ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

271/475

జావ

(1905) M. H.301 CDTel 325.11

489. జావ లేక గంజి చెయ్యటానికి ఉపయోగించే గింజల్ని కొన్ని గంటలు ఉడకుబెట్టాలి. అయితే మెత్తగా ఉన్న లేక ద్రవరూపంలో ఉన్న ఆహారం, పొడిగా ఉండి నమలటం అవసరమయ్యే ఘన ఆహార పదార్ధమంత ఆరోగ్యవంతం కాదు. CDTel 325.12

(Y.I. మే 31, 1894) CDTel 325.13

490. ఆరోగ్యదాయక ఆహారమంటే ఆహారంలో ఎక్కువ భాగం జావేనని కొందరు భావిస్తారు. జావ ఎక్కువగా తినటం జీర్ణమండల అవయవాలకి ఆరోగ్యాన్నివ్వదు. ఎందుకంటే అది చాలామట్టుకు ద్రవంలా ఉంటుంది. పండ్లు, కూరగాయలు, బ్రెడ్డు తినటం ప్రోత్సహించండి. జావ ఎక్కువగా ఉపయోగించటం పొరపాటు - 499] CDTel 325.14