ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

117/475

తవు సమాధుల్ని తమ పళ్లతో తవ్వుకోటం

(1880) 4T 408,409 CDTel 141.2

228. మన బోధకుల్లో అనేకులు జబ్బుపడటానికి కారణం వారు చాలినంత వ్యాయామం తీసుకోకపోటం, మితం లేకుండా తినటం. అలాంటి కార్యాచరణ మిక్కిలి బలమైన దేహతత్వాన్నయినా ప్రమాదంలో పడేస్తుంది. మీలాగ మందకొడి స్వభావం గలవారు చాలా మితంగా తినాలి. శరీర శ్రమను తప్పించుకోకూడదు. మన బోధకుల్లో అనేకమంది తమ సమాధుల్ని తమ పళ్లతో తవ్వుకుంటున్నారు. జీర్ణమండల అవయవాల పై భారాన్ని పరిష్కరించటంలో శరీరవ్యవస్థకు శ్రమ కలుగుతుంది. మెదడు తీవ్ర వాయు ఘాతానికి గురి అవుతుంది. ఆరోగ్య చట్టాల ప్రతీ అతిక్రమానికి అతిక్రమ దారుడు తన శరీరంలో శిక్షను అనుభవించాలి. CDTel 141.3