించి దేవునికి చెందాల్సిన మహిమను దోచుకుంటుంది. ఆత్మోపేక్ష పాటించనందువల్ల దైవప్రజలు దేవుడు తమముందుంచిన ఉన్నత ఆధ్యాత్మిక ప్రమాణాన్ని చేరలేకపోతున్నారు. వారు పశ్చాత్తాపపడి, మారుమనసు పొందినా స్వార్థాన్ని జయించలేకపోటం ద్వారా పొందే నష్టాన్ని నిత్యత్వ మే తెలుపుతుంది. CDTel 53.2
(1909) 9T 165,166 CDTel 53.3
84. ఆరోగ్యంలో ఆధ్యాత్మిక వరాల్లో దేవుడు దాచి ఉంచిన గొప్ప దీవెనల్ని పోగొట్టుకునే వారి సంఖ్య ఎంత పెద్దది! ఏదో గొప్ప కార్యం చేసేందుకు ప్రత్యేక విజయాలకోసం ప్రత్యేక దీవెనలకోసం పోరాడే వారు చాలామంది ఉన్నారు. ఈ కార్య సిద్ధికి కన్నీటి ప్రార్థనతో పోరాడటం అవసరమని వారు ఎప్పుడు భావిస్తారు? వెల్లడైన దైవ చిత్రాన్ని తెలుసుకోటానికి ఈ వ్యక్తులు లేఖనాల్ని పరిశోధించి అప్పుడు ఏమీ మినహాయింపు లేకుండా హృదయపూర్వకంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చినప్పుడు వారికి విశ్రాంతి లభిస్తుంది. వారి హృదయ వేదన, వారి కన్నీరు వారి పోరాటాలు తాము ఆశించిన దీవెనను తేలేవు. వారు తమను తాము పూర్తిగా సమర్పించుకోవాలి. విశ్వాసంతో అడిగే వారందరికీ వాగ్దానం చెయ్యబడున్న దైవకృపాబాహుళ్యాన్ని సొంతం చేసుకుంటూ వారు తమ ముందున్న పనిని చేయాలి. CDTel 53.4
యేసన్నాడు, “ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువ నెత్తికొని నన్ను వెంబడింపవలెను.” లూకా. 9:23. ఆయన చూపించిన సామాన్యతను ఆత్మత్యాగ స్ఫూర్తిని కలిగి మనం రక్షకుని వెంబడిద్దాం. మాటలోనూ, పరిశుద్ధ జీవితంలోనూ కల్వరి ప్రభువుని ఘనపరుద్దాం. ఎవరు తమను తాము దేవునికి అంకితం చేసుకుంటారో వారికి రక్షకుడు చేరువలో వుంటాడు. మన హృదయాల్లోనూ జీవితాల్లోనూ దైవాత్మ పనిచేయాల్సిన అవసరం ఎప్పుడైనా ఉంటే అది ఇప్పుడే. పరిశుద్ధంగా నివసించటానికి, మనల్ని మనం దేవునికి సమర్పించుకోటానికి శక్తికోసం ఈ దివ్యశక్తిని ఆశ్రయిద్దాం . CDTel 53.5
85. మన ఆది తల్లిదండ్రులు ఆహార వాంఛ మూలంగా ఏదెనును పోగొట్టుకున్నారు. కనుక ఏదెనుని తిరిగి సంపాదించటానికి మనకున్న ఒకే నిరీక్షణ ఆహార వాంఛను శరీరాశను ఉపేక్షించటం, ఆహారంలో మితం, ఉద్రేకాల విషయంలో నిగ్రహం మేధను కాపాడి, మానసికంగాను నైతికంగాను శక్తినిచ్చి, మనుషులు తమ ప్రవృత్తుల్ని ఉన్నత శక్తి అదుపులో ఉంచటానికి, మంచిని చెడును, పరిశుద్ధ విషయాల్ని సామాన్య విషయాల్ని గ్రహించటానికి తోడ్పడుతుంది. శోధనను ఎలా ప్రతిఘటించాలో తన జీవితం ద్వారా మానవుడికి చూపించటానికి క్రీస్తు పరలోకంలో తన గృహాన్ని విడచి ఈ లోకానికి రావటంలో చేసిన త్యాగాన్ని గూర్చిన జ్ఞానం గల వారందరూ తమ్మును తాము ఉపేక్షించుకుని క్రీస్తు శ్రమల్లో ఆయనతో పాలు పొందటానికి ఎంపిక చేసుకుంటారు. CDTel 54.1
యెహోవాయందు భయం జ్ఞానానికి మూలం. క్రీస్తు జయించినట్లు జయించే వారు సాతాను శోధనలనుంచి నిత్యం తమని తాము కాపాడుకుంటారు. సాతాను కార్యాలు, మోసాలు దేవుని కృపాకార్యాలుగా భాష్యం చెప్పటం జరగకుండేందుకు గాను మేథకు హాని కలగకుండటానికి, గ్రహణశక్తి నిర్మలంగా ఉండటానికి తిండి ప్రీతి ఉద్రేకాలు మనస్సాక్షి నియంత్రణ కింద ఉండాలి. జయించే వారు పొందాల్సి ఉన్న చివరి బహుమానాన్ని విజయాన్ని అనేకులు ఆశిస్తారు గాని శ్రమను, కష్టాన్ని, ఆత్మోపేక్షను తమ విమోచకునిలా భరించటానికి ఇష్టపడరు. విధేయత ద్వారా నిరంతర కృషి ద్వారా మాత్రమే క్రీస్తు జయించినట్లు మనం జయించగలుగుతాం. CDTel 54.2
ఆహార వాంఛ కున్న నియంత్రణ శక్తి అనే కుల నాశనానికి కారణమౌతుంది. వారు ఈ వాంఛను జయించివుంటే, సాతాను కలిగించే ప్రతీ ఇతర శోధనను జయించటానికి వారికి నైతిక శక్తి వుండేది. అయితే తిండి వాంఛకు బానిసలయ్యేవారు క్రైస్తవ ప్రవర్తన నిర్మాణంలో వైఫల్యం చెందుతారు. ఆరువేల సంవత్సరాలుగా తెంపులేకుండా సాగుతున్న పాపం ఫలితంగా వ్యాధి, బాధ, మరణం వచ్చాయి. అంత్యకాలం సమీపించే కొద్దీ ఆహారం విషయంలో సాతాను శోధన మరింత శక్తిమంతమై జయించటం కష్టతరమౌతుంది. CDTel 54.3
[C.T.B.H.10] (1890) C.H.22 CDTel 55.1
86. ఆరోగ్య సంస్కరణ పై దేవుడిచ్చిన వెలుగును అవలంబించేవాడు సత్యం ద్వారా పరిశుద్ధుడై అమర్త్యతకు సిద్ధపడే పనిలో ప్రాముఖ్యమైన సహాయాన్ని పొందుతాడు. CDTel 55.2
[సౌదా ఆహారానికి ఆధ్యాత్మిక సూక్ష్మపరిశీలనకు సంబంధం — 119] CDTel 55.3
[ఆహారవాంఛ నియంత్రణ వైఫల్యం శోధన ప్రతిఘటనను బలహీన పర్చుతుంది-237] CDTel 55.4
[ఆత్మ నిగ్రహగోడలు కూల్చబడరాదు-260] CDTel 55.5
[మాంసాహారం ఆధ్యాత్మికాభివృద్ధికి అంతరాయం - 655,656,657, 660,682,683,684,688] CDTel 55.6
[తిండి వాంఛను జయించే వారికి ఇతర శోధనల పై విజయానికి శక్తి అనుగ్రహించ బడుతుంది-253] CDTel 55.7
[అన్న కోశపు అజాగ్రత్త ప్రవర్తన నిర్మాణానికి ప్రతిబంధకం-719] CDTel 55.8