ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు
ఇష్టపూర్వక అజ్ఞానం పాపాన్ని పెంచుతుంది
(1868) 2T.70,71 CDTel 37.2
53. శరీరాన్ని ఉత్తమ ఆరోగ్యస్థితిలో కాపాడుకోటం ఓ విధి. దేవుడు అనుగ్రహించిన వెలుగు ప్రకారం నివసించటం పవిత్రవిధి. మనం విడిచి పెట్టటానికి సిద్ధంగా లేని పొరపాట్లను చూడాల్సివస్తుందన్న భయంతో వెలుగుకి కళ్ళు మూసుకుంటే, మన పాపాలు తక్కువవవు. పెరుగుతాయి. వెలుగును చూడకుండా ఒక సందర్భంలో కళ్ళు మూసుకుంటే మరో సందర్భంలో దాన్ని లెక్కచేయక పోటం జరుగుతుంది. పది ఆజ్ఞలలో ఒక దాన్ని అతిక్రమించటం ఎంత పాపమో మన శరీరానికి సంబంధించిన చట్టాల్ని అతిక్రమించటం అంతే పాపం. దేవునికన్నా మన ఆహారాన్ని మన రుచుల్ని ఎక్కువగా ప్రేమిస్తుండగా మనం మన పూర్ణహృదయంతో మన పూర్ణమనసుతో మన పూర్ణఆత్మతో మన పూర్ణబలంతో ప్రభువుని ప్రేమించలేం. మనపూర్ణ బలాన్ని పూర్ణమనసును ఆయన కోరుతుండగా ఆయన్ని మహిమపర్చటానికి మన బలం రోజుకిరోజు క్షీణిస్తుంది. మన చెడు అలవాట్ల వల్ల మన ఆయువుని తగ్గించుకుంటున్నాం. అయినా మనం క్రీస్తు అనుచరులుగా చెప్పుకుంటూ అమర్త్యతకు చివరి మెరుగులు దిద్దుకోటానికి ఆయత్తమవుతుంటాం. CDTel 37.3
నా సోదరా, నా సోదరీ, నీవు చెయ్యటానికి ఓ పని వుంది. ఇంకొకరు నీ కోసం దాన్ని చెయ్యలేరు. నీ సోమరితనాన్ని విడిచి పెట్టు. క్రీస్తు నీకు జీవాన్నిస్తాడు. నీ జీవన సరళిని మార్చుకోవాలి. నీ ఆహారపానాల్లో నీ పని వేళల్లో మార్పు చోటుచేసుకోవాలి. నీవు సంవత్సరాలుగా అనుసరిస్తున్న కార్యాచరణ విధానంలో పవిత్రమైన నిత్యజీవానికి సంబంధించిన విషయాల్ని స్పష్టంగా చూడలేకపోతున్నావు. నీ సున్నిత మనోభావాలు మొద్దుబారాయి. నీ మానసిక శక్తులు మసకబారాయి. కృపలోనూ, సత్యాన్ని గూర్చిన జ్ఞానంలోనూ పెరిగే తరుణమున్నా నీవు పెరగటం లేదు. ఆధ్యాత్మికతలో వృద్ధి సాధించటం లేదు. నీ చీకటి నానాటికీ ఎక్కువవుతున్నది. CDTel 37.4
(R.&.H. జూన్, 18, 1895) CDTel 38.1
54. మానవుడు దైవసృష్టికి కిరీటం. దేవుని స్వరూపంలో సృష్టి అయిన మానవుడు దైవసమానుడుగా వుండాలన్నది దేవుని ఉద్దేశం.... మానవుడు దేవునికి ప్రియుడు. ఎందుచేతనంటే అతడు దేవుని స్వరూపంలో సృష్టి అయ్యాడు. తనను లోకానికి చూపించటానికి దేవుడు నిర్మించిన శరీరాన్ని అమితమైన తిండివల్ల లేక ఏ ఇతర దురభ్యాసాలవల్ల అపవిత్రపరచటం పాపమని మన ఉఛ్ఛరణ ఆచరణ ద్వారా వెల్లడి చెయ్యటానికి ఈ సంగతి మనకు స్ఫూర్తినివ్వాలి. CDTel 38.2
స్పష్టంగా ప్రకటితమైన ప్రకృతి చట్టం - 97] CDTel 38.3