ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

31/475

భౌతిక చట్ట ఉల్లంఘనకు మానసిక పర్యవసానాలు

(1909) 9T156 CDTel 38.4

55. తన ప్రజలు నిరంతరం పురోగమించాలని దేవుడు కోరుతున్నాడు. మానసిక అభివృద్ధికి ఆత్మపరిశుధ్ధతకు మితిమీరిన తిండి పెద్ద ప్రతిబంధకమని మనం గ్రహించాలి. ఆరోగ్య సంస్కరణను ఆచరిస్తున్నట్లు చెప్పుకుంటున్నా మనలో అనేకమంది చెడుతిండి తింటూనే ఉన్నారు. CDTel 38.5

(1905) M.H.307 CDTel 38.6

56. వారంలోని తక్కిన రోజులకన్నా సబ్బాతు దినానికి ఎక్కువ ఆహారాన్నిగాని పలురకాల ఆహారపదార్థాల్ని గాని తయారు చేయకూడదు. ఆమాటకొస్తే ఆ రోజు ఆహారం మరింత సాదాసీదాగా ఉండాలి. అది కూడా తక్కువ తినాలి. ఆధ్యాత్మిక విషయాల్ని అవగాహన చేసుకోటానికి మనసును నిర్మలంగా బలీయంగా ఉంచేందుకు ఇది తోడ్పడుతుంది. ఆహారంలో కూరుకుపోయిన పొట్ట అంటే మూసుకుపోయిన మెదడు, అనుచిత ఆహారంవల్ల అస్తవ్యస్తమయ్యే మనసు కారణంగా విలువైన మాటలు వినిపించవచ్చు కానీ వాటిని మనసు అభినందించకపోవచ్చు. సబ్బాతు నాడు అతిగా తినటం మూలాన అనేకులు - తాము గుర్తించే దానికన్నా ఎక్కువగా - ఆనాటి పరిశుద్ధ తరుణంనుంచి ఆధ్యాత్మిక లబ్ది పొందటానికి తమని తాము అసమర్థుల్ని చేసుకుంటారు. CDTel 38.7

(1882) 5T162,164 CDTel 39.1

57. మన శిబిర సమావేశాలు కొన్ని ప్రభువు సంకల్పించిన వాటికన్నా ఎంతో భిన్నంగా ఉంటున్నాయని దర్శనంలో నాకు వివరించటం జరిగింది. ప్రజలు పరిశుద్ధాత్మ ప్రత్యేక సందర్శనానికి సిద్ధపడకుండా వస్తారు. సాధారణంగా సమావేశాలకు చాలా ముందు సహోదరీలు వెలపలి అలంకారం నిమిత్తం బట్టలు తయారుచేసుకోటానికి సమయం గడిపి దేవుని దృష్టికి అమూల్యమైన లోపలి అలంకారాన్ని కూర్చుకోటం మర్చిపోతుంటారు. అనవసరమైన వంటకాలు, పయిలు, కేకులవంటి ఇతర తినుబండారాలు తయారు చెయ్యటంలో ఎంతో సమయం గడపటం జరుగుతుంది. ఈ పదార్థాలు వాటిని తినే వారికి గొప్ప హాని చేస్తాయి. మన సహోదరీలు మంచి బ్రెడ్ (ఆహారం) ఇతర రకాల ఆరోగ్యదాయక ఆహారం తయారుచేస్తే వారూ వారి కుటుంబీకులు జీవవాక్కుల్ని అభినందించటానికి మెరుగుగా సిద్ధపడి పరిశుద్ధాత్మ ప్రభావానికి మరింత సుముఖంగా ఉంటారు. CDTel 39.2

తరచు ఆహారంతో కడుపు భారంగా ఉంటుంది. అది ఇంటివద్ద తినే భోజనంలా సాదాగా సామాన్యంగా ఉండదు. అదీగాక ఇంటివద్ద రెండు మూడురెట్లు వ్యాయామముంటుంది. వ్యాయామం లేని తిండి మనసును మందగిల్ల జేయటంతో అది నిత్యజీవ సంబంధిత విషయాల్ని అభినందించలేదు... తినటానికి, బట్టలు ధరించటానికి, సిద్ధబాటుకు ప్రాధాన్యత ఇవ్వక గృహంలో హృదయ పరిశోధన ప్రారంభం కానివ్వండి. మితిలేని తిండి ప్రస్తుత కాల [సత్యాల అవగాహనను అడ్డుకుంటుంది-72] CDTel 39.3

[మితిలేని తిండి ఇంద్రియాల్ని స్తంభింపజేస్తుంది-227] CDTel 39.4

[మితిలేని తిండి మెదడును మందగిల్లజేస్తుంది-209,226] CDTel 39.5

[మితిలేని తిండి వ్యక్తిని ప్రణాళికలు వేసుకోటానికి, సలహాలివ్వటానికి అనర్హుణ్ణి చేస్తుంది-71] CDTel 39.6

[మితిలేని తిండి చిన్న పిల్లల ఆధ్యాత్మిక, మానసిక, శారీరక శక్తుల్ని బలహీన పర్చుతుంది-346] CDTel 39.7

[మండుతున్న వాక్యసత్యాల కింద నిద్రపోటం-222] CDTel 39.8

[మితాహారం వల్ల మానసిక, నైతిక శక్తి వృద్ధి - 85,117,206] CDTel 39.9

[మానసిక శక్తి పై మాంసాహార ప్రభావం-678,680,682,686] CDTel 39.10

[శిబిర సమావేశాల్లో ఆహారం పై మరింత ఉపదేశం-124] CDTel 39.11