ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

311/475

విభాగం XXI—కొవ్వు పదార్థాలు

భాగం I - బటర్ ప్రగతిశీల సంస్కరణ

(1902) 7T 135 CDTel 360.1

579. ఆహార సంస్కరణ ప్రగతి శీలమవ్వాలి. పాలు గాని, బటర్ గాని ఉపయోగించకుండా ఆహారం ఎలా తయారుచెయ్యాలో ప్రజలకి నేర్పించాలి. మనుషుల మధ్య పెరుగుతున్న దుర్మార్థతకి ధీటుగా గుడ్లు, పాలు, వెన్న లేక బటర్ ఉపయోగించటంలో ప్రమాదం పెరిగే కాలం త్వరలో వస్తుందని వారికి చెప్పండి. పతనమైన మానవ జాతి దుర్మార్గత కారణంగా భూమికి శాపంగా ఉన్న వ్యాధుల తాకిడి కింద జంతు సృష్టి అంతా మూలిగే సమయం దగ్గరలోనే ఉన్నది. CDTel 360.2

ఇవి లేకుండా ఆరోగ్యవంతమైన ఆహారం తయారుచెయ్యటానికి తన ప్రజలకి దేవుడు సామర్థ్యాన్ని నేర్పుని ఇస్తాడు. మన ప్రజలు అనారోగ్యదాయకమైన రెసిపీలని విసర్జించాలి. CDTel 360.3

[జేమ్స్, ఎలెన్ వైట్ ఆరోగ్య విద్యా కృషిలో టీ, కాఫీ, మాంసాహారం, బటర్, మసాలాలకి వ్యతిరేకంగా “ఖచ్చితమైన సాక్ష్యం” 1871లో ఇచ్చారు - 803] CDTel 360.4

(1905) M.H.302 CDTel 360.5

580. బటర్ ని వంటలో వాడటం కన్నా చల్లని బ్రెడ్ కి పూసుకుని తినటం తక్కువ హానికరం. కాని దాన్ని అసలు వాడకుండా ఉండటం మంచిది. CDTel 360.6

[వేడి సోడా బిస్కెట్లు , బటర్-501] CDTel 360.7